DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా రక్షణ కే అంకితం పోలీసు విభాగం : అజిత వేజెండ్ల

మహిళా పోలీసు విభాగం లో నియామక పత్రాల అందజేత  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .

విశాఖపట్నం, అక్టోబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌) : పోలీసు విభాగం అంటేనే ప్రజా రక్షణకు

అంకితమైన విభాగం అని విశాఖ జిల్లా అదనపు ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. మంగళవారం విశాఖ నగర పరిధిలోని విశాలాక్షి నగర్ లోని బివికె పాఠశాల్లో జరిగిన కార్యక్రమం

లో ఇటీవల జరిగిన గ్రామా, వార్డు సచివాలయ నియామకాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు. మహిళా పోలీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్,

వార్డు ఉమెన్ - వీకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీ ఉద్యోగ నియమితులైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పోలీసు విభాగం

నిర్వహించే సేవలను, సిబ్బంది భాద్యతలను వివరించారు. 

జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం తగదని, ప్రజలకు అత్యంత దగ్గరగా, వారితో కలిసి

పనిచేసే విభాగం ఇది తెలిపారు. 
ఈ కార్యక్రమం లో 612 మంది నియామక పత్రాలను అందుకున్నారు. వీరిలో విశాఖ నగర పరిధిలో జీవీఎంసీ, జోనల్ కమిషనర్ వద్ద, రూరల్ అభ్యర్థులు

వారి స్థానిక ఎంపిడిఓ వద్ద తదుపరి ఉత్తర్వుల కొరకు హాజరవ్వాలని సూచించారు. 

ఈ కార్యక్రమం లో డిఎస్పీ కె. ప్రవీణ్ కుమార్, డిటిసి ఆర్ పి ఎల్ ఎస్ కుమార్, డిఎస్పీ

(à°¡à°¿ ఏ ఆర్) ఎల్ రేవతమ్మ, ఇన్స్పెక్టర్( à°¡à°¿ ఎసిబి)  à°Žà°¨à± వెంకట రమణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ( డిఎఆర్) బి. వెంకటేశ్వర రావు, సూపరెంటెండెంట్ ఎస్. రాజ్ కమల్, ఇతర అధికారులు,

సిబ్బంది పాల్గొన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam