DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాతృభాషా లోనే ఆలోచన శక్తి అద్భుతంగా పనిచేస్తుంది 

శిశుమందిర్ వైభవంగా మాతృభాషాదినోత్సవం 

విశాఖపట్నం, ఫిబ్రవరి 21, 2019 (DNS Online): ఏ వ్యక్తికైనా తన మాతృభాషలో ఆలోచించినట్టయితే ఆలోచన శక్తి అద్భుతంగా పనిచేస్తుందని

ప్రవచన కళానిధి, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత తిరుమల పెద్దింటి నరసింహచార్యులు తెలిపారు. గురువారం ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని

విశాఖపట్నం లోని ద్వారకానగర్ లో గల శ్రీకృష్ణ విద్యా మందిర్ ( శిశుమందిర్) లో తెలుగు వైభవాన్ని తెలియచేసే సంప్రదాయ సదస్సును చేపట్టారు. ఈ సభకు ముఖ్య అతిధిగా

విచ్చేసిన నరశించార్యులు దీప ప్రజ్వలన చేసి, విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. తెలుగు భాషా అత్యంత విశిష్టమైనది, ఏ దేశానికేగినా తెలుగు భాషను

విస్మరించవద్దన్నారు. పరాయి భాషలు జ్ఞానాన్ని సంపాదించుకునేంత వరకే ఉపయోగపడతాయన్నారు. తెలుగు భాషలోనే మాట్లాడదాం, ఆలోచిద్దాం అనే సంప్రదాయాన్ని విద్యార్థి దశ

నుంచే కొనసాగించాలన్నారు. విద్య సంస్థ 8 వ తరగతి విద్యార్థిని విద్యార్థులు వివిధ తెలుగు కవుల రచనలు, తెలుగు భాష ప్రాభవాన్నితెలియచేసే రూపకాన్ని ప్రదర్శించారు.

భాగవత పద్యాలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నంది పురస్కార గ్రహీత డాక్టర్ మీగడ రామలింగస్వామి తెలుగు భాషా వైభవాన్ని  తెలియచేసే విధంగా  à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ జయాంజనేయ నాటక

పద్యాలను  à°°à°¾à°—యుక్తంగా ఆలపించారు. à°ˆ సదస్సులో తెలుగు భాష అధ్యాపకులు శ్రీమాన్ కారి రాఘవాచార్యులు మాట్లాడుతూ సూర్యచంద్రులు ఉన్నంతవరకూ తెలుగు భాష వైభవం

కొనసాగాలి అంటే ప్రాచీన భాషపై మక్కువ ఉండాలని, ప్రాచీ గ్రంధాలు, ఇతిహాసాలు తదితర ప్రబంధాలను ప్రతి ఒక్కరూ చదవాల్సిసిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో పాఠశాల

ప్రధానోపాధ్యుయురాలు వివి. నాగేశ్వరిదేవి, à°‰à°ª ప్రధానోపాధ్యాయురాలు ఇందిర, పాఠశాలా అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns

media  #dnslive  #dns news  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #sisu mandir  #telugu  #mother tongue  #matru bhasha
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam