DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమోఘం. . అద్భుతం .. పైడితల్లమ్మ సిరిమానోత్సవం

జన సంద్రంగా మారిన పైడితల్లమ్మ ఉత్సవం 

అద్భుతం à°—à°¾ సాగిన విజయనగర వేడుకలు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .

విజయనగరం, అక్టోబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌) :

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్యదైవం గా కొలువబడుతున్న పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు పొందాలని అమ్మను దర్శించుకుంటారు. ఏడాది కొకమారు అమ్మవారికి జరిగే జాతర లో

అత్యంత ప్రాధాన్యత సిరిమానోత్సవం సంతరించుకుంది. శతాబ్దాల నుంచి వస్తున్నా ఈ ఆచారాన్ని నేటికీ కొనసాగించడం గమనార్హం. ఈ ఉత్సవం లో అత్యంత కీలకమైనది సిరిమాను.

సిరిమాను అంటే అమ్మవారి సంబంధం కల్గిన వృక్షం అని పేరు. ప్రతి ఏడాది ఒక ప్రత్యేక వృక్షం ను ఈ సిరిమాను ఉత్సవం లో వినియోగించడం జరుగుతుంది. ఈ వృక్షం కూడా చాలా

అరుదుగా లభిస్తుంది. ఎక్కడ లభిస్తుంది అనే విషయం అమ్మవారే స్వయంగా ఆలయ పూజారికి తెలియచేస్తుంది అనేది అక్షర సత్యం.  à°…త్యంత భక్తి పూర్వకంగా జరుపుకునే à°’à°•

ఉత్సవం లో ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూచ్చుని గుడికి ప్రదక్షిణ చెయ్యడం ఈ ఉత్సవంలోని ప్రధాన భాగం. విజయదశమి గడిచిన తర్వాత

మంగళవారం à°ˆ జాతర జరుగుతుంది.  à°¸à°¿à°°à°¿à°®à°¾à°¨à± ఉపరితలంపై బిగించే ఇరుసు, దానిపై ప్రధాన పూజారి ఆసనం, ఆయన చేతిలో విసనకర్ర ప్రత్యేక ఆకర్షణలు, సిరిమాను తిరుగుతున్నంత సేపూ

భక్తులు అరటిపళ్లు విసరడం ఆనవాయితీగా వస్తోంది. 33 మూరలు ఉండే సిరిమాను కోసం అంతటి మాను లభించడమే విశేషం. తల్లి మహిమను అదే పెద్ద తార్కాణం చూడముచ్చటగా, అత్యంత

శోభాయమానంగా సువర్ణ వర్ణంతో కళకళలాడే సిరిమాను ప్రధాన ఆకర్షణ అయితే సిరిమాను ముందు సాగే బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం చేసేందుకు జనం

ఎగబడుతుంటారు.

మంగళవారం జరిగిన ఈ ఉత్సవం లో విజయనగరం నగర వీధులన్నీ జనసంద్రంగా మారిపోయాయి. పూసపాటి రాజా వంశస్థుల ఇంటి ఆడపడుచు కావడం తో రాజా వారి కుటుంబ

సభ్యులు అదితి అమ్మవారికి నూతన వస్త్రాలను సోమవారం బహూకరించి ఉత్సవాలను ప్రారంభించారు. 

ఆలయ ప్రాశస్త్యం : . . .

    పైడిమాంబ లేదా పైడితల్లి ఉత్తరాంధ్ర

ప్రజల దైవం మరియు పూసపాటి రాజుల ఇలవేల్పు. అమ్మవారి దేవాలయం మూడు లాంతర్లు కూడలి వద్ద నిర్మించారు. అమ్మవారి ఉత్సవాలు 1758లో ప్రారంభమై 250 సంవత్సరాలుగా నిరాటంకంగా

కొనసాగుతున్నాయి. క్రీ.శ. 1757 ధాత నామ సంవత్సరం విజయదశమి వెళ్ళిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే

వ్యక్తి పైకి తీశారు. ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ కుటుంబానికి చెందినవారే వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారు. ప్రస్తుత

నాయుడు ఆరో తరంవాడు. ఈ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహించి భక్తుల్ని ఆసీర్వదిస్తారు.

అమ్మవారి  à°•à°¥ / వాస్తవ చరిత్ర :. . 

చారిత్రాత్మకంగా ఈమె పెద

విజయరామరాజు చెల్లెలు. పసిప్రాయం నుండి అధ్యాత్మిక భావాలతో దేవీ ఉపాసన చేసేది. అన్న పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధ సన్నాహాలు చేయడం ఆమెను కలతపెట్టింది.

బుస్సీ కుట్రకు లొంగిపోయిన విజయరామరాజు చెల్లెలి యుద్ధ నివారణ ప్రయత్నాల్ని లెక్కచేయలేదు. 1757లో బొబ్బిలిపై యుద్ధం ప్రకటించాడు. వెలమ వీరులు తమ పౌరుష ప్రతాపాల్ని

ఫణంగా పెట్టి విజయమో వీర స్వర్గమో అన్నట్లు పోరాడారు. కానీ విజయం విజయరామరాజునే వరించింది. ఆ రోజు రాత్రి దేవి కలలో కనిపించి అన్న ప్రాణాలకు వచ్చే ప్రమాదాన్ని

ముందే హెచ్చరించింది. ఉపవాసదీక్షలో ఉన్న ఆమె పతివాడ అప్పలనాయుడు, మరికొందరు అనుచరుల్ని వెంటబెట్టుకొని బొబ్బిలి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళగానే ఆమె

అపస్మారక స్థితిలోకి జారుకున్నది. తన ప్రతిమ పెద్దచెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని, దాన్ని ప్రతిష్ఠించి, నిత్యం పూజలు, ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో

ఐక్యమయ్యింది.

అమ్మవారి ఆవిర్భావ వైభవంలో అత్యంత కీలక పాత్ర పోషించిన జాలర్లు వలతోను, పాలధారంగా పిలిచే ఈ జనధాన అమ్మవారి సైనిక శక్తి, సిరిమాను జాతరలో తెల్ల

ఏనుగు మరో విశిష్టమైన ఆరర్షణ, గజపతులు వారి ప్రాభవాన్ని ప్రతిబింబించే విధంగా పట్టపుటేనుగు, అమ్మవారి వైభోగానికి à°ˆ అంజలి రథం  à°ˆ సిరిమాను వేడుకల్లో

పాల్గొంటాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam