DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రత్యేక హోదా ఇచ్చినా పార్టీకి పతనం తప్పేలా లేదు.

స్వయంకృతాపరాధమే... 

రైల్వే జోన్ వ్యవహారం తో పార్టీ భూస్థాపితమే నా 

విశాఖపట్నం, డిశంబర్ 2 , 2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా తో పాటు, విశాఖ

కేంద్రంగా రైల్వే జోన్ ఇచ్చినా  à°¸à°°à±‡ భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ భూస్థాపితం తప్పేలా లేదు. à°ˆ రెండూ ఇవ్వడం లేదు అని కేంద్ర బీజేపీ కమిటీ, కేంద్ర

ప్రభుత్వం తేల్చి పారేయడం తో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు పార్టీ మీద వ్యతిరేకత నషాళానికి ఎక్కింది. రానున్న ఎన్నికల్లో పార్టీ భూస్థాపితం అయ్యే అవకాశాలే ఎక్కువగా

ఉన్నాయి. 

ఇది ఎవరో చెప్పే మాట కాదు, ఆవిర్భావం నుంచి బీజేపీ పార్టీనే నమ్ముకుని ఉన్న కరడు కట్టిన బీజేపీ వాదులే చెప్పే మాట. అధిష్టానం తీసుకునే అసంబద్ధ

నిర్ణయాలకు, ఆంధ్ర లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందనేది వాస్తవం. విభజన సమయంలో నానా హంగామా చేసిన పార్టీ కేంద్ర కమిటీ పెద్దలు, నేడు యు టర్న్

తీసుకోవడంతో స్థానిక క్యాడర్ తలెత్తుకుని ప్రజల్లో తిరిగే అవకాశం లేకుండా పోయింది. 

ప్రత్యేక హోదా పేరుతొ ఓట్లు దండుకున్నారు :

ప్రత్యేక హోదా

ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని, విశాఖ కేంద్రం à°—à°¾ రైల్వే జోన్ ఇస్తామని  2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఆంధ్రా లో హామీలు గుప్పించి, ఓట్లు

దండుకున్నారు. తీరా గెలిచాక అంతా తూచ్ అన్నారు. ఇదే తడవుగా పార్టీ నేతలు ఎవరికీ వారు తమ పలుకుబడి వినియోగించి ఒక్కొక్కచోట కుదురుకున్నారు. ఇదంతా కేవలం

స్వార్ధపూరిత వ్యవహారం తప్ప, ప్రజా సంక్షేమం కోసం కనీసం కలలో కూడా ఆలోచన చేసిన దాఖలాలే లేవు. స్థానిక నేతలకు నోరు లేదు, ఉన్న వీళ్ళు అడగరు, అడగడం లేదు కదా మేము

ఇవ్వడం లేదు అని కేంద్ర బీజేపీ ప్రకటన. 

బీజేపీ వి భారత దేశాన్ని కుదిపేసే ఫలితాలు . . .

 2014  à°Žà°¨à±à°¨à°¿à°•à°²à±à°²à±‹ భారత దేశాన్ని కుదుపేసే ఫలితాలు సాధించి అధికారం

లోకి వచ్చిన బీజేపీ రానున్న2018  à°Žà°¨à±à°¨à°¿à°•à°²à±à°²à±‹ అదే స్థాయిలో తుడిచిపెట్టుకుపోయాయి, పార్టీ దాదాపుగా భూస్థాపితం అయ్యే ఫలితాలు రానున్నట్టు సర్వేలు

వెల్లడిస్తున్నాయి. ఇదంతా వీళ్ళ స్వయంకృతాపరాధమే. కేవలం నరేంద్ర మోడీ. అమిత్ షా లు తీసుకునే నిర్ణయాలపైనే దేశం లో పార్టీ నడుస్తోందన్నది వాస్తవం. వీళ్ళకి

అనుకూలంగా ఉండే నిర్ణయాలే తీసుకోవడం వలన, రాష్ట్రాల్లోని పార్టీ కేడర్ చిన్నాభిన్నమై పోయింది. 

వెంకయ్య నిష్క్రమణ పార్టీకి అరిష్టమే.. .
బీజేపీ లో అత్యంత

కీలక నేతగా వెలుగొందిన ఎం. వెంకయ్య నాయుణ్ణి భారత ఉపరాష్ట్రపతిగా పదోన్నతి కల్పించామని చెప్తున్నా మోడీ షా, లు పైకి చెప్తున్నా, ఆయన్ని పార్టీనుంచి బయటకు

పంపడానికి వేసిన ప్రణాళికే. దీంతో ఆంధ్రాకి అండగా ఉన్న పెద్ద నేత ఏకంగా రాజకీయాల నుంచే నిష్క్రమించాల్సివచ్చింది. ఆంధ్ర తరపున కేంద్రంలో నోరెత్తే వారే

లేకపోవడం, పైగా విశాఖ ఎంపీ హరిబాబు తెలుగుదేశానికి తొత్తులా వ్యవహరిస్తుండడం తో ఆంధ్రని బీజేపీ పూర్తిగా విస్మరించింది. ఎన్నికల హామీలు అడగవలసిన ఎంపీ హరిబాబు

కలలో కూడా కనీసం విశాఖ రైల్వే జోన్ పేరు తలవారు అని అయన సన్నిహితులే చెప్పడం గమనార్హం. 

టీడీపీ తో తెగతెంపులు భూస్థాపితానికే..

తెలుగుదేశం తో

తెగతెంపులు చేసుకున్నది ఆంధ్ర లో బీజేపీ ని భూస్థాపితం చెయ్యడానికే అన్నది అక్షర సత్యంగా మారింది. దీన్ని కేంద్ర నేతలు నిరూపిస్తున్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive 

#dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #bjp  #sagi  #viswanadha raju  #haribabu

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam