DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాలిథిన్ కు ప్రత్యామ్నాయ పునరుత్పత్తి చేసే పిఎల్ఏ వస్తువుల తయారీ 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  07, 2022 (డిఎన్ఎస్):*  పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాలిథిన్ కు ప్రత్యామ్నాయంగా పి ఎల్ ఏ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకు వస్తున్నారు విజయనగరం కు చెందిన ఓ సామాజిక కార్యకర్త, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్త గుమ్ములూరు విశాల. ప్రస్తుతం

తెలంగాణ లో భాగ్యనగరం లో స్థిరపడిన ఈమె అక్కడే స్థానిక మూసాపేట్ లో ఈ కొత్త స్టార్ట్ అప్ యూనిట్ ను ప్రారంభించారు. ఈ తరహా యూనిట్ల ను మరిన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన వసరం ఎంతైనా ఉంది. 

పాలిథిన్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా సంచీలు, బాగ్ లు తయారు చెయ్యడానికి ఓ స్టార్ట్ అప్ సంస్థను

ప్రారంభించారు. 

నిసర్గ పేరిట పునరుత్పత్తి చేసే వస్తువులను తయారు చేసేందుకు ఒక స్టార్ట్ అప్ సంస్థను ప్రారంభించారు. 
పి ఎల్ ఏ  గా పిలువబడే పోలి ఆక్టిక్ రసాయనాలు (  మొక్కజొన్న పిండి, చెరకు పిండి, కర్రపెండలం తదితర ముడిపదార్ధాలతో నుంచి తయారు చేసిన పునార్తుపట్టి చేసుకోగలిగిన, స్వయం సిద్ద ముడిపదార్ధాలతో

కూడిన  మోనోమర్ ) కూడిన మిశ్రమంతో ఉత్పత్తులను వినియోగించి పలు ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ఇవి 6 నెలల సమయంలోగా భూమిలో కరిగిపోతాయని ఉత్పత్తిదారులు తెలియచేస్తున్నారు. 

సమాజ హితమైన ఉత్పత్తులను అందించాలని, గత కొన్ని నెలలులుగా పరిశోధనలు, సర్వేలు జరుగుతున్నామని వివరించారు. 

ప్రధానంగా

పర్యావరణాన్ని కలుషితం చేసే కర్బనం వాయువులు ప్రభావం తగ్గించాలనే సంకల్పంతో పి ఎల్ ఏ ఆసిడ్ పదార్ధాలతో ఈ యూనిట్ ని ప్రారంభించడం జరిగిందన్నారు. తద్వారా విష వాయువుల ప్రభావం,  కాలుష్య ప్రభావం ఉండదని, వివరించారు. పాలిథిన్ ఉత్పత్తులకు ధీటుగా ఈ పి ఎల్ ఏ ప్రోడక్ట్ లు ఉత్పత్తి వస్తువుతో పాటు  పాలిథిన్ ధర మాదిరిగానే అంతే

ఉంటుందన్నారు.       

ఔత్సాహికుడైన యువ ఇంజనీర్ సహకారంతో పాలిథిన్ కు ప్రత్యామ్నాయంగా పునరుత్పత్తి చేయగలిగిన సంస్థ లో ఆహారం తీసుకునే సంచీలు, కవర్లు , ఇళ్ళల్లోనే వినియోగించే చెత్త బుట్ట సంచీలు, చెత్త బుట్టలు, సామాగ్రి  నిలవ చేసుకునే డబ్బాలు వివిధ మోడళ్ల లో తయారు చేసేందుకు ఈ యూనిట్ ను

ప్రారంభించారు. 

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam