DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ అమలు చేయాలి

ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలి

మార్చి 3à°µ తేదీన జిల్లాల్లో ర్యాలీలు - యుటియఫ్‌

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, ఫిబ్రవరి 19, 2020

(డిఎన్‌ఎస్‌) :  à°Žà°¨à±à°¨à°¿à°•à°² ముందు ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సిపిఎస్‌) విధానం రద్దుచేసి పాత

పెన్షన్‌ అమలు చేయాలని యుటియఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు షేక్‌ సాబ్జీ, పి.బాబురెడ్డి à°’à°• ప్రకటనలో డిమాండ్‌ చేశారు. సిపిఎస్‌ రద్దు చేయాలని, పిఆర్‌సి

అమలు చేయాలని, 4 విడతల డిఏలు మంజూరు చేయాలని డిమాండ్స్‌తో మార్చి 3à°µ తేదీన జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. యుటియఫ్‌ రాష్ట్ర

కార్యదర్శి à°Ÿà°¿.రఘుపతిరెడ్డి అధ్యక్షతన à°ˆ రోజు (18.02.2020) విజయవాడలో సిపిఎస్‌ కార్యకర్తల వర్క్‌షాప్‌ జరిగింది. à°ˆ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న యుటియఫ్‌ రాష్ట్ర

అధ్యక్షులు షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దుపై à°—à°¤ ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేసిందని à°ˆ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని అన్నారు. మార్చి 31లోగా

అధికారుల కమిటీ రిపోర్టు ఇవ్వాలని ఉత్తర్వులున్నాయని, ఇప్పటికి ఒక్కసారి కూడా కమిటీ సమావేశం జరగలేదని అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వెంటనే పాత

పెన్షన్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.యుటియఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.బాబురెడ్డి మాట్లాడుతూ నూతన ప్రభుత్వం పిఆర్‌సి అమలు చేస్తుందని ఉద్యోగులు,

ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురు చూస్తుంటే పిఆర్‌సి కమిటీ కాలాన్ని పెంచుకుంటూ పోతున్నారని అన్నారు. 2018 జులై 1 నుండి పిఆర్‌సి అమలు చేయాలని, బకాయిలు ఉన్న 4 విడతల

కరువుభత్యం (డిఏ) ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లో సిపిఎస్‌ రద్దు, పిఆర్‌సి అమలు, డిఏ బకాయిలు చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలని

డిమాండ్‌ చేశారు. సిపిఎస్‌ రాష్ట్ర కన్వీనర్‌ క్రాంతికుమార్‌ మాట్లాడుతూ మార్చి 3à°µ తేదీన అన్ని కేంద్రాల్లో జరిగే ర్యాలీలు విజయవంతం చేయాలని సిపిఎస్‌

కార్యకర్తల వర్క్‌షాప్‌లో నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని జిల్లాల నుండి సిపిఎస్‌ కమిటీ కన్వీనర్‌లతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.à°ˆ సమావేశంలో యుటియఫ్‌

రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు షేక్‌ సాబ్జీ, పి.బాబురెడ్డి, సహాధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు à°Ž.కృష్ణసుందరరావు, à°Ÿà°¿.రఘుపతిరెడ్డి,

రాష్ట్ర సిపిఎస్‌ కన్వీనర్‌ క్రాంతికుమార్‌ పాల్గొన్నారు.


 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam