DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహాత్మా మన్నించు. . . . . . DNS ప్రత్యేక కథనం

గాంధీ 150 వ జయంతి కి ఘనమైన నివాళి ఇదేనా ?

గాంధీ " సిద్ధాంతాని" కే  à°Ÿà±‹à°ªà±€à°²à± పెడుతున్నారు , 

గాంధీ మద్యం నిషేధిస్తే . .వీళ్ళు అమలు

చేస్తున్నారు 

జయంతికి, వర్ధంతికి దండం తప్ప మరొకటి ఉందా ?

మద్య పానమే జీవనాధారంగా ప్రభుత్వ పాలనలు 

గాంధీ ఫోటో కే విలువా ?, సిద్ధాంతాలకు లేదా?

 

గాంధీ అంటే ఫోటో లో బొమ్మే నా ? à°®à±‚డు కోతుల సూచిక  à°¤à°¿à°°à°— రాశారా :  . . .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌) : 150 à°µ జయంతి

సందర్బంగా గాంధీకి ఘనంగా నివాళి ఇవ్వాలి అని దేశం యావత్తూ భావిస్తుంటే ప్రభుత్వాల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. గాంధీ మద్య పానం ధూమ పానం పూర్తిగా

నిషేధించినట్టు చరిత్ర తెలియ చేస్తోంది. అయితే ఈయన స్వాతంత్ర పోరాట కాలం నుంచే మద్యపానాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. దీని వలన బుద్ది మందగించి, ఆరోగ్యం

కోల్పోతారని, తద్వారా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయనే విషయాన్నీ అయన ఎన్నో మార్లు దేశ ప్రజలకు తెలియ చేసారు. మద్యపానం, క్రయ విక్రయాలను పూర్తి గా నిషేదించాలని

పిలుపు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. 

మద్యమే మహద్భాగ్యం : . ..

.అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం విక్రయాలే జీవనాధారంగా పరిపాలన

సాగిస్తున్నాయి. ఇదే ప్రధాన ఆదాయ వనరులుగా ఎంచుకుని, ప్రభుత్వ ఐఏఎస్ అధికారులు, పోలీసు అధికారులు, వేలాదిగా పోలీసు బలగాలను రక్షణగా పెట్టి మద్యం విక్రయ దుకాణాలు

 à°µà±‡à°²à°‚పాట వేస్తున్నారు. దీంతో ప్రజా జీవనం లో మద్యం ఏరులై పారుతోంది. 

గాంధీ బొమ్మ కే విలువ. . సిద్ధాంతానికి కాదు : . . .

ఈ దేశం లో గాంధీ కి విలువ ఇవ్వడం అంటే

కేవలం అయన జయంతి కి, వర్ధంతికి అయన ఫోటో కి దండం పెట్టడం ఒక్కటే అనే విధంగా ప్రభుత్వాలు తయారయ్యాయి. అయన సూచించిన సిద్ధాంతాలు, ఏ ఒక్కటి అమలు చెయ్యాలి అనే ఇంగితం

కూడా లేకుండా పోయింది. గాంధీ ధూమ పానం, మద్యపానం పూర్తిగా నిషేదించారు, వీళ్ళు ఇందుకు భిన్నంగా ధూమపానం, మధ్య క్రయ, విక్రయాలకు ప్రభుత్వ లైసెన్సు లు ఇచ్చి మరీ

జనాన్ని చెడగొడుతున్నారు. à°ˆ వ్యవహారం కారణంగా లక్షలాది కుటుంబాలు రోడ్డున పడినా పట్టింపే లేదు. 

మంచి నీరు లేదు, మద్యం పేకెట్ తప్పదు: . . .

పైగా ఈ విష

సంస్కృతిని రాజకీయ పార్టీలు పూర్తిగా పెంచి పోషిస్తున్నాయి. ఒక సభ జరిగినా మద్యం పేకెట్, ర్యాలీ జరిగినా మద్యం పేకెట్ పంపిణీ చేస్తున్నారు. వీళ్ళు మంచి నీరు

ఇస్తారో లేదో తెలియదు గానీ మద్యం పేకెట్ మాత్రం కచ్చితంగా పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలవాలి అంటే మద్యం పంపిణీ చెయ్యాలి, తీరా అధికారం లోకి వచ్చాక

తిరిగి డబ్బులు సంపాదించాలంటే ఈ మద్యం అమ్మకాలు జరపాలి. ఈ డబ్బులతోటే ఎదిగిన వీళ్ళు చట్టసభల్లోకి కూడా ప్రవేశిస్తున్నారు. వీళ్ళకి తెలిసిన వ్యాపారం మద్యం

ఒక్కటే కావడం తో ఆ వ్యాపార అభివృద్ధి ఇబ్బడి ముబ్బడిగా మద్యం దుకాణాలకు ప్రభుత్వ పరంగా లైసెన్స్ ఇవ్వడంతో పాటూ, అనధికారిక విక్రయాలకు బెల్టు దుకాణాలు కూడా

నిర్వహింప చేస్తున్నారు. కొన్ని చోట్ల ఏకంగా ప్రభుత్వాలే దుకాణాలను న్రివహించే స్థితికి చేరుకుంది. పైగా దీని అమలు ఏకంగా ఒక శాఖనే తయారు చేసేసి, పోలీసు బలగాల

అండతో యధేచ్చగా క్రయ విక్రయాలు చేపడుతున్నాయి à°ˆ ప్రభుత్వాలు.  

ఒక్కో ప్రభుత్వం ఒక్కో విధమైన మద్యం పాలసీ ని అమలు చేస్తూ, ప్రజలను పూర్తిగా నాశనం

చేస్తున్నాయి. ప్రజలు ఎలా పోయినా మాకేమి, మా నిధులు మాకొస్తే చాలు అనే విధంగా మద్యం వ్యాపారాలు, పార్టీ లకు కోట్లాదిగా నిధులు సమకూరుస్తూ ప్రభుత్వాలను శాసించే

స్థాయి à°•à°¿ చేరిపోయాయి. à°’à°• వేళ ఏ ప్రభుత్వమైనా మద్యం నిషేధించే ప్రయత్నం చేస్తే తక్షణ à°† ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా ఉంది. 

గాంధీ కి నివాళి ఇచ్చే చేతులకు

కనీసం ఆ అర్హత ఉందా అనేది ఆలోచించుకోవాలి. గాంధీ చెప్పిన సిద్ధాంతాల్లో కనీసం ఒక్క పని చేసినా వాళ్లకి నివాళి అర్పించే అర్హత వస్తుంది, కానీ అసలు గాంధీ అంటే

ఫోటో లో బొమ్మ మాత్రమే అనుకునే  à°ªà°¾à°²à°•à±à°²à°¨à°¿ నివాళి అర్పించే అర్హత ఉందా?  à°…నేది వాళ్ళే ఆలోచించుకోవాలి. 

ప్రభుత్వ పెద్దల దృష్టిలో గాంధీ అంటే :. . .

రూపాయి

మీద బొమ్మ 
కార్యాలయాల్లో గోడ మీద ఒక ఫోటో
ప్రతి శుక్రవారం రేడియో లో 5 నిమిషాల గాంధీ సిద్ధాంతాల ప్రకటన
అక్టోబర్ 2 , జనవరి 30 న ఫోటో కి దండం పెట్టడం
నాలుగు రోడ్ల

కూడలి వద్ద నీడ కూడా లేకుండా విగ్రహం పెట్టడం 
పోస్టల్ స్టాంప్ విడుదల . .. 
గాంధీ పేరు పెట్టి ప్రాజెక్ట్ లు చేసే వారికి కోట్లాది నిధులు ఇవ్వడం,
ఇంకా ఇలా

గాంధీని గోడల మీద ఫొటోలకే పరిమితం చేసేసారు. 

అయన చెప్పినవి : . . 

అసత్యం మాట్లాడకు, మద్యం తాగ వద్దు , అమ్మ వద్దు,  à°µà±à°¯à°¸à°¨à°¾à°¨à±à°¨à°¿ ప్రోత్సహించవద్దు. చేనేత

వస్త్రాలనే ధరించాలి, నేత పరిశ్రమను ప్రోత్సహించాలి. ఇలా ఎన్నో ఉన్నాయి. . 

మేనిఫెస్టో నుంచి అబద్దాలు ఆరంభం :. .. 

అసత్యం మాట్లాడకు అనే నినాదానికి రాజకీయ

పార్టీలు తమ మేనిఫెస్టో నుంచే తూట్లు పొడుస్తున్నాయి. మేనిఫెస్టో లో ఇబ్బడి ముబ్బడిగా ప్రకటనలు, హామీలు ఇస్తూ. .. ప్రజలను మభ్యపెడుతున్నాయి. తీరా ఇవన్నీ నమ్మి

ప్రజలు వీళ్ళకి అధికారం అప్పగిస్తే. . మేనిఫెస్టో లో ఒక్క అంశం కూడా అమలు చెయ్యక పోగా . . అన్నీ తూచ్ అంటున్నాయి. మొదటి అంశంలోనే ఘోరంగా తప్పు చేస్తున్న ఈ పాలకులకు

గాంధీకి నివాళి ఇచ్చే అర్హత ఉందొ లేదో ఆలోచించుకోవాలి.  

మూడు కోతుల సూచిక  à°¤à°¿à°°à°— రాశారా :  . . .

చెడు వినకు . . చెడు కనకు . .  à°šà±†à°¡à± మాట్లాడకు . . అనే గాంధీ

చెప్పిన మూడు కోతుల సూచికకు తిరోగమన సిద్ధాంతాన్ని తెలియచేస్తోంది ప్రస్తుత రాజకీయ విధానం.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam