DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్నవరం లోనే అన్యమత ప్రచారం అనాచారం.: bjp

హిందూ గుళ్ల వద్ద అన్యమత ప్రచారం చేస్తే చర్యలు తప్పవు : . . . 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, నవంబర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌) : కోట్లాది మంది హిందువు భక్తుల

ఆరాధ్యదైవమైన అన్నవరం క్షేత్రంలోనే అన్యమత ప్రచారం చెయ్యడం నాచారం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం విశాఖ లో

నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఏ మతాన్నైనా అనుసరించవచ్చని, అయితే ఇతరులను మభ్య పెట్టి మతమార్పిడి చేస్తే మాత్రం

కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల కాలం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్యమత ప్రచారం అధికమైపోయిందని, దీనికి నిదర్శనమే సోమవారం సాయంత్రం తూర్పు గోదావరి

జిల్లా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలోని భజన వేదిక పైనే క్రైస్తవ ప్రార్ధనలు పాడడం క్షమించరాని నేరం గా అభివర్ణించారు. తక్షణం ఆలయ అధికారులు

భక్తులకు క్షమాణప  à°šà±†à°ªà±à°ªà°¾à°²à°¨à°¿ డిమాండ్ చేసారు. హిందూ ఆలయాలు కేవలం హిందువు భక్తులు ఆలయ హుండీల్లో వేసే ముడుపులు, కనుకలపైనే ఆధారపడి నడుస్తున్నాయని, అలాంటిది à°†

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఎవరు ప్రార్తించినా చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. అన్నవరం లో జరిగిన ఘటన పై పూర్తి విచారణ జరిపి, దోషులపై చర్యలు

తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హిందూ ఆలయ పరిరక్షణ కార్యకర్తలు అప్రమత్తంగా ఉన్నారని, హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారం జరిగినట్టు తెలిసినా దోషులపై

చర్యలు తప్పవన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam