DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పరిసరాల పరిశుభ్రత ఉంటె వ్యాధులు దరి చేరవు

స్వచ్ఛతా హి సేవకు కదిలి రావాలి: కలెక్టర్ వినయ్ చంద్

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, సెప్టెంబర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌)  à°ªà°°à°¿à°¸à°°à°¾à°²  à°ªà°°à°¿à°¶à±à°­à±à°°à°¤ ఉంటేనే

మలేరియా, డెంగ్యూ, మొదలైన కీటక జనిత వ్యాధులు దరిచేరవని జిల్లా కలెక్టర్ వినయ్ చాంద్ తెలిపారు. అక్టోబర్ 2à°µ తేదీ నుండి మొదలయ్యే  'స్వచ్ఛతా హి సేవ' కార్యక్రమానికి

అందరూ కదిలి రావాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ  à°†à°¦à±‡à°¶à°¾à°²à°¨à± అనుసరించి ఈనెల11 నుంచి అక్టోబరు 27à°µ తేదీ వరకు  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ జిల్లా వ్యాప్తంగా

'స్వచ్ఛతా హి సేవ' చేపడుతున్నట్లు తెలిపారు.

'ఆరోగ్యమే మహాభాగ్యం'  'పరిశుభ్రత తోనే ఆరోగ్యం' గృహాలు పరిసరాలు, వీధులు, పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు, ఈగలు,

పురుగులు మొదలైన క్రిమికీటకాలు వృద్ధి చెందవు అన్నారు.  à°…ందరూ ఆరోగ్యంగా ఉంటే సంపద కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. కాబట్టి  'స్వచ్ఛతా హి సేవ'లో ప్రతి ఒక్కరూ

పాల్గొని స్వీయ, పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మించడంలో  à°¤à°® వంతు పాత్ర పోషించాలని పేర్కొన్నారు. ప్రస్తుత రోజుల్లో అపరిశుభ్రతకి

ప్రధాన కారణం ప్లాస్టిక్ బ్యాగులు, వస్తువులే అని నిర్దారించారన్నారు. ఈ ప్లాస్టిక్ అనర్ధాలకు కారణంగా నిలిచిందన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని

నిర్మించేందుకు అందరూ నడుం కట్టాలని పిలుపునిచ్చారు.
à°ˆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం  à°šà±‡à°ªà°Ÿà±à°Ÿà°¾à°²à±à°¸à°¿à°¨ కార్యాచరణ ప్రణాళికను

రూపొందించినట్లు తెలిపారు. మురుగు కాలువలను శుభ్ర పరచడం, తుప్పల ను తొలగించడం, పైపులైన్ల లీకేజీ లను గుర్తించి సరిచేయడం, వ్యర్థ నీటి కుంటలు తొలగించడం, బోర్లు,

కుళాయిల వద్ద పరిశుభ్రంగా ఉంచడం, చెత్తకుప్పలు, పశువుల పాకలు, తుప్పల వద్ద నిల్వ ఉన్న నీటిని తొలగించి, నీరు నిల్వ ఉండకుండా అవగాహన కల్పించడం, శుభ్రపరచడం, పాత

టైర్లు జోళ్ళు మొదలైనవి లేకుండా చేయడం, దోమల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టడం, ఫాగింగ్ చేయడం, ఉపయోగంలో లేని నూతులు, గోతులు పూడ్చి వేయడం, కులాయి లో మురుగు నీరు

చేరకుండా చూడటం, వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం అవసరమైతే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, మొదలైనవి చేపట్టడం జరుగుతుందన్నారు.

సెప్టెంబర్ 11వ తేదీ నుండి

అక్టోబరు 1à°µ తేదీ వరకు  'స్వచ్ఛతా హి సేవ' కార్యక్రమం పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతామన్నారు. అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా, గాంధీ పుట్టిన రోజు నాడు

పరిశుభ్రత కై శ్రమ దానాలు, జాతీయ ప్రతిజ్ఞ ఉంటాయన్నారు. అక్టోబర్ 3వ తేదీ నుండి ప్లాస్టిక్ వ్యర్ధాలను గుర్తించి సేకరించడం వాటిని రీసైక్లింగ్ చేయడం

జరుగుతుందన్నారు. అక్టోబర్ 27వ తేదీన ప్లాస్టిక్ రహిత ఆనంద దీపావళి జరుపుకుంటా మన్నారు.
జిల్లాలో గ్రామ, వార్డు స్థాయి నుండి  'స్వచ్ఛతా హి సేవ' కార్యక్రమానికి

ప్రతి ఒక్కరూ నడుం బిగించి కదలిరావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రజలు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధించగలమని

ఆరోగ్యమైన సమాజాన్ని సాధించుకో గలమన్నారు.  à°ªà±à°²à°¾à°¸à±à°Ÿà°¿à°•à± వ్యర్థాల నిర్వహణపై పెద్ద ఎత్తున ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలను

నిర్వహించాలని అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అందరూ భాగస్వాములు కావాలన్నారు.

ఇటీవల నియమింపబడిన మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు    'స్వచ్ఛతా హి

సేవ' కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చి అన్ని గ్రామాలలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు విస్తృతంగా పాల్గొనేలా చూడాలన్నారు. కార్యక్రమం ప్రారంభం అమలుపై

సమీక్షించి ఆరోగ్యం, పారిశుధ్యం పై తగు చర్యలు తీసుకోవాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించినట్లు తెలిపారు.

పరిశుభ్రతతో పాటు ప్లాస్టిక్ వ్యర్ధాలు

నిర్మూలనే ధ్యేయంగా గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ప్రార్థనాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ప్రధాన ప్రదేశాలలో సభలు, సమావేశాలు, ర్యాలీలు,

అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam