DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల పరిరక్షణ కై 7 డిమాండ్లతో భారీ పాదయాత్ర

*పుంగనూరు నుంచి తిరుమలకు ఆర్సీవై భారీయాత్ర* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, సెప్టెంబర్, 26, 2024 (డిఎన్ఎస్):* పరమ పవిత్ర పుణ్య క్షేత్రంలో జరిగిన పాప ప్రక్షాళన, తిరుమల క్షేత్ర పవిత్రత రక్షణ డిమాండ్ తో ఈ నెల 27 ( శుక్రవారం) నుండి 
బి. రామచంద్ర యాదవ్ "తిరుమల పరిరక్షణ పాదయాత్ర " కు

శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి తిరుమల వరకూ ఈ యాత్ర సాగనుంది. దేశ వ్యాప్తంగా సామాన్య భక్తజనం నుంచి ఆధ్యాత్మిక ప్రముఖులు, గురువులు, పీఠాధిపతులు సంఘీభావం ప్రకరించారు. పుంగనూరులోని హనుమతరాయ దిన్నె వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ఆరంభ కార్యక్రమానికి శ్రీ యదుగిరి యతిరాజ్ మఠాధిపతి నారాయణ రామానుజ జీయర్

స్వామి, మహంత్ కళ్యాణ్ దాస్ జీ మహరాజ్ (హనుమాన్ మఠం పీఠాధిపతి, అయోధ్య), శ్రీ పీఠం వ్యవస్థాపకులు, పరిపూర్ణానంద స్వామీ, త్రిశక్తి మంత్రాశ్రమ సిద్దయోగులు ఆడిదండి శక్తిశ్రీ భగవతీ మహారాజ్, * శ్రీ కృష్ణ యాదవానంద స్వామీజీ తదితరులు హాజరుకానున్నారు. ప్రధానంగా తిరుమల పూర్తిస్థాయి ప్రక్షాళన సహా ప్రధానమైన ఏడు డిమాండ్ల సాధన కోసం

పాదయాత్ర మరియు మెట్లోత్సవం చేయాలని సంకల్పించారు. 

పుంగనూరు నుండి అలిపిరి వరకు పాదయాత్ర ద్వారా చేరుకుని.. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకోనున్నారు. అలిపిరి నుండి తిరుమల వరకు "మెట్లోత్సవం" కార్యక్రమం నిర్వహించనున్నారు.  ఈ పాదయాత్ర సహా మెట్లోత్సవం కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలి

రావాలని యాదవ్ పిలుపునిచ్చారు. పాల్గొనేవారికి రాత్రి బస, భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది.

యాదయాత్ర *షెడ్యూల్ ఇదే *

ఈ నెల 27వ తేదీన(శుక్రవారం) ఉదయం 9.15 నుండి పుంగనూరులోని హనుమంతురాయ దిన్నెలో ఉన్న వీరాంజనేయస్వామి దేవాలయం నుండి పాదయాత్ర ఆరంభం కానుంది.. అక్కడి నుండి చౌడేపల్లి, సోమల, సదుం, కల్లూరు, పులిచర్ల,

రొంపిచర్ల క్రాస్, శ్రీనివాస మంగాపురం మీదుగా అలిపిరి నుండి తిరుమల వరకు సాగనుంది.. 

ఈ నెల 30-09-2024 ఉదయం 9.15 గం. అలిపిరి నుంచి తిరుమల మెట్లోత్సవం జరగనుంది..

ఏడు డిమాండ్లతో ఏడు కొండల వాడి చెంతకు..*

1 .)  *100 రోజుల్లో శిక్ష* - తిరుమలలో జరిగిన అపచారాలు, అవినీతి అక్రమాలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి 100

రోజుల్లో దోషులను శిక్షించాలి
2 .) *పరిపాలన ప్రక్షాళన* - TTD పాలక మండలి నుండి పరిపాలన వరకు పూర్తి ప్రక్షాళన పాలక మండలిలో రాజకీయ, కార్పొరేట్ శక్తులకు చోటు కల్పించకూడదు
3 .) *సమప్రాధాన్య దర్శనం* - VIP దర్శన విధానాన్ని రద్దు చేసి ముఖ్యమంత్రి నుండి సామాన్య భక్తుని వరకు అందరికీ ఒకే విధమైన దర్శన ఏర్పాటు చేయాలి
4 .) *అన్యమత

ఉద్యోగులు,  వేయి కాళ్ళ మండపం* - TTD లో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.. తొలగించబడిన వేయికాళ్ళ మండపాన్ని వేరొక చోట వెంటనే నిర్మించాలి
5 .) *మద్య, మాంస దుకాణాలు* -  తిరుపతిలో ఉన్న గోవిందరాజ స్వామి, కపిలతీర్థ, తిరుచానూరు అలివేలు మంగాపురం ఆలయాలకు కనీసం 2 కి.మీ పరిధిలో

మాంసం, మద్యం దుకాణాలు నిషేదించాలి
6 .) *పబ్లిక్ ఆడిట్* - తిరుమల ఆదాయ, వ్యయాలపై ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఆడిట్ నిర్వహించి నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి
7 .) *తిరుమలలోనే డెయిరీ* -  తిరుమలలోనే గోశాల ఏర్పాటు చేసి తద్వారా సొంతంగా డెయిరీ నిర్వహించి ఆ నెయ్యిని మాత్రమే స్వామి వారి ప్రసాదాలలో వినియోగించాలి
ఈ ఏడు

డిమాండ్ల సాధన కోసం ఆర్సీవై పాదయాత్ర జరగనుంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam