DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ రాష్ట్ర స్థాపన దిశగా ఆర్ఎస్ఎస్ అడుగులు వేస్తోందా?

*పాలక్కాడ్ లో జాతీయ సమావేశాల్లో దిశా నిర్దేశం జరుగుతోందా?*  

*బాంగ్లాదేశ్ లో ఘటనలపై భగ్గుమన్న ఆరెస్సెస్ అగ్ర నేతలు. . .* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार)*

*విశాఖపట్నం, ఆగస్టు 31, 2024 (డిఎన్ఎస్):* సనాతన హిందూ జాతి విచ్చిన్నం కోసం, వినాశనం కోసం దేశంలోని ప్రతిపక్షాలు, విదేశీ మతోన్మాదులతో కలిసి

చేస్తున్న దుర్మార్గాలపై తగిన దిశా నిర్దేశం లభించే అవకాశం ఉంది. కేరళ లోని పాలక్కాడ్‌ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారత సమన్వయ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి.  మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రముఖులు ఇటీవల బాంగ్లాదేశ్ లో హిందువుల పట్ల ముస్లిం మతోన్మాద ఉగ్రవాదులు చేసిన అఘాయిత్యాలు,

మహిళలపై అత్యాచారాలు, హిందువుల ఆస్తులు దోచుకోడాలు, తగలబెట్టడాలు, తదితర నరమేధం పై మండిపడ్డారు. భారత్ లో సైతం హిందూ సమాజానికి రక్షణ లేకుండా పోయిందని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకు రావాలని డిమాండ్ చేసారు. 
కోట్లాది మంది హిందువులకు విదేశాల్లోనే కాక, స్వదేశం లో సైతం రక్షణ లేకుండా పోయిందనే అంశాన్ని

పలువురు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. 

కేవలం హిందూ రాష్ట్ర సాధనే హిందువుల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించగలదనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేసినట్టు సమాచారం.  

ఈ సమావేశంలో ఆర్ ఎస్ ఎస్ ప్రముఖులతో పాటు, సంఘ్ స్పూర్తితో పనిచేస్తున్న 32 సంస్థల జాతీయ అధ్యక్షులు, సంఘటనా కార్యదర్శులు, ముఖ్య

కార్యనిర్వాహకులు, మహిళా ప్రతినిధులతో కలిసి మొత్తం 300 మంది వరకు హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్‌ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబొలే మార్గదర్శనం చేస్తున్నారు. మహామహులు హాజరైన ఈ సమావేశంలో ప్రస్తుతం హిందూ సమాజం పట్ల దేశ, విదేశాల్లో జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు, అవమానాల

పట్ల తీవ్రంగానే స్పందించినట్టు తెలుస్తోంది.  

ఈ మూడు రోజుల అఖిల భారత సమావేశం సాధారణంగా సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది.

సమావేశం ప్రారంభంలో, ప్రతినిధులందరికీ ఇటీవల వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం మరియు వాలంటీర్లు చేసిన సహాయ మరియు సేవా కార్యక్రమాల గురించి సమాచారం అందించారు. సమావేశంలో,

వివిధ సంస్థల కార్యకర్తలు తమ పని గురించి సమాచారాన్ని, వారి అనుభవాలను తెలియచేయనున్నారు. ఇది కాకుండా, జాతీయ ఆసక్తికి సంబంధించిన వివిధ అంశాలు, ప్రస్తుత దృశ్యం, ఇటీవలి ముఖ్యమైన సంఘటనలు మరియు సామాజిక మార్పు మరియు ప్రణాళికల యొక్క ఇతర కోణాలపై సమావేశంలో చర్చ జరుగుతుంది. వివిధ విషయాలపై పరస్పర సహకారం మరియు సమన్వయాన్ని

మరింత పెంపొందించడానికి అవసరమైన చర్యలను కూడా అన్ని సంఘ్ సహకార సంస్థలు చర్చిస్తాయి.

ఆర్ఎస్ఎస్ లోని ఆరుగురు సహ సర్ కార్యవాహ్ లు, ఇతర అఖిల భారత అధికారులు హాజరయ్యారు. 

విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు ఆలోక్ కుమార్, సంఘటన కార్యదర్శి  మిలింద్ పరాండే, సహ సంఘటన కార్యదర్శి  వినాయక రావు జి,  ప్రధాన

కార్యదర్శి బజరంగ్ బాగ్రా,  సంయుక్త ప్రధాన కార్యదర్శులు కోటేశ్వర శర్మ, పూజ్యులు విజ్ఞాననంద స్వామి, స్థాణుమాలయన్ హాజరయ్యారు.

రాష్ట్ర సేవికాసమితి ప్రధాన సంచాలిక  శాంతక్కా జీ, ప్రధాన కార్యవాహిక  అన్నదానం సీతక్క, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం అధ్యక్షుడు సత్యేంద్ర సింగ్, మాజీ సైనిక సేవా పరిషత్ అధ్యక్షుడు

లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) వి.కె. చతుర్వేది, ఎ.బి.ఎ. గ్రాహక్ పంచాయతీ చైర్మన్ నారాయణ్ భాయ్ షా హాజరయ్యారు .

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంఘటనా కార్యదర్శి ఆశిష్ చౌహాన్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, సంస్థ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్, విద్యాభారతి అధ్యక్షుడు డి. రామకృష్ణారావు, భారతీయ

మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు  హిరణ్మయ్ పాండ్యా, ఆరోగ్య భారతి అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ పండిట్ హాజరవుతున్నారు.

తదుపరి రెండు రోజుల సమావేశం అనంతరం సార్ సంఘ చాలక్ డా. మోహన్ భగవత్ హిందూ సమాజాన్ని ఉద్దేశించి దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. 

వందలాది మంది సంఘ కార్యకర్తలను బహిరంగంగా కమ్యూనిస్ట్

మతోన్మాదులు నడి రోడ్లపైనే  చంపిన కేరళలోనే జాతీయ సమావేశాలు నిర్వహించడం కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. కమ్యూనిస్ట్ ల మతోన్మాదానికి వందలాది మంది ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు బలయ్యారు. అయినప్పడికి కేరళలోనే జరిగిన ప్రకృతి వైపరీత్యాలలో ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు కేవలం ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు

మాత్రమే. 

ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కూటమి కేంద్రం లో అధికారం లో ఉండడంతో పాటు, ఇటు లోక్ సభ లోను, అటు రాజ్య సభ లోనూ తగిన బలం ఉండడంతో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దానికి సంఘ్ నుంచి సూచనలు లభించే అవకాశమూ ఉంది.  ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఆర్ ఎస్ ఎస్ జాతీయ సమన్వయ సమావేశాలపై అందరి దృష్టి

ఉంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 9, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam