DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవినీతి తిమింగలాలకు అవార్డులు ఇవ్వవద్దు : ఆర్ టి ఐ రమణ

గత తప్పిదాలు పునరావృతం కానీయరాదు

పరపతి తో అవినీతి తిమింగలాలకు అవార్డులా? . . .

అర్హులకే అవార్డులు ఇవ్వాలి :

జిల్లా కలెక్టర్‌కు కాండ్రేగుల

వెంకటరమణ విజ్జప్తి 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, ). . . .

విశాఖపట్నం, ఆగస్టు  13, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రతి ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అందించే పురస్కారాలు

(ప్రశంసాపత్రాలు) అవినీతి తిమింగలాలు అందించకూడదని, జిల్లా కలెక్టర్‌కు సమాచార హక్కు, వినియోగదారు రక్షణ ఉద్యమకర్త, పబ్లిక్‌ ఫోరం రాష్ట్ర కో`ఆర్డినేటర్‌

కాండ్రేగుల వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. à°ˆ మేరకు ఇటు ప్రభుత్వానికి అటు జిల్లా కలెక్టర్‌కు మంగళవారం పంపిన వినతిపత్రంలోని వివరాలను ఆయన పత్రికలకు విడుదల

చేశారు. కేవలం అర్హులైన ఉద్యోగులను మాత్రమే ప్రశంసా పత్రాల ఎంపికకు పరిగణన లోకి తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకూ నిర్ధిష్టమైన నిబంధనాలను లేకపోవడం వలన

ఇష్టానుసారంగా అందజేస్తుండడంతో గతేడాది పురస్కారాల పంపిణీ అభాసుపాలైన 
విషయాన్ని గుర్తు చేసారు.  à°ˆ నేపధ్యంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం

జరగనున్న ప్రతిభా పురస్కారాల  à°…ందజేతకు తగు జాగ్రత్తు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2018లో చోటుచేసుకున్న అనైతిక చర్యలు  à°ªà±à°¨à°°à°¾à°µà±ƒà°¤à°‚ కానీయరాదన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవ ప్రతిభా పురస్కారాలకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం జారీ చేసిన ఆదేశాలు  (ఆర్‌.సి.నెం.1378/2018/ఏ5 తేది : 2`8`2018)ను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు.

బయోమెట్రిక్‌ హజరు 90 శాతంకు పైగా, పనిచేయు కార్యాలయ హెడ్‌ క్వార్టర్‌లో నివాసమున్న అధికారులు, ఉద్యోగులకు మాత్రమే ప్రశంసాపత్రాలు అందజేయాలని ఆయన

సూచించారు. 

పరపతి తో అవినీతి తిమిగలాలకు అవార్డులా? . . .

గతంలో ఉత్తమ అధికారిగా అవార్డులు అందుకున్న వారిలో అవినితి కేసులు నమోదైన సంఘటనలు ఎన్నో

ఎదురయ్యాయని రమణ తెలియచేసారు. అక్రమార్కులకు అండగా నిలిచినా అధికారులను కూడా శిక్షించవలసిన అవసరం ఉందన్నారు. ఏసీబీ దాడుల్లో దొరికినవారూ ఉన్నారన్నారు.

 

అర్హులకే అవార్డులు ఇవ్వాలి :. .

పురస్కారాలకు ఉద్యోగులను సిఫార్స్‌ చేసే జిల్లా అధికారులను పూర్తిగా బాధ్యులను చేయాలని డిమాండ్ చేసారు. అధికార

దుర్వినియోగం, అవకతవకలకు ప్పాడుతూ విధుల  à°¨à°¿à°°à±à°µà°¹à°£à°²à±‹ అలసత్వం, జాప్యం  à°ªà±à°°à°¦à°°à±à°¶à°¿à°‚చు ఉద్యోగులను పురస్కారాలకు సుదూరంగా ఉంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. జిల్లా,

డివిజన్‌, మండల స్ధాయి అన్ని కేటగిరీ శాశ్వత ఉద్యోగుల పనితీరుపై ప్రతిభ ధ్రువీకరణ సిఫార్స్‌ లేఖలు సంబంధిత వర్గాల నుంచి విధిగా స్వీకరించాలన్నారు. అర్హులకు

దక్కే పురస్కారాలు మరింతగా ప్రజలకు సేవ చేయడానికి దోహదపడతాయని ఆయన ఆకాంక్షించారు. పారదదర్శకత, జవాబుదారీతనం పెంపుదల ... బాధ్యతాయుతంగా పని చేసిన ఉద్యోగులకు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రశంసా పత్రాలు అందజేయాలని విజ్జప్తి చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam