DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు: సీఎం వైఎస్ జగన్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, డిసెంబ‌రు 31, 2019 (డిఎన్‌ఎస్‌):  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ అందించే వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించేందుకు

అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. సంక్రాంతి పండుగ లోగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి  à°œà°¾à°¬à°¿à°¤à°¾à°²à°¨à± గ్రామ సచివాలయ లో

ప్రదర్శించాలన్నారు. మంగళవారం నవశకం కార్యక్రమాలపై ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2020 సంవత్సరం

నుండి ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వ సంస్థగా మారుతున్నందున ప్రతి డిపోలో సమావేశాలు నిర్వహించాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు వాటిలో పాల్గొనాలని ఆదేశించారు. జనవరి 3వ

తేదీ నుండి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ మొదలవుతుందన్నారు. వేయి రూపాయలు దాటిన 2059 వ్యాధులకు  à°‰à°šà°¿à°¤à°‚à°—à°¾ చికిత్స చేస్తారన్నారు. రెండవ తేదీ నుండి రైతు భరోసా లో

లబ్ధిదారులను గుర్తించడం, అమ్మ వడి లబ్ధిదారుల తుది జాబితా ఖరారు చేస్తారన్నారు. నాలుగవ తేదీ నుండి తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీలతో కలిసి 8 తేదీ వరకు అమ్మ ఒడి,

మధ్యాహ్న భోజన పథకం ఆధునీకరణ, ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు కార్యక్రమాలపట్ల అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఫిబ్రవరి 12న గత నాలుగు సంవత్సరాలలో ఆత్మహత్యలు

చేసుకున్న 556 మంది రైతుల యొక్క కుటుంబాలకు రూ. ఐదు లక్షలు చొప్పున చెల్లిస్తామన్నారు . ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి

ఇప్పటి నుంచి అన్నీ సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉగాది నాటికి ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.

జనవరి మాసాన్ని "దిశ" మాసంగా

పరిగణిస్తూ బాలలు, స్త్రీలపై అత్యాచారాలను నిరోధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయడం, ప్రత్యేక

అధికారులు, సిబ్బందిని నియమించడం చేయాలన్నారు. ఈ విషయం అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో విశాఖపట్నం నుండి కలెక్టర్ వినయ్

చంద్, జాయింట్ కలెక్టర్లు ఎన్ వేణుగోపాల్ రెడ్డి, ఎల్ శివ శంకర్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రతిష్ట, డిఆర్వో  à°¶à±à°°à±€à°¦à±‡à°µà°¿, పిడి డిఆర్డిఎ విశ్వేశ్వరరావు ముఖ్య

ప్రణాళికాధికారి, డీఈఓ లింగేశ్వర రెడ్డి, డియంఅండ్ హెచ్ఓ తిరుపతి రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam