DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లంబసింగి మంచుతెరలు ఆహా, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అదరహో. .

ఆకట్టుకుంటున్న విశాఖ రూరల్స్ అందం. 

విశాఖపట్నం,  à°œà°¨à°µà°°à°¿ 20, 2019 (DNS Online):  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°•à°‚à°—à°¾ ఆకట్టుకుంటున్న విశాఖ జిల్లా ఆహ్లాదకర వాతావరణం లో ఆంధ్రా కాశ్మీర్ à°—à°¾

ప్రసిద్ధి కెక్కిన అత్యద్భుత ప్రదేశం లంబసింగి. అత్యంత తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశంగా ఈ గ్రామం దేశంలోనే అత్యంత ఆదరణ కల్గిన ప్రదేశంగా చరిత్ర

సృష్టించింది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ నమోదయ్యే అతి తక్కువ ఉష్ణోగ్రతలను ప్రత్యక్షంగా వీక్షిణించేందుకే వందల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. విశాఖ నగరం

నుంచి ఈ ప్రాంతానికి చేరుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. దీనికి అదనంగా ప్రయివేట్ రవాణా సంస్థలు బస్సులు, టాక్సీలు,

వేన్ లు నడుపుతూ ప్రత్యేక ప్యాకేజీలను కూడా అమలు చేస్తోంది. తెల్లవారు ఝామున మూడు గంటల సమయంలో విశాఖ నగరం నుంచి బయలు దేరి వెళ్లినట్టయితేనే సూర్యోదయం కంటే

ముందు సమయానికి చేరుకునే అవకాశం ఉంటుంది. మార్గ మధ్యంలో రహదారి మంచు తో కప్పబడి ఉండడంతో అతి నెమ్మదిగా వెళ్ళవలసి ఉంటుంది. విశాఖ నుంచి కేవలం 100 కిలో మీటర్ల దూరమే

ఉన్నప్పడికే దట్టమైన మంచు కారణంగా కనీసం రెండున్నర నుంచి మూడు à°—à°‚à°Ÿà°² సమయం పడుతుంది. సుమారు ఉదయం  5 :30 à°—à°‚à°Ÿà°² సమయం లోపల అక్కడికి చేరితేనే, à°ˆ ఆహ్లాద మంచు వాతావరణాన్ని

ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. గతం లో పర్యాటకులు తక్కువగా ఉండడంతో కనీసం కాఫీ కూడా ఇచ్చేందుకు కాకా హోటళ్లు కూడా లేని పరిస్థితి. అయితే ప్రస్తుతం

వ్యాపారులు దుకాణాలు తెరిచి, వేడి వేడి కాఫీ, టీ ల తో పాటు, వేడి అల్పాహారం కూడా అందిస్తున్నారు. విశాఖపట్నం నుంచి నర్సీపట్నం, మీదుగా చింతపల్లి రోడ్ లో లంబసింగి

చేరవచ్చు. 

అద్భుతం కొత్తపల్లి వాటర్ ఫాల్స్ :

  లంబసింగి నుంచి 40 కిలో మీటర్ల దూరం లోనే ఉన్న మరో అత్యద్భుతం కొత్తపల్లి వాటర్ ఫాల్స్. విశాఖపట్నం నుంచి

లంబసింగి మీదుగా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ప్రాంతానికి చేరుకోవచ్చు. పాడేరుకు సమీపంలో ఉన్న à°ˆ ప్రాంతం విశాఖనగరం నుంచి 125  à°•à°¿à°²à±‹ మీటర్ల దూరంలోను, నర్సీపట్నం

 à°¨à±à°‚à°šà°¿ 140 కిలోమీటర్ల దూరం లోను ఉంది. ఇది à°’à°• మంచి పిక్నీక్ స్పాట్ à°—à°¾ చెప్పవచ్చు. బాలల వయసు వారి నుంచి, వృద్ధుల వరకూ అందరూ à°ˆ వాతావరణాన్ని ఆహ్లాదించగలిగే విధంగా

స్థానికి గిరిజన యువత దీన్ని తీర్చి దిద్దుతున్నారు. ఈ వాటర్ ఫాల్స్ లో స్నానం చెయ్యాలి అనుకునే వారికి మంచి అనువుగా తయారు చేశారు. ప్రవేశ ద్వారం నుంచి క్రిందకి 100

మెట్లు దిగి క్రిందకి వెళ్ళవలసి యుంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మెట్లు ఎక్కడం, దిగడం కొరకు స్టీల్ గొట్టాలను కూడా ఏర్పాటు చేశారు. కొందరు గైడ్లు అక్కడే

ఉండి, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా సూచనలు చేస్తుంటారు. ఇక్కడ  à°ªà±à°°à°µà±‡à°¶ రుసుము కేవలం రూ.10 మాత్రం వసూలు చేస్తున్నారు. ఇది కూడా à°ˆ ప్రాంత యువతకు ఉపాధి

కల్పించే నిమిత్తం వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. à°ˆ వాటర్ ఫాల్స్ వర్షాకాలం మరింత అధిక నీటి తో మరింత ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. 

విశాఖ నుంచి బయలు

దేరేవారికి లంబసింగి మంచు తెరల స్పాట్ తో పాటు సమీపం లోని ఒక ప్రజా ప్రతినిధికి చెందిన స్ట్రా బెర్రీ ప్లాంట్ లు, తదుపరి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ను చూపించి

తిరిగి విశాఖ కు తీసుకు వచ్చే విధంగా ప్రయివేట్ సంస్థలతో పాటు, రాష్ట్ర పర్యాటక శాఖ కూడా ప్యాకేజి లను సిద్దం చేసింది. అక్కడే రాత్రి బస చేసేందుకు కూడా కొన్ని

అతిధి గృహాలను సిద్ధం చేశారు. రోజుకు రూ.1500 చొప్పున ధరలను నిర్ణయించారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #kothapalli water falls  #madugula mandal  #paderu  #lambasingi

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam