DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనసేన చలో విశాఖ లో పాల్గొనున్న బీజేపీ కన్నా 

à°…à°–à°¿à°² పక్షంలోనే లాంగ్ మార్చ్? జన సేనాని 

మొదట బోణీయే బీజేపీ కు - జనసేనాని ఫోన్ లో పిలుపు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,

 à°…క్టోబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) : జనసేన ఆధ్వర్యవంలో నవంబర్ 3 à°¨  à°µà°¿à°¶à°¾à°– వేదిక à°—à°¾ జరుగనున్న చలో విశాఖ - లాంగ్ మార్చ్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా

లక్ష్మీనారాయణ హాజరు కానున్నట్టు జనసేన à°’à°• ప్రకటన లో తెలిపింది. 

ఆంధ్ర ప్రదేశ్ లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక పోలిసి ని రద్దు చేసి, ఇసుకను

బహిరంగ మార్కెట్ లోకి అనుమతించక పోవడంతో రోడ్డున పడ్డ లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు మద్దతు à°—à°¾ à°ˆ కార్యక్రమం జరుగుతోంది. 

ఇసుక దొరకక ఉపాధి

కోల్పోయి  à°…ల్లాడిపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ à°ˆ లాంగ్ మార్చ్ కు పిలుపు ఇచ్చినట్టు జనసేన

తెలియచేస్తోంది. దీనిలో భాగంగానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కు ఈ కార్యక్రమాన్ని వివరించి

కార్మికులకు మద్దతు ప్రకటించాల్సిందిగా ఆహ్వానించగా,  à°†à°¯à°¨ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిపింది. 

ఆగస్టు 4వ తేదీన భీమవరం సమావేశంలో పాల్గొనడానికి

రాజమండ్రి నుంచి భీమవరం వెళుతున్న సందర్భంలో సిద్ధాంతం వద్ద భవన నిర్మాణ కార్మికులు పవన్ కళ్యాణ్ వాహనాన్ని ఆపి తమ కష్టాలను తెలిపారు. *వై.ఎస్.ఆర్. కాంగ్రెస్

పార్టీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇసుక దొరకక తమ ఉపాధి పోయిందని వివరించారు. *మంగళగిరి కి వెళ్ళినప్పుడల్లా భవన నిర్మాణ కార్మికులు వచ్చి కలుస్తూనే ఉండేవారు.

కొత్త ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తెస్తున్నామని చెప్పడంతో సమస్య పరిష్కారం అవుతుందన్న కొంత ఆశ  à°ªà°µà°¨à± కళ్యాణ్ లో ఉండేదని తెలియచేసింది. అయితే రాను రాను సమస్య

మరింత తీవ్రతరమై ఇసుక అందరాని సరుకుగా మారిపోయి చివరకు ఉపాధిలేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నందున ఈ సమస్య పరిష్కారం కోసం విశాఖలో లాంగ్ మార్చ్ కు

పిలుపు ఇచ్చినట్టు జనసేన అధికారికంగా ప్రకటించింది.  

అధికారిక లెక్కల ప్రకారం ప్రత్యక్షంగా 17.80  à°²à°•à±à°·à°² మంది, పరోక్షంగా మరో 17 లక్షల మంది ఉపాధి కోల్పోవడంతో à°ˆ

సమస్యను కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి మోడీ దృష్టికి కూడా  à°¶à±à°°à±€ పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు.

ఇసుక సమస్య పరిష్కారం కావాలంటే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని

రాజకీయ పక్షాలు కలసి కట్టుగా పోరాడాలని మంగళవారం పవన్ కళ్యాణ్ గారిని కలసిన కొందరు భవన నిర్మాణ కార్మికులు విజ్ఞప్తి చేశారు. దీనికి మీరు చొరవ చూపాలని కోరారు.

తెలంగాణాలో జరుగుతున్న ఆర్.టి.సి.సమ్మెలో అక్కడి రాజకీయ పార్టీలు చూపుతున్న సంఘీభావాన్ని, ఐక్యతను ఇసుక సమస్య పరిష్కారంలో కూడా చూపాలని వారు

విన్నవించారు.

వారి విన్నపానికి సంసిద్ధత తెలిపిన పవన్ కళ్యాణ్ ముందుగా కన్నాలక్ష్మి నారాయణ మద్దతు కోరడం జరిగిందని ప్రకటనలో తెలిపింది. ఇతర పార్టీల

ప్రతినిధులను కూడా సంప్రదించి వారి మద్దతు కూడా కోరనున్నట్టు సమాచారము. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam