DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ నూతన డి ఆర్ ఎం గా చేతన్ శ్రీవాస్తవ భాద్యతలు 

విశాఖపట్నం, ఏప్రిల్ 24, 2019 (DNS online) : అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విశాఖపట్నం రైల్వే డివిజనల్ మేనేజర్ గా చేతన్ శ్రీవాస్తవ భాద్యతలు చేపట్టారు. బుధవారం విశాఖ డి ఆర్ ఎం

కార్యాలయంలో అధికారికంగా ముకుల్ శరన్ మధుర్ నుంచి ఆయన భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యంత అధిక ఆదాయం, ప్రాముఖ్యత కల్గిన

రైల్వే డివిజన్ కు అధికారిగా రావడం ఆనందంగా ఉందన్నారు. విశాఖ కేంద్రంగా రవాణా, ప్రయాణీకుల సదుపాయాల పై మరింత దృష్టి పెట్టి, వ్యాపార సంస్థలు, ప్రయాణీకుల మన్ననలు

పొందే విధంగా కార్యాచరణ చేపడతానన్నారు. 

బాధ్యతాయుతంగా విధులు నిర్వహించా: మాథుర్ 

గత రెండేళ్లుగా విశాఖ రైల్వే డివిజన్ పరిధిలో బాధ్యతాయుతంగా

విధులు నిర్వహించినట్టు ముకుల్ శరణ్ మాథుర్ తెలిపారు. తన పదవి కాలంలోనే విశాఖ పట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రకటన విడుదల కావడం మరింత

ఆనందంగా ఉందన్నారు. అత్యంత వేగవంతంగా కొత్తవలస లైన్ మార్గం లో వంతెన పై రైల్వే లైన్లు నిర్మించడం, దేశంలోనే ఖ్యాతి గాంచిందన్నారు. తన పదవి కాలంలో సహకరించిన

సిబ్బంది అందరికి ధన్యవాదములు తెలియచేసారు. 
à°ˆ కార్యక్రమం లో విశాఖపట్నం రైల్వే డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు. 

 

 

 

dns; dnslive; dns live; dnsnews; dns news; dnsmedia; dns media; vizag; visakhapatnam; waltair; divisional railway manager; DRM; Chetan Srivasthava; MK Saran Mathur; East Coast

Railways; South Coast Railways; 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam