DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి లో  కోవిద్ 19 నుంచి రక్షణకై ఆటో ల్లో అవగాహన 

*ప్రజల సహకారం మరింత అవసరం : రాజమండ్రి ఎంపీ భరత్* 

*వెంటిలేటర్స్ కోసం 1 కోటి రూపాయలు యంపీ నిధులు కేటాయింపు* 

 *(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్,

అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 18, 2020 (డిఎన్ఎస్) : కోవిద్ 19 మహమ్మారి రాక్షసుని బారి న పడకుండా ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు రాజమహేంద్రవరం లో ఆటో ల ద్వారా

ప్రచారాన్ని చేపట్టారు. వీటిని రాజమహేంద్రవరం లోక్ సభ సభ్యులు మార్గాని భరత్ రామ్ శనివారం ప్రారంభించారు.  à°¶à±†à°¨à°¿à°µà°¾à°°à°‚ నాడు రాజమహేంద్రవరం వీఎల్ పురంలోని యంపీ

కార్యాలయం వద్ద కోవిద్ 19 వైరస్ నివారణపై ప్రజలకు సరైన అవగాహన కలిగించే విధంగా ప్రచార బేనర్లు ఏర్పాటుచేసిన 25 ఆటోలను యంపీ భరత్ రామ్ జెండాఊపి ప్రారంభించారు. ఈ

ఆటోలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై స్ జగన్ మోహన్ రెడ్డి సందేశం, యంపీ భరత్ రామ్ సూచనలు వినిపించే విధంగా మైకులు ఏర్పాటు చెయ్యడంతో పాటు " సమైక్యంగా పోరాడుదాం కరోనా

మహమ్మారిని నిర్మూలిద్దాం", పరిశుభ్రత, సామజిక దూరం పాటించడం పై నినాదాల గల బోర్డులు ఏర్పాటుచేశారు.

ఈ సందర్భంగా యంపీ భరత్ రామ్ మాట్లాడుతూ ప్రపంచాన్ని

వణికింపజేస్తున్నకరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి మనం అందరం కలసికట్టుగా పనిచేయాలని దీనికి నివారణే సరైన మార్గం అని, అందువలన సామజిక దూరంపాటించడం

ముఖ్యమైనదని అన్నారు అందుచేతనే ప్రధానమంత్రి మోడీ మే 3 వ తారీకు వరకు లొక్డౌన్ పొడగించారని అన్నారు. తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవడం బయటినుంచి వచ్చిన వారు

దుస్తులు కూడా శుభ్రపరుకోవలసిన అవసరం ఉందన్నారు. ఉదయం ఆరుగంటలకు నిత్యవసర వస్తువులు కొనుగోలు కోసం కొంత వెసులు బాటు ఇస్తుండగా పని ఉన్నవాళ్లు లేని వాళ్ళు కూడా

రోడ్లపైకి వస్తున్నారు అన్నారు, ఇంటికి ఒక్కరు మాత్రమే నిత్యవసర వస్తువులు కొనుగోలుకు బయటకు వచ్చి తామనితాము కాపాడుకోవడంతోపాటు పక్కవారిని

కాపాడాలన్నారు. 

ప్రజాసేవలు చేస్తున్న పోలీస్, డాక్టర్లు, రెవిన్యూ, పారా మెడికల్ సిబ్బంది మరియు పారిశుధ్య సిబ్బంది ప్రాణాలు సైతం లెక్కచెయ్యకుండా విధులు

నిర్వహిస్తున్నందున వారికీ కృతఙయ్నతలు తెలియజేయాలన్నారు. రాబోయే రోజులలో రెడ్ జోన్లను గ్రీన్ జోన్లుగా చెయ్యడానికి అందరు సహకరించాలన్నారు. ఈ దిశగా రాష్ట్ర

ముఖ్యమంత్రి వై స్ జగన్ మోహన్ రెడ్డి క్వారంటైన్లు, ఐసొలేషన్లు, వెంటిలేటర్స్ ఏర్పాటు మొదలైన సదుపాయాలని కలిపిస్తున్నారని అన్నారు. 

ఈ ఆటోల ప్రారంభోత్సవ

కార్యక్రమములో మాజీ శాసనసభ్యులు రౌతు సూర్య ప్రకాష్ రావు, డాక్టర్ ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam