DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైన్- మైన్, శాండ్ - ల్యాండ్ ల కేంద్రంగానే జగన్ పాలన

నవమోసాలను, నవ భారాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తాం. 

45 రోజుల పాటు సాగనున్న ప్రజా చైతన్య యాత్ర : . .

టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా

వెంకట్రావు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) : . . .

అమరావతి, ఫిబ్రవరి 18, 2020 (డిఎన్‌ఎస్‌) : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 9 నెలల లో వైన్- మైన్, శాండ్ - ల్యాండ్ à°²

కేంద్రంగా సాగుతోందని తెలుగుదేశం ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు  à°®à°‚డిపడ్డారు. మంగళవారం గుంటూరు లోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన

విలేఖరులసమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో  à°¸à°¾à°—ుతున్న ప్రజావ్యతిరేక పరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయించిందని, à°—à°¤ ప్రభుత్వం

అమలుచేసిన అనేక ప్రజాసంక్షేమ పథకాలను వైసీపీసర్కారు నిలిపివేసిన వైనాన్ని జనంఎదుట ఎండగట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని వర్గాలకు ఆశలుపెట్టి

అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, విధ్వంసంతోనే పాలన ఆరంభించాడన్నారు. ఇప్పుడేమో మూడురాజధానుల నిర్ణయంతో రాష్ట్రంలో కులాలు, మతాల మధ్యన చిచ్చుపెట్టి

పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం  à°ªà±à°°à°œà°²à°•à± నష్టం చేకూర్చిందని, అభివృద్ధి, సంక్షేమాలను పూర్తిగా

గాలికొదిలేసిందని వెంకట్రావు దుయ్యబట్టారు. ప్రజలకు ఏదైనా సమస్యవస్తే పోలీసులను ఆశ్రయిస్తారని, కానీ పోలీసులే అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తే దుర్భర

పరిస్థితులు రాష్ట్రంలో దాపురించాయన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట పెట్టుకొని, ప్రశ్నించిన ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు

గురిచేస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్లి వారితరుపున ప్రభుత్వంపై పోరాడాలని టీడీపీ నిర్ణయించిందని, అందులో భాగంగానే ప్రజాచైతన్య యాత్రను

నిర్వహించడానికి సిద్ధమైందన్నారు. ఈ యాత్రలో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవమోసాలను, తొమ్మిది రద్దులు, తొమ్మిదిభారాలు, నయవంచకపాలన అనే అంశాలతోపాటు,

విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ చార్జీల పెంపు, డీజిల్, పెట్రోల్ ధరల పెంపు, అరకొరగా అమలవుతున్న పథకాల తీరుని ప్రజల్లోకి తీసుకెళ్లాలని  à°¨à°¿à°°à±à°£à°¯à°¿à°‚చడమైందన్నారు.

రద్దుల విషయానికివస్తే, అన్నక్యాంటీన్లు, ఉచిత ఇసుక, సంక్రాంతి, రంజాన్ కానుక, చంద్రన్న బీమా, సీఎమ్ ఆర్ ఎఫ్,  à°°à±ˆà°¤à±à°­à°°à±‹à°¸à°¾, రైతురుణమాఫీ, తదితర అంశాలున్నాయన్నారు.

కాపుకార్పొరేషన్ల రుణాలు, కాపు రిజర్వేషన్ల అంశంతోపాటు, బీసీలకు స్వయం సహాయకరుణాలు, ఆదరణ వంటి పథకాలను ప్రభుత్వం గాలికొదిలేసిందని, వాటినికూడా ప్రజల్లో

ఎండగడతామన్నారు. నిరుధ్యోగ భృతి, ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలతో పాటు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని  à°¨à°¿à°²à°¿à°ªà°¿à°µà±‡à°¶à°¾à°°à°¨à±à°¨à°¾à°°à±. మరోవైపు రాజధాని నిర్మాణ

పనులు, సాగునీటి ప్రాజెక్టుల పనులతోపాటు, ఎన్టీ ఆర్ జలసిరినికూడా నిలిపివేశారన్నారు. ఇవన్నీ నిలుపుదల చేసింనదుకు జగన్ ను ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని కళా

హెచ్చరించారు.

తొమ్మిది భారాలకు వచ్చేసరికి, ఉచితఇసుక విధానం తీసేయడంతో పెరిగిన ఇసుకధర, సిమెంట్ బస్తాపై పడిన భారం, రూ.700కోట్ల వరకు పెంచిన ఆర్టీసీ ఛార్జీలు,

రూ.1300కోట్ల వరకు పెంచిన విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ పై మోపిన రూ.500కోట్ల భారాన్ని, యూనివర్శీటీ విద్యార్థులపై మోపిన ఫీజులభారాన్ని, మద్యంపై మోపిన రూ.1800కోట్ల

భారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించినట్లు కళా తెలిపారు. వైసీపీ నేతలే ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్య నిషేదం ముసుగులో దోచుకుంటున్న

తీరును కూడ ప్రజల ముందు ఉంచుతామన్నారు. జగన్ కు జె ట్యాక్స్ చెల్లించటం కోసమే కొన్ని రకాల మద్యం బ్రాండ్ లనే విక్రయిస్తున్నారన్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని

చెప్పిన జగన్ రైతు భరోసా, రైతు రుణమాఫీ, పింఛన్లు, రేషన్ కార్డులు వంటి అంశాల్లో మాట తప్పాడన్నారు. వాహనమిత్ర పథకం పేరుతో 6 లక్షల మంది ఆటో కార్మికులకు న్యాయం

చేస్తానన్న జగన్ కేవలం లక్షన్నర మందికే రుణమిచ్చి చేతులు దులుపుకున్నాడని కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. 80 లక్షల మంది విద్యర్థులకు అమ్మ ఒడి పథకాన్ని అమలు

చేస్తానని చెప్పి దాన్ని రూ. 42 లక్షలకు కుదించాడన్నారు. ఎస్ సి, ఎస్ టి, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులను జె ట్యాక్స్ వచ్చే పథకాలకు మళ్లించడం జరిగిందన్నారు. సున్న

వడ్డీ à°•à°¿à°‚à°¦  à°¬à°¡à±à°œà± ట్ లో రైతులకు రూ. 4 వేలు కేటాయించిన జగన్ సర్కారు కేవలం రూ. 100 కోట్లే ఖర్చు చేసిందని, మిగిలిన రూ.3,900 కోట్లు ఎటు మళ్లించారో సమాధానం చెప్పాలని కళా

డిమాండ్ చేశారు. ఎస్, ఎస్ టి, బిసి, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి జగన్ మాట తప్పాడన్నాడు. సాక్షి టీవీలో పుంఖాను పుంఖానులుగా ఇచ్చిన ప్రకటనలన్నీ

ఏమయ్యాయని ప్రశ్నించారు. సన్న బియ్యం ఇస్తానని చెప్పి రేషన్ బియ్యాన్నే పాలిష్ పట్టించి ఇస్తున్నారని, తద్వారా మిల్లర్లకు లబ్ది కలుగుతోందన్నారు. 9  à°¨à±†à°²à°²à±à°²à±‹

వైసీపీ ప్రభుత్వం వైన్, మైన్, ల్యాండ్, శాండ్ విభాగాలనే కేంద్రంగా చేసుకుని జే ట్యాక్స్ వసూలు చేస్తోందన్నారు. వైన్ (మద్య నిషేదం) ముసుగులో నెలకు రూ. 500 కోట్ల వరకు జె

ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, అలా చెల్లించే కంపెనీల మద్యం బ్రాండ్లనే విక్రయిస్తున్నారని మాజీ మంత్రి తెలిపారు. మైనింగ్ ముసుగులో వందల కోట్ల జరిమానాలు

విధిస్తూ ఆయా వ్యాపార రంగాల వారిని భయభ్రాంతానికి గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన శాండ్ పాలసీ వల్ల 50 లక్షల భవన నిర్మాణ కుటుంబాలు రోడ్డున

పడ్డాయన్నారు. తాజాగా ల్యాండ్ పాలసీ పేరుతో ఎక్కడ ప్రభుత్వ భూములు, దేవాదాయ, మఠం, వక్ఫ్ భూములను కబ్జా చేసే కార్యక్రమం మొదలుపెట్టారన్నారు.  à°ˆ నాలుగు రకాల దోపిడీల

ద్వారా ఏటా రూ. 20 వేల కోట్ల వరకు వైసీపీ ప్రభుత్వం బలవంతంగా వసూలు చేస్తోందన్నారు. మంత్రులు కూడా ఎవరికి నచ్చిన పద్ధతుల్లో వారు వైన్, మైన్, ల్యాండ్, శాండ్ ల

ప్రాతిపదికనే దోపిడీకి పాల్పడుతున్నారన్నారు.  à°µà±ˆà°¸à±€à°ªà±€ ప్రభుత్వానికి కమిషన్ లు, మామూళ్లు ఇచ్చుకోలేక పరిశ్రమలు, కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు తరలి

పోయాయన్నారు. జగన్మోహన్ రెడ్డి చర్యల వలన  à°ˆ ఏడాది దావోస్ లో ఏపీ అడ్రస్ గల్లంతైందని కళా ఎద్దేవా చేశారు. జే ట్యాక్స్ రూపంలో తన ధన దాహాన్ని తీర్చుకుంటున్న జగన్

పాలనతో విసిగి వేసారిపోయారన్నారు.  9 నెలల పాలనలో రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట పట్టిన జగన్  à°ªà±‹à°²à±€à°¸à±à°²à°¨à±, లాఠీలను అడ్డం పెట్టుకుని నిర్విరామంగా 144 సెక్షన్

కొనసాగిస్తూ పాలన సాగిస్తుండటం విచారకరమన్నారు.

45 రోజుల పాటు సాగనున్న ప్రజా చైతన్య యాత్ర : . . .

 à°ˆ నెల 19à°µ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ

నిర్వహించ తలపెట్టిన ‘’ప్రజా చైతన్య యాత్ర’’ కరపత్రాన్ని, స్టిక్కర్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి కళా వెంకట్రావు మంగళవారం పార్టీ కేంద్ర

కార్యాలయంలో ఆవిష్కరించారు.  à°ˆ యాత్ర 45 రోజులపాటు సాగుతుందని గ్రామ, మండల స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక చర్యలను, జగన్ సాగిస్తున్న ప్రజా à°•à°‚à°Ÿà°• పాలనను ప్రజల్లోకి

తీసుకెళతామని కళా వెంకట్రావు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా నుంచి టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు  à°ˆ యాత్రను ప్రారంభిస్తారన్నారు.  à°•à°°à°ªà°¤à±à°°

ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయనతోపాటు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి గురజాల

మాల్యాద్రి, మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam