DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మద్యాన్ని తగ్గించేందుకే ప్రభుత్వ దుకాణాలు: మంత్రి అవంతి 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, సెప్టెంబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌):  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో మద్యం వాడకాన్ని తగ్గించే క్రమంలోనే ప్రభుత్వ

దుకాణాలను ప్రవేశపెడుతున్నట్లు పర్యాటక సాంస్కృతిక క్రీడలు శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో

ఏర్పాటుచేసిన మద్యం దుకాణాల ఉద్యోగులకు శిక్షణా తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నవరత్నాలు లో భాగంగా దశలవారీగా మద్యనిషేధం అమలుచేసేందుకు ముఖ్యమంత్రి

జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారన్నారు. ప్రభుత్వ ఆదాయం హఠాత్తుగా తగ్గకుండా ఉండేందుకు, ప్రజలు మద్యానికి బానిసలుగా కాకుండా చూసే క్రమంలో ప్రభుత్వ

ఉద్యోగులను నియమించారన్నారు.  à°¸à±‚పర్వైజర్లకు సేల్స్ మాన్ లకు రూ 17,500/-; రూ.15,000/- జీతం ఇస్తారన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల కాలంలో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు

కల్పించినట్లు వెల్లడించారు. శిక్షణ కార్యక్రమంలో మద్యం దుకాణాల నిర్వాహకులు నిర్వర్తించవలసిన విధివిధానాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని విధులు

నిర్వర్తించాల్సిందిగా అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.

సంయుక్త కలెక్టర్ ఎల్.శివశంకర్ పడుతూ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులు క్రమశిక్షణ, నిబద్ధత,

నిజాయితీలతో రికార్డులు నిర్వహించాలన్నారు. నగదు నిర్వహణలో లో జాగ్రత్తలు, మెళుకువలు తెలుసుకోవాలన్నారు. ఎటువంటి ఒత్తిడులకు లొంగ రాదన్నారు. రాష్ట్రంలో మద్యం

తాగే వారి సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశ్యంతో జిల్లాలో 400 షాపులను 320 కి తగ్గించారని వచ్చే ఏడాది 20 శాతం అనగా 64 షాపులను తగ్గించడం జరుగుతుంది అన్నారు. కాబట్టి ప్రస్తుత

ఉద్యోగాన్ని పార్ట్ టైం ఉద్యోగం à°—à°¾ భావించి  à°ªà°¨à°¿ చేయాలన్నారు. ఉద్యోగులకు వారం లో ఒకరోజు సెలవు ఉంటుందన్నారు. ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడినా, అలసత్వం

వహించిన వెంటనే తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. ఎంపికైన అభ్యర్థులకు మంత్రి నియామక పత్రాలను అందజేశారు. అభ్యర్థులు మంత్రి ని ఘనంగా సత్కరించారు. అనంతరం

విధి నిర్వహణ, విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ,

అసిస్టెంట్ కలెక్టర్ ప్రతిష్ట, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, గాజువాక సూపరింటెండెంట్ అన్నపూర్ణ, డిపో మేనేజర్లు ఎన్.వి.రమణ, బి శ్రీనివాస్,

ఇనస్పెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam