DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల ఆలయ వ్యవస్థ నిర్వహణాధికారం స్థానిక జీయర్లది మాత్రమే

*రామానుజులు ఏర్పాటు చేసిన వ్యవస్థ ప్రకారమే తిరుమల నడవాలి* 

*అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం డిమాండ్* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, సెప్టెంబర్, 23, 2024 (డిఎన్ఎస్):* తిరుమల ఆలయ వ్యవస్థపై సర్వాధికారం తిరుమల పెద్ద జీయర్, చిన్న జీయర్లదే. అయితే ప్రభుత్వ జోక్యం

కారణంగా జీయర్ల పై కూడా ఈఓ లు పెత్తనం చేసే దౌర్భాగ్య స్థాయికి దిగజారిపోయారు. తిరుమల ఆలయ నిర్వహణ ఎలా జరగాలి అనే నిర్ణయం భగవద్రామానుజులు వెయ్యేళ్ళ క్రితమే ఏర్పాటు చేసారు. 11 వ శతాబ్దం లోనే తిరుమల లో రామానుజాచార్యులు పర్యటన చేసి, అక్కడ అర్చనలు వైఖానస ఆగమ సంప్రదాయం లో జరగాలని, వాటి నిర్వహణ శ్రీ పాంచరాత్ర ఆగమ పెద్దలు

పెద్ద జీయర్, చిన్న జీయర్లు పర్యవేక్షణ చేయాలనీ నియమం తో నిర్వహణ ఏర్పాటు చేసారు. నేటి తిరుమల లో పాలకుల పెత్తనం వల్ల పూర్తిగా బ్రష్టు పట్టిందని, ఇక నుంచి అయినా రామానుజులు ఏర్పాటు చేసిన అదే సంప్రదాయం తిరిగి కొనసాగాలని అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి యతిరాజుల బాలబాలాజీ డిమాండ్ చేసారు. 
/> తిరుమల లో జరగరాని అపచారాలు జరుగుతూ ఉంటె చూసి సహించలేని శ్రీవైష్ణవ సమాజం ఈ మేరకు  బహిరంగ ప్రకటన చేసింది. 

జీయర్ల పరిధి. . .ఏంటి? 

వైఖానస ఆగమ అర్చకులు ( నాలుగు కుటుంబాల సభ్యులు ) సంప్రదాయం లో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి అన్ని వేళలా ఆరాధనలు చేస్తుంటారు. వాటిని క్రమ పద్దతిలో నిర్వహించేలా తగిన

ఏర్పాట్లు, ఆగమ విధానం, ఏ సమయానికి ఏయే సేవలు జరగాలి, వాటికి ఏయే వస్తు సామాగ్రి ఎలా ఉండాలి, స్వామికి నైవేద్యం ఏయే సమయాల్లో ఎలా తయారు చేసి పెట్టాలి అని ప్రత్యక్ష పర్యవేక్షణ చెయ్యవలసిన భాద్యత జీయర్లదే. 

తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు కాకముందు వరకూ జీయర్ వ్యవస్థ, అర్చక వ్యవస్థ సంపూర్ణ సహకారంతో శ్రీవారికి

వైభవంగా ఆరాధనలు జరిగేవి. ఎప్పుడైతే ప్రభుత్వం టిటిడి బోర్డు ను ఏర్పాటు చేసి, దానికి రాజకీయ బ్రష్టులను చైర్మన్లు గాను, సభ్యులుగానూ  నియమించడంతో పాటు, తన చెప్పుచేతల్లో ఉండే వ్యక్తులని ఈఓ లు గానూ నియమించి తిరుమల ఆలయాన్ని కబ్జా చేసిందో అప్పడి నుంచి అక్రమాలు పెచ్చుమీరిపోయాయి. 

తిరుమల వ్యవస్థకు ఇతర

ప్రభుత్వ సంస్థలకు ఏమాత్రం సంబంధం లేదు. ఆదాయం సైతం రాష్ట్ర ప్రభుత్వానికి ధీటుగా ఉంటుంది. పైగా రాష్ట్ర ప్రభుత్వం సైతం టిటిడి నిధులను ఇబ్బడి ముబ్బడిగా దోచుకుని తన ఖజానాకు తరలించిన సందర్భాలు కూడా కోకొల్లలు ఉన్నాయి. 

టిటిడి కి వచ్చే నిధులు కేవలం హిందూ సంప్రదాయ కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉండగా

కొన్ని ప్రభుత్వాలు  క్రైస్తవ పోస్టర్లకు, ముస్లిం ముల్లాలకు నెలవారీ  బెత్యాలు ఇవ్వడానికి కూడా టిటిడి నిధులు దారిమళ్లించిన సందర్భాలు కూడా విన్నాం.  

ఇలాంటి అక్రమాలను తిరుమల జీయర్లు అభ్యంతరం చెప్తున్నారు అనే కక్షతో వారిని కట్టడి చేసేందుకు చాల ఇబ్బందులకు గురిచేసినట్టు తెలుస్తోంది. వారు ఒంటరి పోరాటం

చెయ్యలేక, ఎదురు చెప్పలేక ఎంతో  మధన పడిన సందర్భాలు ఉన్నాయి. 

తిరుమల వ్యవస్థను తమ కబంద హస్తాల్లోకి తీసుకున్న ప్రభుత్వాలు, ట్రస్ట్ బోర్డులు మొత్తం  ఆలయ వ్యవస్థ పరువు గంగపాలు చేయడం బాధాకరం అన్నారు.   

త్రిదండి చిన్న జీయర్ సూచనలు బుట్టదాఖలు...:

అపర రామానుజులు  త్రిదండి చిన్న జీయర్

స్వామి గత  మూడు దశాబ్దాల క్రితమే తిరుమల వ్యవస్థ ప్రక్కదారి పట్టిందని భారీ ఎత్తున ఉద్యమం చేస్తే. . మొత్తం ప్రభుత్వాలు, టీటీడీ, మీడియా ఆయన్ని తప్పుపట్టాయి. నేడు  తిరుమల లో జరుగుతున్నా దుర్ఘటనలు వీళ్ళు సమాధానం  చెప్పవలసి  ఉందని  బాలాజీ  డిమాండ్ చేసారు. దీనిపై  108 రోజుల  పాటు శరణాగతి దీక్ష చేసి, వేలాదిమంది

భక్తులతో తిరుపతిలో భారీ బహిరంగ సభ కూడా   నిర్వహించారు. తిరుమలలో ఆనాటికి జరుగుతున్నా అనాచారాలపై బహిరంగంగానే అందరికి తెలియచేశారన్నారు. తిరుమల వ్యవస్థపై ప్రభుత్వాలకు సంబంధం లేదని, అదొక ప్రత్యేక ధార్మిక వ్యవస్థ అని, దానికి స్థానిక జీయర్లకు పూర్తి అధికారాలు ఇవ్వాలని నాదే చిన్న జీయర్ స్వామి తెలియచేస్తే. . నాటి

పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజున ఇంత దారుణం జరిగిందన్నారు. 
ఇప్పడికైనా నేటి ప్రభుత్వం రామానుజాచార్యులు ఏర్పాటు చేసిన వ్యవస్థ ప్రకారమే   తిరుమలను నడపాలని డిమాండ్ చేసారు. 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam