DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో పర్యావరణ కాలుష్యం అంటే పట్టింపు లేదా?

రాజధాని అంటే వాహనాలు మాత్రమే, పరిశ్రమలు ఉండవు  

శాఖ కాలుష్యాన్ని నివారణకు మెట్రో రైల్ à°‡à°¸à±à°¤à°¾à°‚:  

వైకాపా అధికార ప్రతినిధి గుడివాడ అమర్

వెల్లడి. 

కాలుష్య రహితంగా రాజధానికి స్వాగతం పలుకుదాం: విశాఖ  

రాజధాని వచ్చేలోగా నగరాన్ని స్వచ్చంగా మార్చండి : విశాఖ వాసులు 

(DNS రిపోర్ట్ :

సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . .  

విశాఖపట్నం, జనవరి  24, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°µà°¿à°¶à°¾à°– లోని ప్రభుత్వ à°°à°‚à°—, ప్రయివేట్ à°°à°‚à°— సంస్థలు విడుదల చేస్తున్న పర్యావరణ కాలుష్య

ప్రభావం అధికార పార్టీ నేతలకు కనపడుతున్నట్టు లేదా అంటే అవుననే సమాధానమే వస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ

అమర్ నాద్ నుంచి. శుక్రవారం విశాఖలోని ఓ హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ అంశం పై వివరణ ఇచ్చారు. ఇప్పడి కె ప్రభుత్వ రంగ, ప్రయివేట్ రంగ పరిశ్రమలు

విడుదల చేస్తున్న వ్యర్ధాల వలన వాయు కాలుష్యం, నీటి కాలుష్యం బాగా పెరిగి పోయి విశాఖ నగరం కాలుష్య ప్రభావాన్ని సుదీర్ఘ కాలంగా వ్యాధిగ్రస్తుగా తయారయ్యింది,

ఇలాంటి కాలుష్యం తోనే రాజధాని కి స్వాగతం పలుకుదామా అని అడిగిన ప్రశ్నకు ఆయన విస్తుపోయే సమాధానం ఇచ్చారు. రాజధాని అంటే కేవలం వాహనాలు మాత్రమే ఉంటాయని, పరిశ్రమలు

రావన్నారు. కేవలం అధికార యంత్రాంగం, మందీ మార్బలం మాత్రం వస్తారన్నారు. గతం లో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇదే పార్టీ నేతలు విశాఖ ను కాలుష్యం కోరల నుంచి కాపాడండి

అంటూ నిరసనలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు అధికారం లోకి వచ్చేసరికి విశాఖ కు కాలుష్యం ప్రభావం పెద్దగా లేదు అనే వ్యాఖ్యలు

వినిపిస్తున్నాయి. 

ఇప్పడికే కొన్ని ప్రాంతాలు డేంజర్ జోన్ కు దగ్గరలో ఉన్నాయి. ఇక దీనిపై తీసుకోవాల్సిన చర్యలు కూడా విస్మరిస్తే ఈ కాలుష్యం మిగిలిన

నగరానికి కూడా విస్తరించే అవకాశం ఉంది. 

రానున్న రాజధానిలో మరింత కాలుష్యం పెరిగే అవకాశం లేదా  à°¦à±€à°¨à°¿à°ªà±ˆ ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే ప్రశ్నకు రాజధాని

అంటే పరిశ్రమలు రావని, కేవలం అధికార యంత్రాంగం, సిబ్బంది మాత్రమే వస్తారంటూ తద్వారా పెద్దగా కాలుష్యం ఉండదన్నారు. ఇప్పడికే విశాఖ నగరం చుట్టూ భారీ పరిశ్రమలు,

ఫార్మా సిటీ, విశాఖపట్నం పోర్ట్, హోటళ్లు తదితర సంస్థలు  à°µà°¿à°¡à±à°¦à°² చేసే వ్యర్ధాలు నేరుగా జనావాసాల్లోకే వచ్చేస్తూ, నగరాన్ని కాలుష్యాన్ని విస్తరింప చేస్తున్నాయి.

దీనిపై సమాధానం చెప్పేందుకు మాత్రం అమర్నాద్ మాట దాటేసారు.                

రాజధాని వచ్చేలోగా నగరాన్ని స్వచ్చంగా మార్చండి : విశాఖ వాసులు 

విశాఖ కు

పూర్తిస్థాయి రాజధాని వచ్చే లోగానే నగరం ఎదుర్కొంటున్న కాలుష్యాన్ని నివారించి, స్వచ్ఛమైన వాతావరణంలో రాజధానికి ఘన స్వాగతం పలుకుదామని విశాఖ వాసులు

తెలియచేస్తున్నారు.  à°šà°Ÿà±à°Ÿà°ªà°°à°®à±ˆà°¨ అడ్డంకులు తొలిగి పూర్తి స్థాయి రాజధాని రావడానికి మరో రెండు మూడు నెలల సమయం పట్టవచ్చని అధికార పార్టీ తెలియచేస్తున్న సందర్బంలో

విశాఖ కాలుష్యాన్ని నివారించేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. 

ఆలస్యమైనా రాజధాని విశాఖలోనే : అమర్. . . 

అరి మీద

గిరి పడ్డా గిరి మీద అరి పడ్డా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విశాఖ లోనే ఏర్పడుతుందని గుడివాడ అమర్ తెలియచేసారు. అయితే చట్ట పరమైన సమస్యలు తొలగిపోడానికి మరో రెండు మూడు

నెలల కాలం పట్టవచ్చన్నారు.   

కాలుష్య నివారణకు మెట్రో రైలు : . .  

విశాఖలో పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య నివారణ కోసమే రానున్న కాలంలో మెట్రో రైలు

వ్యవస్థను తీసుకువస్తున్నట్టు అమర్ తెలిపారు. కాలుష్యానికి ప్రధాన కారణం వాహనాలేనని, మెట్రో రైలు అమలు లోకి వస్తే కాలుష్యం తొలగిపోతుందన్నారు. అయితే ఈ

వాస్తవంగా చెప్పాలంటే మెట్రో రైళ్లు ప్రాజెక్ట్ ఇంకా కాగితాల దశలో కూడా లేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తి దశ పూర్తి అయ్యి, రైళ్లు అందుబాటులోకి రావాలంటే కనీసం మరో

నాలుగు, ఐదేళ్ల కాలం పట్టె అవకాశం ఉంది. ఈలోగా రాజధాని పూర్తి స్థాయి లో కార్యాచరణ అందుబాటులోకి వచ్చేస్తుంది.    

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam