DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్కూల్ జోన్ల లో స్పీడ్ బ్రేకర్లు కూడా వెయ్యడం చేతకాదా ?

విశాఖపట్నం, జులై  31, 2018  (DNS Online): అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహా విశాఖ నగరం లో జన సంచారం కూడా పెరుగుతూనే ఉంది. దానికి అనుగుణంగా గృహవాసాలు, విద్యాలయాలు కూడా

పెరుగుతూనే ఉన్నాయి. విశాఖ నగరం లోని ద్వారకానగర్ లో దశాబ్దాల చరిత్ర కల్గిన విద్యాలయాలు నిర్మాణం చేసినప్పుడు కనీసం రోడ్లు కూడా లేవు. ఇప్పుడు రహదార్లు తయారై,

వాహనాల సంచారం విస్తృతంగా పెరిగిపోయాయి. దశాబ్దాల క్రితం ఊరికి దూరంగా నిర్మించిన పాఠశాలలు నేడు నగరం నడిబొడ్డులోకి వచేసినట్టుగా మారిపోయాయి. వాహనాల హడావిడి

బాగా పెరిగిపోయిన ఇప్పుడు. à°ˆ పాఠశాలలకు వెళ్లే చిన్నారులకు à°ˆ వాహనాలు పెద్ద  à°—ండాలుగా మారిపోయాయి. సరిగ్గా అలాంటిదే ద్వారకానగర్ లోని శ్రీ కృష్ణ విద్యామందిర్. à°ˆ

పాఠశాల నిర్మాణం జరిగినప్పుడు రహదారులు సైతం పూర్తిగా లేవు. నేడు అత్యంత ట్రాఫిక్ కల్గిన రోడ్లుగా తయారయ్యాయి. ఈ పాఠశాల ముందు నుంచి రహదారి ఉండడంతో పాఠశాల

సమయాల్లో ఉదయం, సాయంత్రం ద్విచక్ర వాహనాలు, కార్లు, లారీలు, ఆటోలు నిత్యం హడావిడిగా మారిపోయాయి. బైకులు, కార్లు సైతం అత్యంత వేగంగా నడుపుతూ, ఇక్కడ స్కూల్ ఉండనే

కనీసం ఇంగితం లేకుండా కళ్ళు బైర్లు కమ్మినట్టు ప్రవర్తిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేడు. స్కూల్ కి వెళ్లే పిల్లలని నిత్యం భయభ్రాంతులని చేస్తున్నాయి. ఈ

స్కూల్ కి ముందు స్కూల్ జోన్ అని వ్రాసి ఉన్నా పట్టించుకునే వాడే లేడు. దీనిపై గతం లో పాఠశాల యాజమాన్యాలు సంబంధిత కార్పొరేటర్లకు ( ప్రజా ప్రతినిధులకు)

 à°à°¨à±à°¨à°¿à°®à°¾à°°à±à°²à± ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదు. నేడు స్థానిక ప్రజా కౌన్సిల్ లేదు. సమస్యలు పట్టించుకునే నాధుడే లేడు. ఇటీవల à°ˆ ప్రాంతం లో పర్యటించిన

విశాఖ ఉత్తర నియోజక వర్గం శాసన సభ్యులు విష్ణు కుమార్ రాజు కు ఈ స్కూల్ రహదారి పై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చెయ్యమని కోరడం జరిగింది. ఇదే విషయమై గతం లో ప్రభుత్వ

అధికారులకు ఎన్నో మార్లు చెప్పడం జరిగిందని, ఏళ్ళు గడుస్తున్నా పట్టించుకోలేదని ఫిర్యాదు చెయ్యడం కూడా జరిగింది. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ అతి త్వరలోనే ఈ

పాఠశాలకు వెళ్లే పిల్లలకు ఇబ్బంది కలుగకుండా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. 
ఇది ఏ ఒక్క స్కూల్ కో కల్గిన ఇబ్బంది కాదు,

చాలా స్కూళ్ళకి పట్టిన అవస్తలే ఇవి. అటు పాఠశాలలో పట్టించుకోవు, ఇటు ప్రభుత్వ అధికారులూ పట్టించుకోరు. వీరిద్దరి మధ్య చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రక్క

విద్యాశాఖ ఇబ్బడి ముబ్బడిగా స్కూళ్ల à°•à°¿ అనుమతి ఇస్తుండడం గమనార్హం. 

 

#dns #dns news #dnslive #dnsnews #visakhapatnam #vizag #schools #sisu mandir 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam