DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ను పర్యాటకంగా విస్తరింప చేస్తాం: మంత్రి అవంతి 

విశాఖ నుంచి 8 టూరిజం పేకేజిల విడుదల 

పర్యాటకంతో పాటు ఆధ్యాత్మిక రంగాన్నీ అభివృద్ధి చేస్తాం.

కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేసాం  à°ªà±‚ర్ణిమ దేవి

 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం జిల్లా ను టూరిజం హబ్ à°—à°¾ తీర్చిదిద్ధేందుకు విశిష్ట కృషి చేస్తున్నట్టు

రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు తెలిపారు. బుధవారం నగరం లోని అయన క్యాంపు కార్యాలయం లో జరిగిన కార్యక్రమం లో విశాఖ జిల్లా పర్యాటక శాఖా

అధికారులు రూపొందించిన 8 పర్యాటక పేకేజిలను అయన విడుదల చేసారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలను క్షున్నంగా పరిశీలించి, పర్యాటకులు ఆహ్లాదంగా సంచరించే

విధంగా కనీస అవసరాలను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పర్యాటకంతో పాటు ఆధ్యాత్మిక రంగాన్నీ అభివృద్ధి చేస్తాం. దీనిలో భాగంగా రాష్ట్రం లోని

ప్రముఖ దేవాలయాలు, ఆదరణకు నోచుకోని దేవాలయాలు, పురాతన ఆలయాలను అన్నింటినీ కలుపుతూ ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను కూడా సిద్దం చేసినట్టు తెలిపారు. 
విశాఖ

జిల్లా పర్యాటక శాఖ  à°°à±‚పొందించిన ప్యాకేజీలను బుధవారం పర్యాటక శాఖ  à°…ధికారిణి పూర్ణిమ దేవి మీడియా కు వివరించారు. పేకేజిలు, సమయ పాలనలు ఇవే : 

1 . వైజాగ్ -

అరసవిల్లి - సీతంపేట పేకేజీ : . . .
  
       à°ˆ పేకేజిలో భాగంగా ప్రతి ఆదివారం బస్సు ఉదయం 7 గంటలకు విశాఖ లో బయలు దేరుతుంది తిరిగి సాయంత్రం 6 గంటలకు విశాఖ

చేరుతుంది. 

పర్యాటక ప్రాంతాలు : అరసవిల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, సీతంపేట అడ్వాంచర్ పార్కు, 

2 . వైజాగ్ - సింహాచలం  - అన్నవరం  à°¸à±€à°¤à°‚పేట పేకేజీ : . . .
  
/>        à°ˆ పేకేజిలో భాగంగా ప్రతి శని వారం, ఆదివారం బస్సు ఉదయం 7 గంటలకు విశాఖ లో బయలు దేరుతుంది తిరిగి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుతుంది. 

పర్యాటక ప్రాంతాలు :

సింహాచలం ఆలయం,  à°…న్నవరం ఆలయం,  à°…నకాపల్లి నూకాంబిక ఆలయం.

3 . అరకు - లంబసింగి - అరకు పేకేజీ : . . .
  
       à°ˆ పేకేజిలో భాగంగా ప్రతి రోజు బస్సు ఉదయం 7 గంటలకు అరకు లో

బయలు దేరుతుంది తిరిగి సాయంత్రం 7 గంటలకు అరకు చేరుతుంది. 

పర్యాటక ప్రాంతాలు : చాపరాయి,  à°®à°¤à±à°¯à°—ుండం, కొత్తపల్లి వాటర్ ఫాల్స్,  à°²à°‚బసింగి, అరకు. 

4 . అరకు -

చిత్రకూట్ - తీర్ధ ఘర్ - అరకు పేకేజీ : . . .
  
       à°ˆ పేకేజిలో భాగంగా ప్రతి రోజు బస్సు ఉదయం 5 గంటలకు అరకు లో బయలు దేరుతుంది తిరిగి సాయంత్రం 11 గంటలకు అరకు

చేరుతుంది. 

పర్యాటక ప్రాంతాలు : చిత్రకూట వాటర్ ఫాల్స్, తీర్ధ ఘర్ వాటర్ ఫాల్స్, అరకు. 


5 . వైజాగ్ - భద్రాచలం  - 2 రోజుల పేకేజీ : . . .
  
       à°ˆ పేకేజిలో భాగంగా

ప్రతి రోజు బస్సు (మొదటి రోజు)  à°‰à°¦à°¯à°‚ 10 గంటలకు విశాఖ లో బయలు దేరుతుంది తిరిగి మూడవ రోజు ఉదయం 6 గంటలకు విశాఖ చేరుతుంది. 

పర్యాటక ప్రాంతాలు : భద్రాచలం, రాత్రి బస,

పర్ణశాల, భద్రాచలం, కొత్తగూడెం, విశాఖ.

6 . వైజాగ్ - తిరుపతి  - 2 రోజుల పేకేజీ : . . .
  
       à°ˆ పేకేజిలో భాగంగా ప్రతి బుధ వారం, శుక్ర వారం, ఆదివారం (మొదటి రోజు)  
/> మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ లో తిరుపతి à°•à°¿ బయలు దేరుతుంది తిరిగి మూడవ రోజు ఉదయం 8 :30  à°—ంటలకు విశాఖ చేరుతుంది. 

పర్యాటక ప్రాంతాలు : తిరుపతి, కాళహస్తి, తిరుమల, శ్రీ

కాళహస్తి,  à°µà°¿à°¶à°¾à°–.

7 . వైజాగ్ - అరకు రైల్ కం రోడ్ పేకేజీ : . . .
  
       à°ˆ పేకేజిలో భాగంగా ప్రతి రోజు ఉదయం 7 గంటలకు విశాఖ లో బయలు దేరుతుంది తిరిగి సాయంత్రం 9 గంటలకు

విశాఖ చేరుతుంది. 

పర్యాటక ప్రాంతాలు : రైలు లో అరకు, ట్రైబల్, బొటానికల్ గార్డెన్స్, ధింసా నృత్యం, కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు, టైడా,

విశాఖ. 


8 . వైజాగ్ - అరకు రోడ్ పేకేజీ : . . .
  
       à°ˆ పేకేజిలో భాగంగా ప్రతి రోజు ఉదయం 7 గంటలకు విశాఖ లో బయలు దేరుతుంది తిరిగి సాయంత్రం 9 గంటలకు విశాఖ

చేరుతుంది. 

పర్యాటక ప్రాంతాలు :  à°…రకు, ట్రైబల్, బొటానికల్ గార్డెన్స్, ధింసా నృత్యం, కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు, టైడా, విశాఖ.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam