DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉమ్మడి అర్హతా పరీక్ష ద్వారా సమయం, వనరులు ఆదా:

*రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రా రెడ్డి* 

*అమరావతి,  సెప్టెంబర్ 04, 2020 (డిఎన్ఎస్):*  దేశంలో  యాభై శాతానికి పైగా ఉన్న యువతకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకు వచ్చిన జాతీయ ఉద్యోగ నియామక ఏజెన్సీ (ఎన్.ఆర్.ఎ) ద్వారా ఉమ్మడి అర్హత పరీక్ష నిర్వహించడం వల్ల  సమయం, వనరులు ఆదాతో పాటు ఉద్యోగార్థులకు

వత్తిడి తగ్గుతుందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ శ్రీ కె. హేమచంద్రా రెడ్డి అన్నారు.కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన  రీఙనల్ ఔట్ రీచ్ బ్యూరో,విజయవాడ నేడు "ఒకే దేశం -ఒకే పరీక్ష :అవకాశాలు మరియు సవాళ్ళు"అనే అంశం ఫై  నిర్వహించిన వెబినార్ లో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.ఈ విధానం వల్ల

గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ముఖ్యంగా మహిళా ఉద్యోగార్ధులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీ డి. మురళీ మోహన్ మాట్లుడుతూ నూతన పరీక్షా విధానం వలన పారదర్శకతతో పాటు అందరికీ సమాన అవకాశాలు కలుగుతాయని అన్నారు. 
ఈ కార్యక్రమం లో  రీఙనల్ ఔట్ రీచ్ బ్యూరో

 అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. శ్రీనివాస్ మహేష్,కడప క్షేత్ర ప్రచార కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ శివ హరి  నాయక్,నెల్లూరు  క్షేత్ర ప్రచార అధికారి బి.  తారక ప్రసాద్, కాకినాడ క్షేత్ర ప్రచార అధికారి  షఫీ మహ్మద్ , మంత్రిత్వ శాఖ కు చెందిన వివిధ విభాగాల  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 11, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam