DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనవరి 2 నుంచి విజెఎఫ్ ఇంటర్ మీడియా క్రీడలు 

విశాఖపట్నం, డిశంబర్ 25 ,2018 (DNS  Online): పాత్రికేయుల సంక్షేమ కార్యక్రమాలకు మారుపేరుగా నిలిచినా వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరమ్ (విజెఎఫ్) మరో మారు జనవరి 2 నుంచి క్రీడా సంబరాలు

నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. మంగళవారం à°ˆ క్రీడా పోటీల విన్నర్స్‌, రన్నర్న్‌ ట్రోఫీలను  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, సీఎంఆర్‌ అధినేత మావూరి

వెంకటరమణలు ఆవిష్కరించారు. వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం, సీఎంఆర్‌ ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ మీట్‌ను జనవరి 2 నుంచి 5 వరకూ నిర్వహించనున్నారు.  à°ˆ సందర్భంగా వీరు

మాట్లాడుతూ క్రమం తప్పకుండా జర్నలిస్టుకు క్రీడా సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వీజెఎఫ్‌ జర్నలిస్టు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను

చేపడుతోందని, ఇవి ఇతర ప్రాంతాలకు ఆదర్శనీయంగా నిలిచాయన్నారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీతోపాటు ప్రతి ఏటా ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహించడం వల్ల

జర్నలిస్టులకు మానసిక ప్రశాంతతతోపాటు ఆరోగ్యపరంగా కూడా మేలు చేకూరుతుందని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం తరపున జర్నలిస్టులు

చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహకారం వుంటుందన్నారు. టోర్నీ స్పాన్సర్‌ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ à°—à°¡à°šà°¿à°¨ పదిహేనేళ్లుగా వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం చేపట్టే

ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌కు తమవంతు సహకారం అందిస్తున్నామన్నారు. జర్నలిస్టుల కోసం తమ సంస్థ అవసరమైన చేయూతనిస్తుందన్నారు. వీజెఎఫ్‌ చేపట్టే అనేక

కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ స్పోర్ట్స్‌ జర్నలిస్టు

అసోసియేషన్‌ సహకారంతో à°ˆ టోర్నీ నిర్వహిస్తున్నామన్నారు. వీజేఎఫ్‌ సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా తమ పాలకవర్గం పనిచేస్తుందన్నారు. జర్నలిస్టుల హెల్త్‌

ఇన్స్యూరెన్స్‌, ప్రమాధ భీమా పాసీతో పాటు అవసరమైన అన్ని మేళాలు ప్రత్యేకంగా నిర్వహించామన్నారు. సంక్షేమ కార్యక్రమాతోపాటు క్రీడకు పెద్ద పీట

వేస్తున్నామన్నారు. వీజెఎఫ్‌ కార్యదర్శి, టోర్నీ చైర్మన్‌ ఎస్‌. దుర్గారావు మాట్లాడుతూ జనవరి 2 నుంచి 5 వరకూ పోర్టు, రైల్వే స్టేడియములు  à°µà±‡à°¦à°¿à°•à°—à°¾ ఇండోర్‌,

అవుట్‌డోర్‌ క్రీడలు నిర్వహిస్తామన్నారు. క్రికెట్‌ పోటీలకు సంబంధించి అవసరమైన వివరాలు అందరికీ తెలియజేస్తామన్నారు. à°ˆ కార్యక్రమంలో వీజెఎఫ్‌ ఉపాధ్యక్షులు

ఆర్‌. నాగరాజు పట్నాయక్‌, వి.జె.ఎఫ్‌. జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌, పాలకవర్గ సభ్యులు à°Žà°‚.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌, ఇరోతి ఈశ్వరరావు, శేఖరమంత్రి, మాధవరావు, గయాజ్‌,

వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

 

#dns  #dns live  #dns media  #dns news #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #vjf  #sports  #cmr  #collector

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam