DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాశి లో కాందిశీకులుగా  కాశ్మీరీ పండిట్ల కష్ట జీవనం 

(రిపోర్ట్: సాయిరాం సివిఎస్ )   
విశాఖపట్నం, నవంబర్ 06, 2024 (డి ఎన్ ఎస్) : మూడు దశాబ్దాల నరమేధం నేటికీ కాశ్మీరీ పండిట్లను వెంటాడుతూనే ఉంది. వాళ్ళ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేసేసింది. పండిట్ల పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరికి ప్రత్యక్ష నిదర్శనం నేటికీ కాశి లో కనపడుతూనే ఉంది. 
వారణాశి వెళ్లిన సీనియర్

పాత్రికీయులు పత్రీ వాసుదేవన్. . . ఇటీవల కాశీ వెళ్లిన ఆయన అక్కడ తాను స్వయంగా అనుభవించిన ఆవేదనను తెలియచేసారు. ఆయన మాటల్లోనే. . .

అతని పేరు షకీల్ పండిట్. ఊరు వారణాసి...మూడు దశాబ్దాల క్రితమే, కాశ్మీర్ లో హిందువుల పై నాటి ముస్లిం లు చేసిన నరమేధం, ఊచకోత కారణంగా కాశ్మీర్ నుంచి కాందిశీకుడిగా కాశీకి వచ్చాడట. నిన్న

కాలభైరవుడి ఆలయం నుంచి బెంగాలీ టోల్ వెళ్లడం కోసం.. బ్యాటరీ రిక్షా కోసం వెతుకుతుంటే, ఈ సైకిల్ రిక్షా షకీల్ పండిట్ పలకరించాడు...
బక్కగా, డొక్కలు చొక్కా కి అతుక్కుపోయి ....బాబూ... ఎక్కడి దాకా వెళ్ళాలి అని నన్ను అడుగుతుంటే... సాలోచనగా చూశా....చాలా మర్యాదగా వినమ్రంగా అడుగుతున్నాడు.... 
దాదాపు పది కిలోమీటర్ల దూరం...ఇరుకు ఇరుకు

సందులు... 
అతని పిక్కల కష్టం మీద నేను ఆ రిక్షాలో కూర్చుని వెళ్లడం...ఎందుకో గుండె కెలికేసినట్టయింది.... మళ్లీ అడిగాడు..చెప్పాను... ఏక్ సౌ పచాస్ అన్నాడు...అతని కంటి రెప్పల కింద స్వేదం...అలసట తో కూడిన చూపులు...ఎందుకో మనస్కరించలేదు...
నహీ చాహియే....కొంచెం కరకుగా చెప్పా....బతిమలాడాడు...సాయంత్రం 6.30 అయింది...తొందరగా వెళ్లి హోటల్ రూం

వెకేట్ చేస్తే కానీ, మళ్లీ ఎయిర్ పోర్ట్ కి చేరుకోలేను. 
ఇంకో ఆప్షన్ లేదు. రిక్షా ఎక్కి కూర్చున్నాను. పద్మవ్యూహం లా ట్రాఫిక్. సైకిల్ రిక్షా లు, బ్యాటరీ రిక్షాలు, .... ఊళ్లో జనమంతా రోడ్డు మీదే...ఇసుకేస్తే రాలనంత గా జనం....
పెడల్ మీద అతని పాదం బరువు మోపి, పళ్ల బిగువున అతను తొక్కుతున్నాడు...తదేకంగా అతన్నే

చూస్తున్నా....వింటున్నా...

కాశ్మీర్ అల్లర్లలో కుటుంబాన్ని కోల్పోయిన అతను ఒంటరిగా వారణాసి చేరుకున్నపుడు, వయసు 9 సంవత్సరాలట...తాతలు, తండ్రి అంతా వారసత్వంగా గ్రామపెద్దలు.... బలవంతపు మత మార్పిడి అయినా, చివర్లో పండిట్ అలానే ఉండి పోయిందట..
బనారసీ బాబూ అంటూ మళ్ళీ అతను పిలిస్తే, ఈ లోకం లోకి వచ్చా.... ఎంత కష్టం...ఎంత కష్టం

?
..కుటుంబం కుటుంబం అగ్ని కీలల్లో సజీవ దహనం అవుతుంటే, గుండె చిక్క బట్టుకున్న ఆ తొమ్మిదేళ్ళ పిల్లాడు....బతుకు భయంతో దేశం కాని దేశానికి పారిపోయి రావడం....
ఒక చోట రిక్షా ఆపాడు... శ్రీరామ్ లస్సీ ఘర్.... బనారసీ బాబూ కో ఏక్ అచ్ఛా సా లస్సీ బనాదో అంటూ ఆ షాప్ ఓనర్ కు చెప్పాడు...నేను అతనితో అన్నా...మాది హైదరాబాద్ అని...లస్సీ రాం సింగ్

ఒక మట్టి కుండ లో మలయ్ కలిపిన చల్లటి లస్సీ ఇస్తూ... మా కాశీ విశ్వనాధుడి దర్శనానికి వచ్చే వాళ్ళందరూ మాకు బనారసీ బాబులే....అంటూ మాటలు కలిపాడు...
ఇతను షకీల్ పండిట్ బాల్య మిత్రుడు....టెర్రరిస్టుల దాడిలో ఫ్యామిలీ ని కోల్పోయిన మరో సివిలియన్....
డెస్టినీ వాళ్ళిద్దరినీ కాశీ దాకా లాక్కొచ్చింది....వార్ మాట తీరు కానీ, మర్యాద కానీ

అవతలి వాళ్ళని కట్టి పడేయటం ఖాయం.
చిన్న అలసట తీర్చుకుని మళ్ళీ రిక్షా తొక్కడం స్టార్ట్ చేసాడు షకీల్...ఎంత మంది పిల్లలు....ఎక్కడ ఉండేది....అన్నీ అడిగా....
పెళ్లి చేసుకోలేదట..... దశాబ్దాల పీడకల అతడ్ని వెంటాడుతోంది.... అమ్మా నాన్న పోయిన తర్వాత, ఇహ కుటుంబం వద్దనుకున్నాట్ట....రేపు ఏదైనా అనుకొనిది జరిగితే, ఇంకో సారి కుటుంబాన్ని

కోల్పోవడానికి సిద్ధంగా లేనన్నాడు. ఉండేది ప్లాట్ ఫాం మీద....లేకపోతే రిక్షాలో నే పడుకుంటాడట....ఎందుకో కళ్లు చిప్పిల్లాయి నాకు...రోడ్డంతా మసక మసక గా ....
బాబూ.... బెంగాలీ టోల్ వచ్చేశాం అన్నాడు. గంటన్నర సమయం పట్టింది. అతని పిక్కల కష్టం పెడల్ మీద ప్రెషర్ పెడుతుంటే, 9 కిలోమీటర్ల దూరం నేను రిక్షాలో సౌకర్యంగా కూర్చుని రాగలిగా.....150

రూపాయలు....ఇదా అతని కష్టానికి విలువ...?? ఎంత ఇచ్చినా తక్కువే. . అనుకుని . . . . . 500 రూపాయల నోటు ఇచ్చి వెనక్కి తిరిగి వచ్చేసా వేగంగా....అతను పిలుస్తున్నాడు....నేను పట్టించుకోలేదు..... వినపడనట్టు వేగంగా ఆ జనసముద్రం లో కలిసిపోయా....
హోటల్ రూం కు చేరుకుని, బ్యాగ్ సర్డుకుంటుంటే, రూమ్ డోర్ నాక్ చేసిన చప్పుడు...బాయ్ అనుకుని తలుపు తీస్తే....

విస్తుపోయా....ఎదురుగా షకీల్ పండిట్...
చిల్లర 350 ఇవ్వబోయాడు....హడావుడిలో మర్చిపోయా అనుకున్నాడు....ఉంచుకో షకీల్ అన్నా...వినలేదు...
కన్విన్స్ చేశా ....వినలేదు...స్ట్రీట్ కార్నర్ దాకా తీసుకెళ్ళి నచ్చ చెప్పా...వద్దన్నాడు...
సరే ఓ పని చేయి...ఆ డబ్బుతో నీకు తోచిన మంచి పని చెయ్యి.... అని చెప్పాను... వెంటనే.... ఎదురుగా ఉన్న సత్రంలో

అన్నదానానికి ఇచ్చేసాడు.... ఇది శివయ్య ఆజ్ఞ అన్నాడు.... తడితో మసక బారిన నా కళ్ళకు అతడు మహాదేవుడి లానే అగుపించాడు.... లేనివాడికి పట్టెడన్నం పెట్టాలన్న షకీల్ పండిట్ ను ఓ కోరిక కోరాను....నీ రిక్షా తొక్కుతా కాసేపు అంటే....నవ్వుతూ సరే అన్నాడు..

ఆలోచించండి :  ఇలాంటి కాశ్మీరీ పండిట్లు ఇంకెందరు ఉన్నారో . . ఎక్కడెక్కడ దుర్భర

జీవనం గడుపుతున్నారో?  నాటి పాలకుల నిర్లక్ష్య ధోరణి, పండిట్ల పట్ల నాటి పాలకుల బాధ్యతారాహిత్యం. . ఫలితం వాళ్ళ దేశంలోనే వాళ్ళు ద్వితీయ శ్రేణి పౌరులుగా,, కాందిశీకులుగా ఎక్కడో కాలం వెళ్లదీస్తున్నారు. 

నేటి నరేంద్ర మోడీ ఆలోచనలతో కొంత మెరుగు పడే అవకాశం ఉంది. ప్రతి ఒక్క కాశ్మీరీ పండిట్ కుటుంబానికి స్వాంతన

చేకూరాలి అని ఆశిద్దాం. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 13, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam