DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోడీ పై మితిమీరిన నమ్మకమే బీజేపీ కొంప ముంచేనా ?

నేతల ప్రకటనలే అభ్యర్థుల కొంప ముంచేనా ?

కాషాయం కప్పుకున్న దేశం అభిమానిపై చర్యలు లేవా? 

చేతులు కాలాక ఆకులూ పట్టుకున్న నేతలు 

ప్రచారం

చెయ్యాల్సిన కాలంలో నోరెత్తని నేతలు 

విశాఖపట్నం, మార్చి 29, 2019 (DNS Online) : భారత ప్రధాని నరేంద్ర మోడీ పై పెట్టుకున్న మితిమీరిన నమ్మకమే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ

కొంప ముంచేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నుంచి లక్షల కోట్ల నిధులు ఇచ్చామని ఇప్పుడు చెప్తున్నా నేతలు గత ఐదేళ్ల కాలం లో నిద్రపోయి ఇప్పుడే

మెలోకొన్నట్టుగా ఉంది. అప్పుడేదో ఇది ఇచ్చాం, అప్పుడేదో ఇది ఇచ్చాం అంటూ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే చేతులు కాలిన తర్వాత ఆకులూ పట్టుకున్నట్టుగానే

కనిపిస్తోంది. దొంగలు పడిన ఆరునెలలకు కాపలావాళ్ళు మేల్కొన్నట్టుగా, పధకాలు ఇచ్చిన ఐదేళ్ల తర్వాత, చంద్రబాబు మా పథకాలకు తన పేరు చెప్పుకుంటున్నాడు అంటూ

చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు.

నాటి అధ్యక్షుని ఘోర తప్పిదం :

 à°ªà±ˆà°—à°¾ కేంద్రం ఇచ్చిన పధకాలను వెంటనే ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ నేతలు

మీడియా ముఖంగా విస్తృత ప్రచారం చేసుకోవాల్సి యుండగా నాటి అధ్యక్షులు, విశాఖ సిట్టింగ్ ఎంపీ కు తెలుగుదేశం పార్టీ తోనూ, చంద్రబాబు తోనూ ఉన్న సంత్సంబంధాల

కారణంగా బీజేపీ ని పూర్తిగా భూస్థాపితం చేసేసారు అనే విమర్శలు సాక్షాతూ రాష్ట్ర  à°¬à±€à°œà±‡à°ªà±€ అగ్ర నేతలే చేస్తున్నవి కావడం గమనార్హం. రాష్ట్రానికి 14 à°•à°¿ పైగా జాతీయ

స్థాయి విద్యా సంస్థలను కేటాయిస్తే జాతీయ స్థాయి మీడియాల్లో సైతం కనిపించేలా ప్రెస్ మీట్ లు పెట్టి మరీ ప్రచారం చెయ్యవలసి ఉన్న సమయంలో నాటి రాష్ట్ర అధ్యక్షుడు

గా ఉన్న డాక్టర్ హరిబాబు కేవలం ఏకవాక్య ప్రకటన తో సరిపెట్టడం వెనుక ఈయనకు, చంద్రబాబు కు ఉన్న అంతర్గత ఒప్పందం ఏనాడో బయట పడింది. అయితే దీన్ని తప్పు పెట్టె ధైర్యం

బీజేపీ నేతల్లో లేకపోవడం వల్లే నేడు బీజేపీ పూర్తిగా అగాధం లోకి పోయింది అనేది బహిరంగ రహస్యం. 
పూర్తిగా పార్టీని భూస్థాపితం అయినా తర్వాత ఇప్పుడు ప్రచారం

చేసిన ప్రయోజనం ఏమీ ఉండదు అనేది తెలిసినా,   ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు పడడం చాలా కష్టం అని తెలిసి, పార్టీ ఇచ్చిన ఆదేశం మేరకు బలిపశువులుగా

మారేందుకు సిద్ధపడిన కొందరు నిబద్దత కల్గిన బీజేపీ కార్యకర్తలను ఆదుకునేందుకు పార్టీ అధ్యక్షులు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ లు ప్రత్యక్ష ప్రచారం లోకి

దిగినా ఎంతవరకూ వీరు డిపాజిట్లు సాధించగలరు అనేది అనుమానమే. 

ప్రశ్నిస్తే మీడియా పై సీరియస్ :

మీడియా సమావేశాల్లో ప్రశ్నలు వేసే విలేకరులపై రుసరుసలు

విసిరే నేతలకూ బీజేపీ లో కొదవు లేదు. సాక్షాత్తు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణే మార్చి 1 న ప్రధాని నరేంద్ర మోడీ సభ ఏర్పాట్లపై నిర్వహించిన

విలేకరుల సమావేశం లో  à°ªà±à°°à°¶à±à°¨à°¿à°‚à°šà°¿à°¨ విశాఖ మీడియా ప్రతినిధి పై విసుక్కున్నఘటనలు పార్టీ నేతలూ చూసారు. అదే విధంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు లాంటి వారు ఒక్కొక్క

సారి శృతి తప్పిన ఘటనలూ ఉన్నాయి. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశం లో రాష్ట్ర అధికార ప్రతినిధి పురిగళ్ల రఘు సైతం à°’à°•à°¿à°‚à°¤ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.  à°‡à°¤à°°

పార్టీల పై ఉన్న వ్యతిరేక భావాన్ని మీడియా పై చూపించడం హర్షించతగ్గ విషయం కాదు అనేది à°ˆ పార్టీ నేతలకు తెలియక పోవడం గమనార్హం. 

అయినా వాళ్లకి ఆకులు

:

కొన్నేళ్ల పాటు పార్టీనే నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకునికి కనీసం పార్టీ లో ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి, తనకు తగిన గుర్తింపు

ఇచ్చిన  à°¤à±†à°²à±à°—ుదేశం పార్టీలో చేరడం విశాఖ బీజేపీ à°•à°¿ గట్టి దెబ్బె. 

అదే విధంగా రాష్ట్ర ప్రయోజనం కోసం à°’à°•  à°§à°°à±à°¨à°¾ చేసిన à°’à°• జాతీయ యువమోర్చ కమిటీ సభ్యున్ని

పార్టీ నుంచి బర్తరఫ్ చెయ్యగలిగిన ఘనత బీజేపీ కి ఉంది. అలాంటిది మొత్తం రాష్ట్రంలోనే పార్టీని భూస్థాపితం చెయ్యడానికి సంపూర్నంగా సహకరించిన మాజీ

అధ్యక్షునిపై ఎటువంటి చర్యలూ తీసుకోక పోవడం పార్టీ అగాధంలోకి పోవడానికి మరో నిదర్శనం. బొత్తిగా జనం లేని పార్టీ గా మారిపోకముందే కోలుకోక పొతే, కనీసం జండా మోసే

కార్యకర్తలు కూడా ఉండరన్నది వాస్తవం. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsnews  #dnsmedia  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #telugu desam  #narendra modi  #chandra babu naidu  #kanna lakshmi narayana  #somu veerraju  #purigalla raghu  #bharatiya janata party  #amit shah  #haribabu  #vishnu kumar raju  #pvn madhav
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam