DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వినికిడి లోప సమస్య పై అవగాహనా కల్పించాలి

ప్రజల్లో చైతన్యం కోసం సాగరతీరం లో ర్యాలీ  

ఐదేళ్ల లోనే శాస్త్ర చికిత్స - అద్భుత ఫలితాలు  :

అర్హులకు  à°¸à°¦à°°à°‚ పధకం : . . .

టిటిడి శ్రవణం కూడా సేవలు. .

:

పరీక్ష -  à°¶à°¿à°•à±à°·à°£ - చికిత్స - యంత్రం అమరిక :

ఒక్కొక్కరికి 6 లక్షలకు పైగానే ఖర్చు:  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 28, 2019 (డిఎన్‌ఎస్‌)

: వినికిడి లోపం అనేది తీవ్రమైన సమస్య కాదని, దీన్ని తొలి నాళ్ళలోనే గుర్తించడం ద్వారా శాశ్వత పరిష్కారం పొందవచ్చని విశాఖపట్నంలోని ప్రభుత్వ చెవి ముక్కు గొంతు

ఆసుపత్రి, సూపరింటెండెంట్ డాక్టర్ రఘునాధబాబు తెలిపారు. శనివారం ఆసుపత్రి ప్రాంగణం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం

సెప్టెంబర్ చివరి ఆదివారం (à°ˆ నెల 29 à°¨ )  à°ªà±à°°à°ªà°‚à°š వినికిడి లోప నివారణ దినోత్సవం జరుపతున్నామని, దానిలో భాగంగా ఈనెల 24 నుంచి సేవా వారోత్సవాలు చేపట్టామన్నారు. దీని లో

భాగంగా శనివారం ఉదయం విశాఖ సాగర తీరంలోని కాళీమాత ఆలయం నుంచి బాధితుల సమస్య పరిష్కార అవగాహనా ర్యాలీని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ, ప్రయివేట్

ఆసుపత్రుల వైద్యులు, ఆంధ్ర వైద్య కళాశాల  à°ªà°¿à°œà°¿, మెడిసిన్, నర్సింగ్ విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్టు తెలియచేసారు. à°ˆ ర్యాలీలో వినికిడి

సమస్యలు శబ్ధ కాలుష్యం వలన కలిగే వినికిడి లోపం మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. 

ఐదేళ్ల లోనే శాస్త్ర చికిత్స - అద్భుత ఫలితాలు

 :

వినికిడి లోపాన్ని చిన్న వయసులోనే గుర్తించాలని, సమస్య ఉన్న వారికి ఐదేళ్ల వయసు లోగా శాస్త్ర చికిత్స చేసినట్టయితే సత్ఫాలితాలు లభిస్తాయని రఘునాధబాబు

తెలిపారు. శిశువు గర్భస్థ దశ నుంచే వినికిడి లోపాన్ని గుర్తించవచ్చని, అయితే నెలన్నర లోగా వినికిడి లోప సమస్యకు తగిన చికిత్స చేయవచ్చన్నారు. విశాఖ కేంద్రంలో

ప్రతి రోజు నలభై కి పైగా చిన్నారులు పరీక్షల కోసం వస్తుంటారన్నారు. అతి చిన్న వయసులో శాస్త్ర చికిత్స జరిపితే వినికిడి పరికరాలు పిల్లలు పెట్టుకుందుకు అలవాటు

పడతారని తెలిపారు. 

టిటిడి శ్రవణం కూడా సేవలు : . . .

తిరుమల తిరుపతి దేవస్థానములు ( టిటిడి) వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహిస్తున్న

శ్రవణం ప్రాజెక్ట్ కు కూడా విశాఖ ప్రభుత్వ ఆసుపత్రినుంచి సేవలు అందిస్తున్నామన్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు తిరుపతి శ్రవణం లో కూడా పరీక్షలు జరుపుతున్నారని,

వైద్య చికిత్సలు అవసరమైన చిన్నారుల కోసం విశాఖ ప్రభుత్వ ఆసుపత్రి సంప్రదిస్తున్నట్టు తెలిపారు.  à° ఆసుపత్రిలోనైనా ఐదేళ్ల చిన్నారులకు చికిత్స జరిపి వినికిడి

యంత్రం అమర్చడం సులభం అవుతుందని, ఆపై వయసు వారికి చికిత్స జరిపినా మాట వినికిడి లో కొంత తేడా ఉంటుందన్నారు. 

పరీక్ష -  à°¶à°¿à°•à±à°·à°£ - చికిత్స - యంత్రం అమరిక

:

వినికిడి లోప సమస్యతో ఆసుపత్రికి వచ్చిన వారికి ముందుగా పరీక్షలు జరుపుతామని, సమస్య తీవ్రతకి శస్త్ర చికిత్స తప్పని సరి అని నిర్ధారించిన పిల్లలను చికిత్స

నిమిత్తం మూడు నెలల పాటు ఆసుపత్రిలోనే ఉంచుతామన్నారు. ఈ లోగా వారికి ఆడియో మెట్రీ యంత్రం ద్వారా పరీక్షలు జరిపి, వినికిడి యంత్రం పెట్టుకుని ఉండే విధంగా అలవాటు

చేయడం జరుగుతుందన్నారు. ఆపై చికిత్స జరిపి, వినికిడి యంత్రాన్ని అమర్చడం జరుగుతుందన్నారు. 

ఒక్కొక్కరికి 6 లక్షలకు పైగానే ఖర్చు: . . .  

వినికిడి లోపం

ఉన్నవారికి జరిపే శస్త్రచికిత్స వ్యయం సుమారు 6 .50 లక్షలకు పైగానే ఖర్చు అవుతుందన్నారు. దీనికి ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య శ్రీ పధకం ద్వారా తెల్ల రేషన్ కార్డు

ఉన్నవారికి పూర్తిగా ఉచితంగానే చికిత్స చేస్తున్నట్టు తెలియచేసారు. అయితే ఇది కేవలం తెల్ల రేషన్ కార్డు వారికి మాత్రమే వరిస్తోందన్నారు. ఈ హెచ్ ఎస్ ( ప్రభుత్వ

ఉద్యోగులు)లకు à°ˆ పథకం వర్తించదని, ఇతర చికిత్సలన్నీ ఉచితమేనని తెలిపారు. విశాఖ 

 à°ˆ ఏడాది జనవరి నుంచి ఇంతవరకూ 48 à°•à°¿ పైగా చిన్నారులకు ఆరోగ్య శ్రీ పధకం ద్వారా

చికిత్స చేసినట్టు తెలియచేసారు. విశాఖ కేంద్రంలో చికిత్స జరిపిన అతిచిన్న వయసు చిన్నారికి 2 ఏళ్లుగా తెలిపారు. 

ఈ వారోత్సవాల్లో భాగంగానే ఈ వారంలో

నలుగురికి పుట్టు మూగ చెవిటి పిల్లలకి సుమారు రూ. 25 లక్షలు అత్యాధునిక కాక్లియర్ ఇంప్లాంట్లను శస్త్రచికిత్స ద్వారా అమర్చడం జరిగిందని తెలిపారు. దీనివలన వారు

మిగిలిన పిల్లల లాగే మాములు జీవనం కొనసాగించే అవకాశం ఉందన్నారు. 

యంత్రాలకు పేరు నమోదు చేసుకోవాలి :

విశాఖపట్నంలోని ప్రభుత్వ చెవి ముక్కు గొంతు

ఆసుపత్రి లో పరీక్షలు, శస్త్ర చికిత్సలు జరిగిన చిన్నారులకు వినికిడి యంత్రాలను రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, దివ్యంగుల శాఖా ద్వారా సమకూర్చడం

జరుగుతుందన్నారు.  à°°à±‹à°œà±à°•à± కేవలం 30 మందికి మాత్రం చికిత్స జరుగుతుందని, వినికిడి యంత్రం కోసం విశాఖపట్నంలోని పేదవాల్తేరు లో à°—à°² సాంఘిక సంక్షేమ దివ్యంగుల శాఖా

కార్యాలయం (రాణి చంద్రమతీ దేవి ఆసుపత్రి ప్రాంగణం)  à°²à±‹ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 

పిల్లలకు శిక్షణ - పెద్దలకు అవగాహనా :

ఈ విధంగా వినికిడి

యంత్రాలను అమర్చిన చిన్నారులకు తమ ఆసుపత్రిలో టీచింగ్ ఎయిడ్స్ నిపుణులచే శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ యంత్రాలను దేశంలో కేవలం మూడే సంస్థలు తయారు

చేస్తున్నాయన్నారు. మీడాల్ సంస్థ ప్రతినిధులు విశాఖ 
ఆసుపత్రిలో పదాలు ఎలా పలకాలో ప్రతి రోజూ శిక్షణ ఇస్తోందన్నారు. ప్రస్తుతం విశాఖలో సుమారు 60 మంది చిన్నారులు

శిక్షణ పొందుతున్నారన్నారు.  à°‡à°¦à°¿à°µà°°à°•à±‡ శస్త్రచికిత్స జరిగిన  à°ªà°¿à°²à±à°²à°²à°•à± ఆడియో వెర్బల్ శిక్షణ మరియు తల్లిదండ్రులకు అవగాహన శిబిరం నిర్వహించడం జరిగింది.

 

అంతర్జాతీయ బదిరుల వారోత్సవం లో భాగంగా ఈ ఆసుపత్రిలో వినికిడి లోపంతో బాధపడుతున్న అన్ని వయసుల వారికి వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా

వినికిడి సమస్య గురించి అవగాహనా తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ప్రాధమిక దశలోనే గుర్తించ గలిగే పద్దతులుగురించి సమాచారం ఇవ్వడంతో పాటు బదిరులకు వినికిడి

శక్తిని పొందేందుకు అందుబాటులో ఉన్న పరికరాలు మరియు వివిధ శస్త్రచికిత్సలు గురించి తెలియజేయడం జరుగుతుంది. 

అర్హులకు  à°¸à°¦à°°à°‚ పధకం : . . .

వివిధ ప్రభుత్వ

పధకాలను వినియోగించుకోవాల్సిన వినికిడి లోపం కలిగినవారికి సదరం ధ్రువపత్రం అందించడం జరుగుతుందన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఈ

సర్టిఫికెట్ కోసం రోజుకు కనీసం ముగ్గురు, నలుగురు వ్యక్తులు తమ ఆసుపత్రికి వస్తుంటారన్నారు. వారిని పరీక్షించి వారికి ఉన్న వినికిడి లోపం శాతం ఎంతో

తెలియచేస్తూ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు.  
      ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రి ద్వారా బదిరుల సదరం కార్యక్రమం ద్వారా నిర్ధారణ పత్రాలు ఇవ్వడంతో పాటు

వినికిడి లోపంతో బాధపడుతున్న పిల్లలు వారి తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam