DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇక నుంచి గిరిజన తండాల్లో సత్యసాయి సేవ సమితి సేవలు

సత్యసాయి జన్మదినంలో గిరిజన భక్తుల నీరాజనం 

పుట్టపర్తిలో నిష్కళంక గిరిజనుల నృత్య నీరాజనం 

ప్రతి గిరిజన జిల్లాను సత్యసాయి జిల్లాగా  à°¤à°¯à°¾à°°à±

చేస్తాం  

ఐదేళ్ల లో ప్రతి తండాల్లోనూ సత్యసాయి సేవలు అందుబాటులోకి 

గిరిజనులంతా సాయి జనులే : నిమీష్ పాండ్యా

సత్య సాయి సేవా సంస్థల జాతీయ

అధ్యక్షులు వెల్లడి   

(DNS రిపోర్ట్ : మనోహర్ , స్టాఫ్ రిపోర్టర్, అనంతపూర్): . . .

అనంతపూర్, నవంబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌) : సామాన్య జన జీవనానికి దూరంగా మారు మూల

ప్రాంతాల్లో నిష్కల్మషమైన మనస్సులతో, ఉండే గిరి పుత్రుల అభ్యున్నతికి అద్భుత అభివృద్ధి కార్యక్రమాలకు సత్యసాయి సేవ సంస్థలు శ్రీకారం చుట్టాయి. అనంతపురం

జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం లో జరుగుతున్న సత్యసాయి బాబా 94 వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం సాయి కుల్వంత్ హాల్ లో నిష్కళంక గిరిపుత్రులు తమ

సంప్రదాయ నృత్యాలతో సత్యసాయి à°•à°¿ నృత్య నీరాజనం అందించారు. à°ˆ సందర్బంగా  à°¸à°¤à±à°¯ సాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షులు నిమీష్ పాండ్యా మాట్లాడుతూ à°ˆ ప్రపంచంలో నిరంతరం

పర్యావరణ హితం కోరుకునే వారు కేవలం గిరిజనులేనన్నారు. కారణం గిరిజనుల జీవనమే అడవులు, వృక్షాలు, చెట్లతో మమేకమై ఉందన్నారు. అలాంటి అడవులను అభివృద్ధి పేరిట ఇటీవల

మృగ్యం చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇలాంటి అమాయక భక్తులకు అవసరమైన, అత్యంత ఆవశ్యకమైన సేవలు అందించాలని సత్యసాయి బాబా ఏనాడో పలు బృహత్తర పధకానికి శ్రీకారం

చుట్టారని, అయితే ఈనాడు వాటికి కార్యరూపం లభించిందన్నారు. వీరు నివాసం ఉండే తండాలు, లంకెలు, గూడాల్లో à°®à±Œà°²à°¿à°• వసతులు, పారిశుధ్యం, తల్లి బిడ్డ ఆరోగ్యం, విద్య,

వ్యవసాయం, సాముహిక వివాహాలు, సాంఘిక, సాంస్కృతిక అభివృద్ధి, నైపుణ్యం మరియు, వ్యక్తిగత అభివృద్ధి  à°•à±‹à°¸à°‚ à°ˆ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించామని తెలియచేసారు. à°ˆ

కార్యక్రమానికి సాయి ఏనాడో నాంది పలికారని గుర్తు చేసారు. 

రాబోయే అయిదేళ్ల  à°•à°¾à°²à°‚లో ప్రతి గిరిజన జిల్లా à°’à°• సత్య సాయి జిల్లాగా, ప్రతి గిరిజన గ్రామం à°’à°• సత్య

సాయి సమితి గా రూపాంతరం చెందగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు.

గిరిజన తెగలు తమ తమ ప్రాంతాల కు సంభందించిన సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక నృత్య

ప్రదర్శనలతో సాయి à°•à°¿ నృత్య నీరాజనం అందించారు. 

నీలగిరి నుండి తోడాస్, పోతాస్, బడగాస్ తెగలు, విశాఖపట్నం నుంచి ధింసానృత్యం, తెలంగాణా రాష్ట్రం నుండి

అచ్చంపేట, ఛత్తీస్గఢ్ నుండి గోండు నృత్యం భక్తులను రంజింప చేశాయి. గిరిజనుల అచంచలమైన నిస్వార్ధ, స్వచ్ఛమైన భక్తి అపూర్వమని నీమీష్ పాండ్యా తెలిపారు.

అంతకు

ముందు 12  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°¾à°² నుంచి వచ్చిన గిరిజన వాసులు కుల్వంత్ హాల్ లో ర్యాలీ నిర్వహించారు. à°ˆ కార్యక్రమం పంచ వర్ష ప్రణాళిక. గిరిజనుల సర్వతోముఖాభివృధికి భగవంతుని

ఆశీస్సులను కోరుతూ ఈ ఐదేళ్ల పంచవర్ష కార్యాచరణకు సంబంధించిన ప్రచార పత్రాలను సత్యసాయి సేవ సంస్థల కేంద్ర ట్రస్ట్, సభ్యులు సాయి ప్రార్ధన స్థలి సమక్షంలో

ఆవిష్కరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam