DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఓటుకు వస్తే పేడ కొడతాం, పార్టీలకు తెలుగు దండు హెచ్చరిక 

విశాఖపట్నం, ఫిబ్రవరి 21, 2019 (DNS Online): తెలుగు భాషను పూర్తి గా విస్మరించి నేడు ఓటు కోసం తమవద్దకు వచ్చే ప్రతి రాజకీయ పార్టీ మొహం పై పేడకొడతామని తెలుగు దండు హెచ్చరికలు

జారీచేసింది. గురువారం ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరం లోని మద్దిలపాలెం కూడలి వద్దగల తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆమెకు వందన సమర్పణ చేశారు.

ఈ సందర్బంగా తెలుగుదండు సమన్వయ కర్త పరవస్తు ఫణిశయన సూరి మాట్లాడుతూ వేల సంవత్సరాల నుంచి తెలుగుభాష అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని, అలాంటిది నేటి రాజకీయ

కీచక పాలనా ఫలితంగా నేడు అంతరించిపోయే భాషల జాబితాలోకి చేరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు, నేటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు,

విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సహా అందరికీ తెలుగు భాషను బ్రతికించమని, పాఠశాల స్థాయి నుంచి తెలుగు మాధ్యమాన్ని పునరుద్దరించామని, కాళ్లావేళ్లా

బ్రతిమాలుకున్నామని, వినకపోవడం తో ఆమరణ దీక్షకు కూడా దిగామన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మోసపూర్తి చర్య ఫలితంగా తాము దీక్ష విరమించవలసి వచ్చిందన్నారు.

వీళ్ళందరికీ ఒక్కటే హెచ్చరిక జారీ చేస్తున్నామని, తెలుగు భాష అభ్యున్నతి మీకు అవసరం లేదన్నప్పుడు మీరు తెలుగు భాషలో మాట్లాడవద్దు, తెలుగు గాలి పీల్చవద్దు,

తెలుగు వారిని ఓట్లు అడుక్కోవద్దు, అడుక్కుంటే మొహాన పెదకొడతామని హెచ్చరించారు. మీరు పాలనా చెయ్యాలన్నా తెలుగు కావలి, ప్రతిపక్షంలో చట్టసభల్లో కాకుల్లా

రావాలన్నా తెలుగు భాషే గతి మీకు. అలాంటి తెలుగు భాష అభివృద్ధికి కనీసం పట్టింపులేని మీకు తెలుగు వారిని ఓటు అడిగే హక్కు లేదని హెచ్చరించారు. ఈ సమావేశం లో ఆచార్య

నాగార్జున విశ్వ విద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్టర్ వి. బాలమోహన్ దాస్, ప్రజాకవి గాయకుడూ వంగపండు ప్రసాద రావు, ఆంధ్ర విశ్వ కళాపరిషత్ తెలుగు భాష విభాగపు

విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు ముందు వీరంతా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి, మా తెలుగు తల్లికి . . . గీతాన్ని ఆలపించి, తెలుగు భాషను

బ్రతికిద్దాం, స్వేచ్ఛ గాలులు పీలుద్దాం, తెలుగు భాష గొప్పదనం, మాతృభాషా శిరోధార్యం కాకూడదు శిరోభారం, మాతృభాషా మనకు కళ్ళు, పరభాషా కళ్ళజోడు, తల్లిపాల వంటిది

మాతృభాషా - పోతపాలు వంటిది పరభాషా, తెలుగుదనం మనకు ఘనం- తెలుగు భాష చరిత్ర ఘనం వంటి నినాదాలతో జాతీయ రహదారి మారుమ్రోగింది. 

 

#dns live  #dns  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #telugu

dandu  #paravastu suri  #political parties  #telugu desam  #YSR Congress
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam