DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైతుల ఖాతాలు పునరుద్దరించాలి – కలెక్టర్ నివాస్

 DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌): రైతుల ఖాతాలు పునరుద్దరించాలని శ్రీకాకుళం జిల్లా

కలెక్టర్ జె నివాస్ బ్యాంకర్లను ఆదేశించారు. వై యస్ ఆర్ రైతు భరోసా కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని, రైతులకు అందించే మొత్తంలో ఎటువంటి

ఆటంకం ఉండరాదని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులలో ఇన్ ఆక్టివ్ గా ఉన్న రైతుల ఖాతాలను ఆక్టివ్ చేయించాలని ఆయన ఆదేశించారు. శుక్ర వారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ

మందిరంలో బ్యాంకర్ల సమావేశం జరిగింది. జిల్లాలో 27, 136 ఖాతాలు ఇన్ ఆక్టివ్ గా ఉన్నాయని వాటిని తక్షణం పునరుద్ధరణ చేయాలని అన్నారు. ఎస్.బి.ఐలో అధికంగా ఇన్ ఏక్టివ్

ఖాతాలు ఉన్నాయని ప్రత్యేక దృష్టిసారించాలని పేర్కొన్నారు. పునరుద్ధరణ చేయడం ద్వారా ఆ ఖాతాల్లో భరోసా మొత్తం జమ అవుతుందని అన్నారు. ఆధార్ అనుసంధానం చేసిన

బ్యాంకు ఖాతాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆర్థిక సహాయక పథకాలకు బ్యాంకు రుణాలు మంజూరులో జాప్యం జరగరాదని స్పష్టం చేసారు. 2016-17 ఆర్థిక

సంవత్సరంలో మంజూరు చేసిన పథకాలకు కూడా రుణాలు మంజూరు పెండింగులో ఉన్నాయని, వాటితోపాటు 2017-18, 2018-19 సంవత్సరం యూనిట్లకు తక్షణం రుణాలు మంజూరు చేసి ప్రారంభానికి

చేయూతనివ్వాలని అన్నారు. సబ్సిడీ బ్యాంకులకు అందిన తరువాత పథకాలకు రుణాలు మంజూరు చేయాల్సిన బాధ్యత బ్యాంకులదే అని స్పష్టం చేసారు. బ్యాంకు పర్యవేక్షణ

అధికారులు ప్రభుత్వ ఆదేశాలను విధిగా పాటించాలని అన్నారు. యూనిట్లు ప్రారంభానికి సంబంధిత కార్పొరేషన్ ఇ.డీలు బాధ్యత వహించాలని ఆదేశించారు. యూనిట్లు మార్పు

చేసుకునే అవకాశం ఉంటే వాటిని నిబంధనలు ప్రకారం మార్పు చేసి ప్రారంభించాలని సూచించారు. ఎంఎస్ఎంఇ యూనిట్ల పునర్నిర్మాణానికి బ్యాంకులు రుణాలు మంజూరు చేసి

ప్రోత్సాహం అందించాలని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ మొత్తాలను విత్ డ్రా చేయుటకు కొన్ని బ్యాంకు శాఖలు అనుమతించడం లేదని, ఇది సరైన చర్య

కాదని స్పష్టం చేసారు. ప్రభుత్వం అందించే మొత్తాన్ని బ్యాంకులు నియంత్రణ చేయుటకు అవకాశం లేదని ఆయన అన్నారు. పింఛను మొత్తాలను బ్యాంకులు 30వ తేదీ నాటికి ఎంపిడిఓ

ఖాతాల్లోకి జమ చేయాలని ఆదేశించారు. మండలాల్లో జెఎంఎల్ బిసి సమావేశాలు నిర్వహించాలని, అందులో సంబంధిత శాఖలు, బ్యాంకు అధికారులు విధిగా హాజరు కావాలని అన్నారు.

వీధి వ్యాపారాలు చేస్తున్న చిల్లర వర్తకులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని అన్నారు.

లీడ్ బ్యాంకు మేనేజర్ జివిబిడి హరి ప్రసాద్ మాట్లాడుతూ సెప్టెంబర్

30వ తేదీ వరకు తక్కువ సమయం (short term) పంట రుణాలుగా రూ.1323.64 కోట్లు, ఇతర వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు రూ.410.06 కోట్లు మంజూరు చేసామన్నారు. 254 మంది కౌలుదారులకు రూ.64.56 లక్షలు, 573 జాయింట్

లయబిలిటీ గ్రూపు లకు రూ.59.91 లక్షలు, 227 సాగు ధ్రువీకరణ పత్రాలు కలిగిన వారికి రూ.92.94 లక్షలు మంజూరు చేసామని తెలిపారు.

ఈ సమావేశంలో ఆంధ్రా బ్యాంకు జోనల్ మేనేజర్

పి.కృష్ణయ్య, ఆర్బీఐ ఏజీఎం బి.కిరణ్ కుమార్, నాబార్డు ఏజీఎం మిలిన్డ్ సోవల్కర్, ఎస్.బి.ఐ రీజినల్ మేనేజర్ ఏ. తేజోమయి అరవింద్ , వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు బి.జి.డి

ప్రసాద్,డిఆర్డీఏ పిడి ఏ.కళ్యాణ చక్రవర్తి, బిసి కార్పొరేషన్ ఇ.డి జి.రాజారావు,మత్స్య శాఖ జెడి డా.వివి కృష్ణ మూర్తి, ఎస్.సి కార్పొరేషన్ ఇడి సి.హెచ్.మహాలక్ష్మి,

విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడి జీవన్, పశుసంవర్ధక శాఖ జెడి డా.ఏ.ఈశ్వర రావు, ఆంధ్రా బ్యాంకు శిక్షణా సంస్ధ డైరక్టర్ ఎస్.శ్రీనివాస రావు, లీగల్ లిటరసి శిక్షకులు గిరిజా

శంకర్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam