DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాపిటల్ అంటున్నారు. . .కాలుష్యానికి బలి కావాల్సిందేనా?

విశాఖ నగరం మరో ఢిల్లీ గా మరకముందే మేలుకోవాలి. . . .

విశాఖ పర్యావరణ రక్షణ పై విఎంఆర్ డిఏ భాద్యత తీసుకోదా?

గ్రామాల నుంచి టాక్స్ లు తీసుకుంటున్నారు,

అభివృద్ధి చెయ్యరా? 

పట్నం వీడండి . . పల్లె లను అభివృద్ధి చేద్దాం పదండి. . : 

కార్తీకవనం పై రివర్స్ టెండరింగ్ చేపట్టండి, తప్పులేదు  

విఎంఆర్డీఏ

విధులపై మండలి కమిటీ పరిశీలన- సూచనలు   

జులై 2020 నాటికి ఎన్ఏడి ఫ్లై ఓవర్ పూర్తి : విఎంఆర్డిఏ కమిషనర్ 

కాలుష్యం పై నాడు DNS  à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నే కమిటీ కూడా

అడిగింది.  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 11, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం అత్యంత సుందరమైన నగరమని, ఇప్పడికే విశాఖపట్నం

పోర్ట్, స్టీల్ ప్లాంట్, ఫార్మా సంస్థల వంటివాటి వలన నగరం కాలుష్యంగా మారిపోతుందని అలంటి నగరాన్నిక్యాపిటల్ గా చేస్తే మరో ఢీల్లిగా మారిపోతుందని శాసన మండలి

పట్టణాభివృద్ధి కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేసారు. మంగళవారం విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ చేపడుతున్న కార్యాచరణ పై

తనిఖీ అనంతరం ఖర్చులపై సమావేశం నిర్వహించింది. ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ నగరాన్ని రాజధానిగా మారుస్తున్నాం అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర

ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేస్తోందని, అయితే సాధ్యా సాధ్యాలను పట్టించుకోవడం లేదన్నారు. ఈ సుందర నగరం కాలుష్య కోరలకు బలి కావాల్సిందేనన్నారు. ఇలాంటి

నగరాన్ని మళ్ళీ ప్రశాంతంగా మార్చెందుకు వి à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ సంస్థ ఎటువంటి భాద్యత తీసుకోదా? అని ప్రశ్నించగా, అది తమ పరిధిలోనిది కాదని, పైగా   భాద్యత కాదని కమిషనర్

కోటేశ్వర రావు సమాధానమిచ్చారు. 

కాలుష్యంపై నాడు DNS à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నేకమిటీ కూడా అడిగింది :. . .  

విశాఖ ను రాజధానిగా చేస్తాం అని ముఖ్యమంత్రి ప్రకటించిన

వెంటనే అధికార పార్టీ ప్రతినిధులను పత్రికా ముఖంగా విశాఖ కాలుష్యం పై పరిష్కారానికి మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అని DNS ప్రశ్నించింది. సరిగ్గా ఇదే

ప్రశ్న నేడు శాసన మండలి కమిటీ కాలుష్యం పై చర్యలు ఏమి తీసుకుంటున్నరని వి ఎమ్మార్ à°¡à°¿ ఏ కమిషనర్ ను అడిగింది.  

గ్రామాల నుంచి టాక్స్ లు తీసుకుంటున్నారు,

అభివృద్ధి చెయ్యరా? 

సంస్థ కు ఏ విధంగా ఆదాయం వస్తోంది అని ప్రశ్నించగా, గ్రామాలు, కోలనీల్లో లే అవుట్ నిర్మాణాలు, తమ పరిధిలోని భవన నిర్మాణ విభాగంలో అనుమతుల

ద్వారా ఫీజులు వసూలు చేయడం ద్వారా వస్తుందని, కమిషనర్ తెలిపారు. దీంతో గ్రామాల నుంచి మీరు ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు, ఆ గ్రామాలను ఎందుకు

అభివృద్ధి చేయడం లేదు అని ప్రశ్నించారు. మీరు కేవలం విశాఖ నగరం వరకే పరిమితమయ్యారని, ఫీజులు మాత్రం దండిగా గ్రామాల నుంచి వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు.

గ్రామాల అభివృద్ధి మీ పరిధిలోది కాదా అని ప్రశ్నించారు. కచ్చితంగా పట్టణం నుంచి పల్లెకు వెళ్లవలసిందేనని సూచించారు. తమకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, కేవలం

ప్రజల తరపున జవాబుదారీగా à°ˆ కమిటీ పర్యటిస్తోందన్నారు. 

జులై 2020 నాటికి ఎన్ ఏ à°¡à°¿ ఫ్లై ఓవర్ పూర్తి : వి à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ  à°•à°®à°¿à°·à°¨à°°à± 

విశాఖపట్నం లో అత్యంత

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎం ఏ డి కూడలి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఎప్పడికి పూర్తవుతుందో వివరించాలన్నారు. దీనికి బదులుగా కమిషనర్ మాట్లాడుతూ ఈ బ్రిడ్జి

నిర్మాణం à°—à°¤ ఏడాది డిసెంబర్ నాటికే పూర్తి కావాల్సి యుండని, అయితే అనివార్య కారణాల వాళ్ళ మరో 5 నెలలోగా  ( జులై 2020 ) నాటికి పూర్తవుతుందని, తెలిపారు. à°ˆ నిర్మాణం చేపట్టిన

విజయ్ నిర్మాణ్ సంస్థ పూర్తి నిబద్దతతో పని చేస్తోందన్నారు. అతి త్వరలోనే à°Žà°‚ ఏ à°¡à°¿ ఫ్లై ఓవర్ ప్రజల ముందుకు వచేస్తుందన్నారు.   

కార్తీకవనం పై రివర్స్

టెండరింగ్ చేపట్టండి, తప్పులేదు  

ప్రస్తుతం విశాఖ నగరాన్ని కుదిపేస్తున్న వివాదం, కార్తీకవనం భూములు. సుమారు 14 ఎకరాల ఈ భూములను 33 ఏళ్ళ లీజు కోసం చాలా ఏళ్ళ

క్రితం ప్రయివేట్ వ్యక్తులకు లీజు కు కేవలం ఎకరా 25 వేల రూపాయలకు జరిగింది. అయితే నేడు విశాఖ లో భూముల ధర కోట్లకు పైగా పలుకుతోంది. సరిగ్గా ఈ మాటే మండలి కమిటీ

చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ కమిషనర్ ను ప్రశ్నించారు. అధిక ధర పలుకుతోంది కదా ఈ టెండర్ల ను రద్దు చేసి, మళ్ళీ రివర్స్ టెండరింగ్ కు ఎందుకు పిలవలేదు అని ప్రశ్నించారు.

అయినా ప్రస్తుత ప్రభుత్వానికి రివర్స్ టెండరింగ్ అంటే ఎనలేని అభిమానమని, పోలవరం లోను, హడ్కో టెండర్లలోనూ. ఆఖరి పీపీఏ లను కూడా రివర్స్ టెండరింగ్ చేసినప్పుడు,

స్థానికంగా ఉన్న కార్తీక వనం భూములను ఎందుకు రివర్స్ టెండరింగ్ పిలవలేదు చెప్పాలన్నారు. తక్షణం ఈ లీజును రద్దు చేసి, రివర్స్ టెండరింగ్ పిలిచి అధిక ధరలను కోట్

చేసే వారికీ ఇవ్వాలని సూచించారు. 

ఎర్రమట్టి దిబ్బలను మట్టికరిపించారు :. . .

ఎన్నో శతాబ్దాల చరిత్ర కల్గిన ఎర్రమట్టి దిబ్బలను మట్టికరిపించారని, దీన్ని

పరిరక్షణకు వి ఎం ఆర్ డి ఏ ఏ విధమైన చర్యలు తీసుకుంటోందో చెప్పాలన్నారు. బదులుగా దీన్ని భారత పురావస్తు సంరక్షణ శాఖా హస్తగతం చేసుకుందని, కాబట్టి తాము చర్యలు

తీసుకునే అవకాశం లేదన్నారు. 

రాజధానికి కోసం వి ఎం ఆర్ డి ఏ పరిధిలో భూ సేకరణ జరిగినట్టు తెలుస్తోంది, ఎన్ని ఎకరాలు సేకరించారు అని అడిగిన ప్రశ్నకు,

రాజధానికి తమ నుంచి ఎటువంటి భూ సేకరణ జరగలేదని, అయితే పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం భూమి సేకరించిందన్నారు. 

ఈ శాసన మండలి కమిటీలో ఎమ్మెల్సీలు

ఆర్ సూర్యారావు, ఇళ్ల వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.  

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam