DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పునరాలోచనలో నీలం సహాని !! సందిగ్ధం లో అధికారగణం  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను

బదిలీ చేయటంతో ఆయన స్థానంలో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల ఉన్న 1984 బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్నేను నియమిస్తారని ప్రచారం విస్తృతంగా జరిగింది. à°† ప్రచారం నిజం చేసే

దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లిఖిత పూర్వకంగా లేఖ రాయటం జరిగింది. కేవలం ఎనిమిది నెలలు సర్వీసు మాత్రమే ఉన్న నీలం సహాని చిన్న రాష్ట్రమైన

ఆంధ్రప్రదేశ్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వెళ్లటం ఏమిటి..? అనే ప్రశ్నకు తగిన జవాబు లో స్పష్టత రావడం లేదు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్ర

ప్రదేశ్ లో కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంది. విభజన తదుపరి ఆర్ధిక ఇబ్బందులు నేటికీ తొలగిపోలేదు, అధికార, ప్రతిపక్ష పార్టీ ల మధ్య వాదప్రతివాదాలు, అధికారుల నుంచి

ఏ మేరకు సహకారం లభిస్తుందో తెలియని పరిస్థితుల మధ్య రాష్ట్ర అత్యున్నత ఉద్యోగ భాద్యతలు చేపట్టడం అంటే కొంత సాహసమనే చెప్పాలి. సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని కొందరు

ఐఏఎస్ అధికారులలోనూ ఉన్నట్టు తెలుస్తోంది. నవ యువకుడైన ముఖ్యమంత్రి, పార్టీ క్యాడర్ తో ఉన్న హామీలను నెరవేర్చడంలో సి ఎస్ సలహాలు పాటించే అవకాశం అతి తక్కువగా

ఉండడం కొంత సాహసోపేతమైన నిర్ణయంగా తెలుస్తోంది.  à°ˆ తలనొప్పి నాకెందుకు నేను కేంద్ర సర్వీసులోనే పని చేస్తాను అని నీలం సహాని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల

సమాచారం. కానీ అలాంటిదేమి లేదు.. ఆమెతో చర్చించాం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టేందుకు నీలం సహాని అంగీకరించారు, ఏపి ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ

రాసింది. ఇందులో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండకపోచ్చు అని జిఎడి అధికారులు అంటున్నారు. ఎల్వీ.సుబ్రహ్మణ్యం లాంటి సమర్ధుడు, అపార అనుభవం ఉన్న ఐఎఎస్‌ అధికారిగా

పేరున్న ఆయననే అకారణంగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు నుండి తొలగించారని, మీరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వెళితే ఆంధ్రప్రదేశ్‌లో పని చేయగలుగుతారా..

పునరాలోచించుకోండి అని నీలం సహానికి కొంతమంది ఐఎఎస్‌ అధికారులు సలహా ఇచ్చినట్లు తెలిసింది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam