DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్ తర్వాత రోడ్డెక్కిన అంతరాష్ట్ర ప్రయివేట్ బస్సులు 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

అమరావతి, సెప్టెంబర్ 08, 2020 (డిఎన్ఎస్): అన్‌లాక్ 4లో అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఐదు నెలల తర్వాత ప్రైవేటు బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. గత లాక్ డౌన్ సమయం నుంచి రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లేందుకు సొంత వాహనాలు తప్ప మరో మార్గం లేకపోవడంతో ప్రజలు నా

నా అవస్థలు పడుతున్నారు. దీంతో ఆన్ లాక్ 4 లో కేంద్రం ప్రయివేట్ బస్సులకు అనుమతి ఇవ్వడంతో రవాణా శాఖ అధికారుల అనుమతితో ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్‌కు బస్సులు తిప్పుతున్నారు. అయితే  ఏపీలోని ప్రధాన ప్రాంతాల నుంచి శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. 150 ప్రైవేటు బస్సులకు ఆన్‌లైన్‌లో టికెట్‌ రిజర్వేషన్‌ విధానాన్ని

ఆపరేటర్లు మొదలుపెట్టారు.పరిస్థితిని బట్టి సర్వీసుల్ని పెంచేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ సిద్ధమయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో కూడా కరోనా నిబంధనలు పాటిస్తున్నారు.  మాస్కులు, శానిటైజర్, వీలైనంత వరకు భౌతిక దూరం పాటించేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.  ఐదు నెలలుగా హైదరాబాద్‌కు బస్సు

సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.  ఇప్పుడు ట్రావెల్స్ బస్సులకు లైన్ క్లియర్ కావడంతో మళ్లీ బస్సులు రోడ్డెక్కాయి.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌, తెలంగాణకు ఏపీ నుంచి ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి తెలంగాణ

ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ దీనిపై తెలంగాణ సర్కార్‌ ఇంకా స్పందించలేదు. సర్వీసుల పెంపునకు టీఎస్‌ ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.  
అలాగే ఏపీఎస్‌ ఆర్టీసీ తెలంగాణ భూ భాగంలో తిప్పే కిలోమీటర్లు తగ్గించాలని.. తాము ఎట్టి పరిస్థితిలోనూ ఏపీ భూ భాగంలో కిలోమీటర్లు పెంచబోమని టీఎస్‌ ఆర్టీసీ తెగేసి చెబుతోంది.

దీంతో ఆర్టీసీ సర్వీసులు నడటపంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 11, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam