DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గత 5 ఏళ్ళల్లో ఏపీలో పిచ్చొళ్ళు ధ్వంసం చేసిన కొన్ని హిందూ గుళ్ళు

*సిక్కోలు నుంచి శ్రీనివాసుని వరకూ పాల్గొన్నవాళ్లంతా పిచ్చొళ్ళేనా?*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

విశాఖపట్నం, 01 అక్టోబర్, 2024 (డి ఎన్ ఎస్): ఆంధ్ర ప్రదేశ్ లో దశాబ్దాల తరబడి హిందూ దేవాలయాలపై అత్యంత కీరాతకంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే గత ఐదేళ్ల కాలంలో హిందూ వ్యతిరేక మతోన్మాదం

విశృంఖలంగా మారింది. కేవలం హిందూ వ్యతిరేక మతోన్మాద పిచ్చొళ్ళు కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే ఎంచుకుని, ధ్వంసం చేసారు. నాటి పాలకులు కళ్ళు అప్పగించి చూసారు తప్ప, ఒక్క దరిద్రుణ్ణి కూడా పట్టుకుని అరెస్ట్ చేసిన సందర్భం లేదు. ఇప్పుడు దేవాలయాల గురించి రోడ్లపై నిరసనలు మొదలు పెట్టడం హాస్యాస్పదంగా ఉంది. అన్ని ఆధారాలూ,

సిసిటివి ఫుటేజ్ లు ఉన్నాకూడా ఒక్క దరిద్రుణ్ణి అరెస్ట్ చెయ్యని వీళ్ళు నేడు హిందూ సమాజం గురించి టీవీల్లో తెగ ఆవేదన పడుతున్నారు. 
శ్రీకాకుళం  జిల్లా మొదలుకుని ఆఖరికి సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుని వరకూ అన్ని హిందూ దేవాలయాల్లోనూ ఈ హిందూ వ్యతిరేక మతోన్మాదం పెచ్చుమీరిపోయింది అనడానికి కొన్ని ఘటనలు చూద్దాం. 2019

నాటి నుంచి హిందూ దేవాలయలపై జరిగిన దాడుల వివరాలను   హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అందిస్తోంది. 

1.)  14 నవంబర్ 2019 నాడు గుంటూరు దుర్గ గుడి ద్వoసం -

2.) 21 జనవరి 2020  నాడు పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహాలు ధ్వంసం - 

3.) 11 ఫిబ్రవరి 2020  నాడు రొంపిచర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ధ్వంసం - 11 Feb

2020

4.) 13 ఫిబ్రవరి 2020 నాడు ఉండ్రాజవరం మండలం సూర్యవుపాలం అమ్మవారి గుడి ముఖ ద్వారం దుండగులు ధ్వంసం చేశారు 

5.) 14 ఫిబ్రవరి 2020 నాడు నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర ఆలయ రధం దగ్ధం 

6.) 6 సెప్టెంబర్ 2020 నాడు అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రధం దగ్ధం - 6 Set 2020

7.) 13 సెప్టెంబర్

2020 నాడు  విజయవాడ దుర్గ గుడి రధంలోని వెండి సింహాలు చోరీ 

8.) 15 సెప్టెంబర్ 2020 నాడు   కృష్ణ జిల్లా నిడమానూరులో సాయిబాబా విగ్రహాలు ధ్వంసం - 

9.) 16 సెప్టెంబర్ 2020 నాడు  ఏలేశ్వరం శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం 

10.) 16 సెప్టెంబర్ 2020 నాడు  గుంటూరు జిల్లా

వెల్దుర్తి గ్రామం నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ద్వంసం - 

11.) 17 సెప్టెంబర్ 2020 నాడు  కృష్ణ జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలోని కాశి విశ్వేశ్వర ఆలయంలో తలుపులు, నంది విగ్రహం ధ్వంసం 

12.) 19 సెప్టెంబర్ 2020 నాడు  విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకల మామిడి

వీధి శివారులోని శివాలయంలో శివుడు విగ్రహాలు ద్వoసం -

13.)  20 సెప్టెంబర్ 2020 నాడు  పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుండి నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో వున్న అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు, విగ్రహం ద్వoసం -

14.) 23 సెప్టెంబర్ 2020 నాడు  కర్నూల్ జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో వున్న

ఆంజనేయ స్వామి విగ్రహం ద్వoసం - 

15.) 25 సెప్టెంబర్ 2020 నాడు  నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరు నందు ఆంజనేయస్వామి విగ్రహం ద్వoసం -

16.) 5 ఆక్టోబర్ 2020 నాడు  కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం వుగురు కి 2km దూరంలో వున్న సుగని జలాశయం దగ్గర వున్న శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో
నరసింహ స్వామి

శేషపడగలు ద్వoసం.

17.) 6 అక్టోబర్ సెప్టెంబర్ 2020 నాడు  కర్నూల్ జిల్లా ఆదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద వున్న ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం.

18.) 6 అక్టోబర్ 2020 నాడు  గుంటూరు జిల్లా నరసారావు పేట శంకర మఠం సమీపంలో వున్న సరస్వతిదేవి విగ్రహం ద్వoసం.

19.) 17 అక్టోబర్ 2020  నాడు తర్లపాడు గ్రామం శ్రీ వీరభద్ర

స్వామి దేవస్థాన గోపురం ధ్వంసం -

20.)  యానాం బైపాస్, లచ్చిపాలెం గ్రామం, తూ.గో జిల్లాలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ద్వంసం..

21.)  విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపై విగ్రహాల ధ్వంసం....

400 ఏళ్ల చరిత్ర గల ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన రామతీర్థం కొండపై గల దేవాలయంలోకి కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా

ప్రవేశించి ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో శ్రీరాముల వారి యొక్క శిరస్సును ఖండించారు.

22 ) కాకినాడ, పాడేరు, రాజమండ్రి లోనూ ఇలా చాలా ప్రాంతాల్లో హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా హిందూ వ్యతిరేక మతోన్మాద వ్యక్తులు తమ నీచ బుద్ది ప్రదర్శించారు. 

వీటికి పరాకాష్ట అన్నట్టుగా ఆఖరికి

తిరుమల శ్రీనివాసుని ప్రసాదం లో సైతం కల్తీ నెయ్యి వాడించి, కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు.  

మిగిలిన అన్ని దేవాలయాల్లోనూ బయట వ్యక్తులు నాశనం చేస్తే తిరుమలలో ఏకంగా  అధికారులు, పాలకులే చేసినట్టు తెలుస్తోంది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 13, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam