DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం జిల్లాలో ఇసుక కొరత లేదు – కలెక్టర్ నివాస్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌):   శ్రీకాకుళం జిల్లాలో ఇసుక కొరత లేదని జిల్లా కలెక్టర్ జె

నివాస్ స్పష్టం చేసారు. జిల్లాలోని అన్ని రీచ్ లను అందుబాటులోకి తీసుకువచ్చి జిల్లా అవసరాలతోపాటు, విశాఖపట్నం జిల్లా అవసరాలను తీర్చుటకు సిద్ధంగా ఉన్నామని

చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 22 రీచ్ లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. వీటి ద్వారా జిల్లాలో 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యత ఉంటుందన్నారు. ఇసుక

పరిస్ధితిపై మంగళ వారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ నివాస్ జిల్లాలో ఇసుక రీచ్ ల పరిస్ధితులను

వివరించారు. జిల్లాలో ఇసుక కొరత లేదని, ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలు కారణంగా ప్రధాన నదులైన వంశధార,

నాగావళిలో వరద ప్రవాహం కారణంగా ఇసుక తవ్వకాలలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడిందన్నారు. కొద్ది రోజుల్లో యథాతధ స్ధితికి వస్తుందని వివరించారు. జిల్లాలో పర్యావరణ

అనుమతులు కలిగిన 18 రీచ్ లు - మడపాం, యరగాం, పెద్దసవరళాపురం, పురుషోత్తపురం, పర్లాం, అంధవరం, కిల్లిపాలెం, కళ్లేపల్లి, ముద్దాడపేట, సింగూరు, చవ్వాకులపేట, గోపాలపెంట,

పురుషోత్తపురం-2, తునివాడ, పోతయ్యవలస, చేనువలస, అన్నవరం, అంగూరు రీచ్ లను ఏపిఎండిసికి అప్పగించామన్నారు. ఈ రీచ్ లలో 7,77,415 క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యంగా ఉందన్నారు.

కిల్లిపాలెం, గోపాలపెంట, మడపాం, చవ్వాకులపేట, పెద్దసవళాపురం, యరగాం, పర్లాం రీచ్ లలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మిగిలన వాటిలో వరద నీరు ఉందని,

రెండు లేదా మూడు రోజుల్లో ఇసుక తీసే అవకాశం ఉందని కలెక్టర్ చెప్పారు. జిల్లా అవసరాలకు పర్లాం రీచ్ ప్రత్యేకంగా కేటాయించామని, విశాఖపట్నం జిల్లా అధిక పరిమాణం

(బల్క్) అవసరాలకు యరగాం, సవళాపురం, చవాకులపేటను కేటాయించగా, విశాఖపట్నం రిటైల్ అవసరాలకు మడపాం, గోపాలపెంట రీచ్ లను కేటాయించామని చెప్పారు. స్దానిక అవసరాలు ఉంటే

ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్డర్ రీచ్ ల నుండి స్ధానిక గ్రామ సచివాలయం నుండి అనుమతి తీసుకుని ఇసుకను పొందవచ్చని చెప్పారు. ఇందుకు టన్నుకు రూ.375లను వైస్ ఛైర్మన్ అండ్

మేనేజింగ్ డైరక్టర్, ఏపిఎంఐడిసి పేరున డిమాండ్ డ్రాఫ్ట్ చెల్లించాలని చెప్పారు. వాహనం తీసుకువెళితే లోడింగు చేయడం జరుగుతుందని స్పష్టం చేసారు. స్ధానిక

అసరాలకుగాను సోంపేట, మందస మండలాల్లో ఒక్కో రీచ్ ను ఇప్పటికే ఏర్పాటు చేసామని చెప్పారు. ఆయా రీచ్ లకు 20 కిలోమీటర్ల పరిధిలోగల ప్రజలు ఎవరైనా ఇసుక పొందవచ్చని

పేర్కొన్నారు. ఇచ్ఛాపురం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో సైతం ఇసుక రీచ్ లను పరిశీలిస్తున్నామని చెప్పారు. జిల్లాలో రోజుకు 2 వేల క్యూబిక్ మీటర్ల వరకు మాత్రమే

ఇసుక అవసరం ఉంటుందని కలెక్టర్ చెప్పారు. టెక్కలిలో à°’à°• స్టాక్ యార్డ్ పెట్టుటకు చర్యలు చేపడుతున్నామన్నారు.  à°µà°°à°¦ నీరు తగ్గి ఇసుక లభ్యత పెరిగిన అనంతరం ఇసుక

వారోత్సవాలను చేపట్టి కొత్త రీచ్ లను ప్రారంభించడం, ప్రజలకు మరింతగా ఇసుకను అందుబాటులోకి తీసుకురావడం చేస్తామని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు తమ నిర్మాణ

అవసరాలకు గ్రామ సచివాలయాల వద్ద నుండి అనుమతి పొంది ఇసుకను ప్రాధాన్యతతో పొందవచ్చని పేర్కొన్నారు.

నవంబరు 15 వరకు రైతు భరోసా గడువు : రైతు భరోసా గడువును నవంబరు 15వ

తేదీ వరకు పొడిగించడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 3.50 లక్షల మంది రైతు భరోసా క్రింద లబ్దిపొందారని చెప్పారు. ఆధార్ సీడింగ్ లేకపోవడం వలన,

ఆధార్ – బ్యాంకు ఖాతా అనుసంధానం కాకపోవడం, ప్రజాసాధికార సర్వేలో వివరాలు లేకపోవడం వంటి అంశాల వలన భరోసా నగదు ఖాతాల్లో జమ కావడంలో కొన్ని సమస్యలు వచ్చాయన్నారు.

వీటిని పరిష్కరించుటకు బుధ వారం నుండి వారం రోజులపాటు గ్రామ సభలు నిర్వహించి రైతుల సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. బ్యాంకు సంబంధిత

సమస్యలు, రెవిన్యూ, వ్యవసాయ శాఖలకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా వీటిలో పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. రైతులు తమ వివరాలు వెబ్ ల్యాండ్ లో

లేనప్పటికి అన్ సీడెడ్ క్రింద దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

నవంబరులో పలు కార్యక్రమాలు : నవంబరు నెలలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు

కలెక్టర్ నివాస్ చెప్పారు. నవంబరు 1వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరపడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం కార్యక్రమంలో

స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు, పాఠశాల విద్యార్ధులకు వ్యాసరచన, క్విజ్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. నవంబరు 7వ తేదీన

అగ్రీగోల్డ్ లో రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నవంబరు 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో

వేడుకల నిర్వహణతోపాటు నాడు – నేడు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. à°ˆ కార్యక్రమం క్రింద రాష్ట్రంలో 15 వేల పాఠశాలల్లో మౌళికసదుపాయాల కల్పన జరుగుతుందని,

అందులో జిల్లాకు చెందిన వెయ్యి పాఠశాలలు ఉండవచ్చని పేర్కొన్నారు. మార్చి నాటికి మౌళికసదుపాయాల కల్పన పూర్తి అవుతుందని ఆయన అన్నారు. నవంబరు 21వ తేదీన ప్రపంచ

మత్స్యకార దినోత్సవం జరుపుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులకు డీజిల్ పై రాయితీ, వేట నిషేధ సమయంలో ఇచ్చే నష్టపరిహాం రూ.10 వేలకు పెంపు చేస్తూ పంపిణీ

చేయడం జరుగుతుందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam