DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శాఖల సమన్వయంతో రొట్టెల పండుగ ఏర్పాట్లు

సమీక్షలో కలెక్టర్, ఎస్పీ, కమిషనర్

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌) : వివిధ ప్రభుత్వ శాఖల సేవలను

సమన్వయం చేసుకుంటూ, రొట్టెల పండుగలో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, విచ్చేసే భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని వసతులూ కల్పిస్తున్నామని

జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు పేర్కొన్నారు. స్థానిక బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, కమిషనర్ పివివిఎస్ మూర్తి,

నుడా వైస్ చైర్మన్ బాపిరెడ్డిలతో కలిసి కలెక్టర్ శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ముసాఫిర్ ఖానా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో వివిధ

ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, పండుగ నిర్వాహక కమిటీ సభ్యులతో వారు భేటీ అయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన రొట్టెల పండుగ నిర్వహణకు పోలీసు,

వైద్యం, విద్యుత్, ఫైర్, టూరిజం, మృత్స్యశాఖ, నగర పాలక సంస్థ తదితర శాఖల సేవలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రధాన

ప్రాధాన్యతనిస్తూ మొబైల్ టాయిలెట్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని, వాటి నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తామని వివరించారు. దూర ప్రాంతాల నుంచి

విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కేటాయించిన ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలకు అనుసంధానంగా తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్

చెప్పారు. 

నగర పాలక సంస్థ కమిషనర్ పివివిఎస్ మూర్తి మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ నిర్వహణకు అన్ని శాఖల సహకారంతో ఏర్పాట్లు

అందిస్తున్నామని, భక్తుల మనోభావాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలూ వహిస్తున్నామని తెలిపారు. మతపెద్దల సంప్రదాయ సూచనలూ, పండుగ నిర్వహణ కమిటీ

సలహాలను పాటిస్తూ రొట్టెల పండుగను విజయవంతం చేస్తామని కమిషనర్ ఆకాంక్షించారు. బారాషహీదుల దర్శనార్థం బారికేడ్ల ఏర్పాటు, లైటింగ్, మహిళలకు ప్రత్యేక క్యూ మార్గం,

తొక్కిసలాటలు జరుగకుండా ప్రత్యేక నిఘా, మహిళా భక్తుల రక్షణ, ప్రాధమిక వైద్య కేంద్రాల ద్వారా సేవలు, ఉచిత మంచినీరు, దర్గా ఘాట్ వద్ద రక్షణా చర్యలు, మరుగుదొడ్లు,

స్నానపు గదుల ఏర్పాట్లు, కమాండ్ కంట్రోల్ విభాగం ఏర్పాటు, ప్రైవేట్ ఆసుపత్రుల సేవలు, రెడ్ క్రాస్ సంస్థ సేవలూ, పార్కింగ్ స్థలాల్లో మంచినీరు, మరుగుదొడ్ల

సౌకర్యాలు, భక్తుల విశ్రాంతికి ఈద్గా ప్రాంగణంలో తాత్కాలిక వాటర్ ప్రూఫ్ పైకప్పు నిర్మాణం, దర్గా ప్రాంగణం మొత్తం ప్లాస్టిక్ వాడకంపై నిషేధం వంటి వివిధ

అంశాలకు ప్రాధాన్యం కల్పిస్తూ అన్ని వసతులు కల్పిస్తున్నామని కమిషనర్ వివరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam