DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాస్టర్ ఈకె . . . ఆధునిక ఆధ్యాత్మిక ధన్వంతరి  

సాధారణ కుటుంబం నుంచి అసాధారణ ఆచార్యునిగా. . .

ఆధ్యాత్మికతను విశ్వవ్యాప్తం చేసిన మాస్టర్

హోమియో వైద్యానికి విస్తృత ప్రచారం : 

ఒక్కో విభాగం

ఒక్కొక్కరికి .: . .

రెండు విభాగాలుగా వారసులు . .. 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ). . . 

విశాఖపట్నం, ఆగస్టు  11, 2019 (డిఎన్‌ఎస్‌) : మాస్టర్ ఈకె . .à°—à°¾ విశ్వ వ్యాప్తగా

ప్రాచుర్యం పొందిన ఎక్కిరాయాల కృష్ణమాచార్య ను ప్రత్యక్షంగా చూసిన వారు ఎక్కువగా ఉండకపోవచ్చు కానీ, అయన పేరు వినని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. విశాఖ నగరం. .

 à°—ుంటూరు నగరాలతో ప్రయక్ష అనుబంధం కల్గిన ఈయన జన్మదినోత్సవాన్ని (ఆగస్టు 11 ) పురస్కరించుకుని. . .. అక్షర నివాళి. . .. 

అత్యంత సాధారణ కుటుంబ ప్రస్థానం కల్గి ఉంది

విశ్వవ్యాప్త కీర్తి గడించిన అతి తక్కువ మందిలో మాస్టర్ ఈకె అగ్రగణ్యులు. సాధారణ అధ్యాపకునిగా జీవితాన్ని సాగిస్తున్న ఈయన తానూ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలే

అయన జీవన గమ్యాన్ని నిర్దేశించాయి. గుంటూరు హిందూ కళాశాల అధ్యాపకునిగా విధులు నిర్వహిస్తూ అనంతరం ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ( ఎయు) లో తెలుగు అధ్యాపకునిగా తన

ప్రస్థానాన్ని విశాఖకు మార్చారు. ఆచార్యాత్వానికి అక్షర సాక్షాత్కారం à°ˆ మాస్టర్ ఈకె. 

హోమియో వైద్యానికి విస్తృత ప్రచారం : . . .

ఆధ్యాత్మిక  à°ªà±à°°à°µà°šà°¨à°¾à°²à°¤à±‹

పాటు, హోమియో వైద్యాన్ని కూడా ప్రచారం చేసారు. కేవలం విశాఖపట్నం లోనే కాక, ఆంధ్ర, రాష్ట్రేతర, దేశ విదేశాల్లో సైతం శిష్యులకు విద్య విధానం పై అవగాహనా పెంచి, వైద్య

విధానంలో శిక్షణ అందించడమే కాక, వైద్య శాలలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. నాడు విశాఖ నగరంలోని చిన్న వాల్తేర్ లోని ఒక చిన్న ఇంటిలో మొదలు పెట్టిన హోమియో

వైద్య ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం నేడు లక్షలాది మంది శిష్యులు హోమియో వైద్యశాలల్లో నిర్వహిస్తున్నారు. వీరిలో ఉచితంగా మందుల పంపిణీ చేసేవారు ఉన్నారు,

వ్యాపార పరంగానూ వైద్య సేవలు అందించేవారూ ఉన్నారు.  

ఒక్కో విభాగం ఒక్కొక్కరికి .: . .

దేశ విదేశాల్లో విస్తరించిన శిష్యుల్లో కొందరికి ఆధ్యాత్మిక

ప్రసంగ ప్రచారం, మరికొందరికి హోమియో వైద్య ప్రచారం, ఇంకొందరికి పుస్తక ప్రచురణలు, మరికొందరికి యోగ ధ్యాన విధానం ప్రచార భాద్యతలను అప్పగించారు.  à°¨à°¾à°Ÿà°¿ నుంచి

ఇంతింతై వటుడింతై అన్నట్టు మాస్టర్ ఈకె సంస్థలు ప్రపంచ దేశాల్లో సేవలు అందిస్తున్నాయి.  à°‡à°‚కొందరు హైందవ సంస్కృతిని నేర్పించే ఆధునిక పాఠశాలలను కూడా

నిర్వహిస్తున్నారు. 

రెండు విభాగాలుగా వారసులు . .. 

అందరూ మాస్టర్ ఈకె విధానాన్ని విస్తరింపచేయాలనే సంకల్పంతో వారసులు విడివిడిగా à°ˆ  à°¸à°‚స్థల

ప్రచారానికి కంకణం కట్టుకున్నారు. మాస్టర్ ఈకె కుటుంబ సభ్యులు ఎక్కిరాల అనంతకృష్ణమాచార్యులు, అయన సోదరులు, శిషులు ఒక బృందంగా, ఈకె శిష్యులు కంభంపాటి

పార్వతికుమార్ అనుచరులు మరొక బృందంగా విడిపోయి మాస్టర్ ఈకె లక్ష్యాన్ని ప్రజల చెంతకు తీసుకువెళ్తున్నారు. 

అయన జన్మ దినోత్సవ వేడుకలను ఆగస్టు  à°¨à±†à°²à°²à±‹à°¨à±,

గురుపూజోత్సవాలను జనవరి నెలలోనూ మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహింస్తున్నారు.  

వ్యక్తిగత ప్రస్థానం :. . .

మాస్టర్ ఈకె గా విశ్వ ప్రాచుర్యం పొందిన

ఈయన గుంటూరు జిల్లా బాపట్లలో అనంతాచార్యులు మరియు బుచ్చమ్మ దంపతులకు ఆగస్టు 11, 1926 లో అవతరించారు. బాల్యం లో తండ్రి వద్దే తెలుగు, సంస్కృత భాషలతో పటు ఆధ్యాత్మిక గ్రంథ

పఠనం కూడా అభ్యసించారు. సోదరులు వేదవ్యాస, భరద్వాజ లకు మార్గదర్శకం చేస్తూ నాటి నుంచే ఆచార్యత్వ లక్షణాలు ప్రకటింపచేసారు. తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషలలో

అనిర్వచనీయ పాండిత్యాన్ని సాధించారు.  
'పాండురంగ మాహాత్మ్యం' కావ్యంపై పరిశోధన చేసి ఒక అద్భుతమైన గ్రంథాన్ని వెలయించి 'డాక్టరేట్' సాధించారు . వీరి రచనలలో

'రాసలీల', 'ఋతుగానం', 'గోదా వైభవం', 'అశ్వత్థామ సుభద్ర', 'అపాండవము', 'స్వయంవరము', 'పురాణ పురుషుడు', 'పురుష మేధము', 'లోకయాత్ర' లు మంచి ప్రచారం పొందాయి. జయదేవుని 'గీత

గోవిందము'ను 'పీయూష లహరి' అనే పేరుతో అచార్య తెలుగులోకి అనువదించారు.

వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ : ...

ఐరోపాలో పర్యటించి సనాతన భారత ధర్మానికి అక్కడ

ప్రచారాన్ని కల్పించి, జగద్గురువుగా ఖ్యాతిగాంచాడు. 'వరల్డు టీచర్స్ ట్రస్టు' (జగద్గురు పీఠం) అనే సంస్థను స్థాపించి తన బోధనలు తగు ప్రచారం పొందే ఏర్పాటుచేసారు.

ఈయన కృషి ఫలితంగా జెనీవా నగరంలో మొరియా విశ్వవిద్యాలయం రూపొందింది. ఇది మానవ జీవితానికి ఆవశ్యకాలైన తత్వశాస్త్ర, వైద్యశాస్త్రాలను సమగ్రంగా సమన్వయించే

విద్యాపీఠం. హోమియోపతి వైద్యవిధానం భారత దేశ ఆర్థిక పరిస్థితికి చక్కగా సరిపోతుందని భావించి, ఈయన కొన్ని కేంద్రాలలో ఉచిత హోమియో వైద్యాలయలను నెలకొల్పారు. ఈ

వైద్యశాస్త్రాన్ని వివరించే సారస్వతాన్ని తెలుగులోను, ఆంగ్లంలోను రచించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam