DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పశ్చిమం మినహా వైకాపాకు గెలుపు అసాధ్యమే. . .

ప్రచార సునామీ లో జోరందుకున్న సిట్టింగ్ లు.

విశాఖపట్నం, ఏప్రిల్ 6 , 2019 (DNS Online డిఎన్ఎస్ ) : ఎన్నికల సమరం కేవలం ఐదు రోజుల దూరమే ఉన్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్

పార్టీకి విశాఖ లో గట్టి దెబ్బే తగలనుంది.  à°¨à°—à°° పరిధిలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రచారం లో జోరందుకున్నారు. ఒక్క విశాఖ పశ్చిమం లో తప్ప మిగిలిన చోట్ల à°ˆ

ప్రతిపక్ష పార్టీ గెలిచే అవకాశం లేకుండా పోయింది. ఐదేళ్ల కాలం సమయం లభించడం తో విశాఖ పశ్చిమం లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మళ్ల విజయ్ ప్రసాద్

క్రమం తప్పకుండా ప్రజా సమస్యలపై పోరాటాన్నే చేశారు. దీంతో ప్రజల అభిమానం సంపాదించగలిగారు. ముఖ్యంగా పారిశ్రామిక వాడల్లోని ప్రజలకు కనీస ఆరోగ్యం, విద్య, ఉపాధి,

ఆవాస్ పై దృష్టి పెట్టడం తో పాటు, విశాఖ నగర కాలుష్యంపై ఆయన ప్రభుత్వం తో పోరాటమే చేశారు. ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహనా ఉన్న అతి కొద్దిమంది రాజకీయ నేతల్లో మళ్ల

ఒకరు అనేది అందరికీ తెలిసిందే. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే (తెలుగుదేశం అభ్యర్థి) పిజివిఆర్ నాయుడు ఓటమి దాదాపు ఖరారైపోయింది. కేవలం ఒక వర్గానికే అతను పరిమితం

కావడం అతి పెద్ద తప్పిదంగా తేలిపోయింది. 
ఇక విశాఖ నగర పరిధిలోని మిగిలిన ప్రాంతాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే లు తమ ప్రచారాన్ని విస్తృత పరిచారు. ఒక్క రోజులో

పరిస్థితి తారుమారు చేసేసారు. 

విశాఖ దక్షిణం :

విశాఖ దక్షిణం నుంచి పోటీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ( తెలుగుదేశం అభ్యర్థి) వాసుపల్లి గణేష్ కుమార్,

అన్నింటా తానై, అంతటా తానై అన్నట్టుగా తిరుగుతూ, ప్రజలలో మమేమకమవ్వడం తో ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్

ప్రచారం లో ఘోరంగా వెనుకపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం ఎన్నికల కోసమే ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత పార్టలోకి రావడంతో పార్టీ కేడర్ లో తీవ్ర

వ్యతిరేకత నెలకొంది. కేవలం తన పాత సహచరులు ( కాంగ్రెస్ పార్టీ వర్గాన్ని) మాత్రమే తన వెనుక త్రిప్పుకుంటూ ప్రచారం చేస్తుండడంతో పార్టీ వర్గాల్లో వ్యతిరేకత

పెరిగిపోయింది, దీంతో క్రాస్ ఓటింగ్ కు సైతం రంగం సిద్ధం అయిపొయింది. కేవలం వైఎస్ జగన్ తో పరిచయం పెట్టుకుంటే మాత్రమే చాలదని, కేడర్ కి తగిన విలువ ఇస్తేనే ఓట్లు

పడతాయనే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పిన వినే నాధుడు ద్రోణంరాజు వెనుక లేకపోవడంతో పార్టీ కేడర్ చెయ్యి జారే అవకాశాలున్నాయి. .


. విశాఖ ఉత్తరం :. రాష్ట్రం లోనే

అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన విశాఖ ఉత్తరం నియోజకవర్గం లో సిట్టింగ్ ఎమ్మెల్యే ( భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ) పి విష్ణు కుమార్ రాజు తనదైన శైలిలో ఎన్నికల

ప్రచారాన్ని సూపర్ ఫాస్ట్ చేసేసారు. దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే రాజు లు

బీజేపీ అభ్యర్ధికి గెలుపు ను అడ్డుకునే ప్రయత్నం కూడా చేసేందుకు సాహసం చెయ్యలేని పరిస్థితి నెలకొంది. ఒక ఓటుకు పదివేలకు పైగా ఇచ్చి మరీ ఓటర్లను ప్రలోభపెట్టే

ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంటూ వచ్చిన వార్తలు దేశంలోనే సంచలనం సృష్టించాయి. అయినప్పడికే బీజేపీ అభ్యర్థి గత ఎమ్మెల్యే గా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు,

ప్రజలతో మమేకమై వారి కష్టాల్లో సైతం ఓదార్చడం, à°…à°‚à°¡à°—à°¾ నిలబడి ధైర్యాన్ని కల్గించడంతో ఈయన  à°Žà°¨à±à°¨à°¿à°• దాదాపు ఖరారైపోయింది. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive   #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #telugudesam 

#YSR Congress  #CPI  #Janasena  #Visakha West  #industries  #Visakha North  #Vishnu kumar raju  #Visakha South  #Vasupalli Ganesh Kumar  #dronamraju srinivas

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam