DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాదక ద్రవ్యానికి మహత్తర మార్గం ఈ - సిగరెట్ . . .

à°ˆ సిగరెట్ల పై వేటు, కనపడితే à°•à° à°¿à°¨ శిక్షే. . . . 

చూసే రూపం వేరు . . లోపల పదార్థం వేరు. . .

సిగరెట్ తో అందరికీ , à°ˆ-సిగరెట్ తో వీళ్లకే సమస్య  . .

(DNS రిపోర్ట్ :

సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌) : మాదక ద్రవ్యం సేవించడానికి మహత్తరమార్గం à°ˆ- సిగరెట్. గతం లో రహస్యంగా త్రాగే మాదక ద్రవ్యాన్ని ఇప్పుడు

నేరుగా బహిరంగంగా తీసుకుంటున్నారు. ప్రధానంగా పాశ్చాత్య పోకడలకు అలవాటు పడిన యువత ఈ-సిగరెట్ ద్వారా విచ్చలవిడితనానికి అలవాటు పడిపోతున్నారు. దీనిపై ఉక్కుపాదం

మోపేందుకు కేంద్ర ప్రభుత్వం à°ˆ-సిగరెట్ ను బాన్ చేసింది. 

భారత్ లో పూర్తి నిషేధం : ఆర్ధిక మంత్రి 

ఎంతో ఉజ్వల భవిషత్ ఉన్న యువతను తప్పుదారి పట్టిస్తున్న

à°ˆ-సిగరెట్ లను భారత దేశంలో పూర్తిగా నిషేధించామని, దీన్ని వినియోగిస్తే à°•à° à°¿à°¨ చర్యలు తప్పవని కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. 
/>  à°ˆ-సిగరెట్లు ఏ రూపంలో భారత్ లో కనిపించినా, అమ్మినా, తయారు చేసినా, రవాణా చేసిన, పంపిణీ చేసినా, దాచినా, దీని గురించి ప్రకటనలు చేసినా సరే శిక్షార్హులన్నారు.  à°ˆ-

సిగరెట్ పదార్ధాలు 400 బ్రాండ్ ల్లో అందుబాటులో ఉన్నాయని, ఇవేవి భారత్ లో తయారు కావడం లేదన్నారు. 150 రకాల్లో మార్కెట్లోకి మాత్రం వచ్చాయన్నారు. 

మొదటి సారి

తప్పిదానికి à°’à°• సంవత్సరం జైలు, లక్ష రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. పదేపదే తప్పిదం చేస్తే 3 ఏళ్ళు జైలు, రూ. 5 లక్షలు వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది.  

à°ˆ -

సిగరెట్టూ అంటే : . . . .

ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్ (ఈఎన్ డీఎస్). ఆధునిక సాంకేతిక పరికరాన్ని ఉపయోగించి మాదక ద్రవ్యాన్ని తీసుకునే విధానం

విస్తృతంగా పెరిగిపోతోంది.ఈ సిగరెట్ వాడడం ద్వారా పొగ బయటకు రాకపోవడంతో దీని వినియోగం పై పెద్దగా ఫిర్యాదులు రాకపోవడంతో ప్రచారాన్ని పెంచుకుంటూ

వెళ్లిపోతున్నారు.  
సాధారణ సిగరెట్ పీలిస్తే పొగ రావడం వలన ప్రక్కవారికి అనారోగ్యం వస్తోంది. ఈ- సిగరెట్ వలన ఇతరులకు ఇబ్బంది లేకపోవడం తో ఫిర్యాదులు రావడం

లేదు.  

మత్తు పదార్ధాలను వాడే సాధనం ఇది: . . .. 

వివిధ రూపాల్లో ఉన్నందున వీటిని గమనించే అవకాశం తక్కువ. సిగరెట్లు గాను, పెన్నులు గాను, విజిల్స్ గాను,

పెన్సిల్ గాను, సిగార్స్ గాను ఇలా విభిన్న రూపాల్లో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేసాయి. 

సిగరెట్ తో అందరికీ , à°ˆ-సిగరెట్ తో వీళ్లకే సమస్య :  . .

సాధారణ

సిగరెట్ త్రాగితే వీళ్ళు వదిలే పొగ పర్యావరణాన్ని నాశనం చేస్తాయి. దీంతో సిగరెట్ త్రాగేవాళ్ళకి కూడా జబ్బులు వచ్చే అవకాశం ఉంది. తద్వారా సిగరెట్ కాల్చేవాడితో

పాటు, ప్రక్కవాడు కూడా మరణించే అవకాశం ఉంది. 

అదే ఈ-సిగరెట్ కలిస్తే. . .కేవలం కాల్చేవాడు మాత్రమే జబ్బుపడి, మరణించే అవకాశం ఉంది. రెండు విధాలా ధూమపానం కూడా

ప్రమాదమే. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam