DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూ. 300 కోట్ల విలువ భూమి, రాజకీయ రాబందుల కన్ను 

రామానంద ఆశ్రమాన్ని కబ్జా కోసం అధికార పార్టీ ముందడుగు 

చిన్నారుల బ్రతుకు బుగ్గిపాలు చేస్తే వినాశనమే.

క్రైస్తవ పాలనా నశించాలని యాగాలు చేస్తాం:

సాధుపరిషత్ 

 

గుళ్ళు కూల్చారు - ఇక సాధు ఆశ్రమాలపై పడ్డారా?  : సాధుపరిషత్  

విశాఖ నడిబొడ్డులో 6.5 ఎకరాల విలువైన స్థలంపై పార్టీ కన్ను  

హిందూ రక్షణ

చేతకాకుంటే పీఠాన్ని వీడండి : శ్రీనివాసానంద  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 18, 2020 (డిఎన్‌ఎస్‌) : కాబోయే రాజధాని మహా విశాఖ

నగరం నడిబొడ్డు లో జాతీయ రహదారికి అనుకుని ఉన్న 6.5 ఎకరాల స్థలం లో ఉన్న రామానంద ఆశ్రమాన్ని కబ్జా చేసేందుకు రాజకీయ రాబందులు చేయరాని ఘోరాలు చేస్తున్నారని ఆంధ్ర

ప్రదేశ్ సాదు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ( పొందూరు) మండిపడ్డారు. మంగళవారం విశాఖ నగరం లోని రామానంద ఆశ్రమం లో నిర్వహించిన విలేకరుల

సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ మాఫియా అధికారం లోకి వచ్చాక వాళ్ళ మతప్రచారం కోసం అంగీకరించని హిందూ ఆలయాలను కూలుస్తున్నారని,

 à°µà°¾à°³à±à°³ భూ దోపిడీ కోసం సాధువుల ఆశ్రమాలను ఆక్రమించుకునేందుకు  à°¦à±Œà°°à±à°œà°¨à±à°¯à°¾à°²à± చేస్తున్నారని మండిపడ్డారు. సుమారు 300 కోట్ల రూపాయల విలువ కల్గిన రామానంద ఆశ్రమం

విశాఖపట్నం లోని వెంకోజీ పాలెం జాతీయ రహదారికి అనుకుని 6.5 ఎకరాలలో ఉందన్నారు. గత కొంతకాలం గా రాజకీయ రాబందులు ఈ ఆశ్రమాన్ని దోచుకునేందుకు నానా రకాలుగా రాజకీయ,

దౌర్జన్య కాండను ప్రదర్శించారన్నారు. గత ప్రభుత్వ కాలం లోనూ ఈ ఆశ్రమానికి బెదిరింపులు తప్పలేదన్నారు. ఇప్పుడు అధికారం మారాక హిందూ సమాజానికి మేలు జరుగుతుంది

అనుకుంటే ఈ రాష్ట్రంలో హిందువుల పని పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయిందన్నారు. గతంలో కేవలం బెదిరింపుల వరకే పరిమితమైతే నేటి క్రైస్తవ మాఫియా పాలనలో హిందూ

గుళ్ళు కూల్చేస్తున్నారన్నారు. పిఠాపురంలో 23 దేవీ దేవతా విగ్రహాలు కూల్చారని, గుంటూరు జిల్లా రొంపిచర్లలో ఏకంగా మదన గోపాల స్వామి ఆలయంలో మూల విరాట్ విగ్రహాలనే

డ్రిల్లింగ్ మిషన్లు పెట్టి పీకేశారన్నారు. అనంతరం నెల్లూరు జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయ రధాన్ని తగులబెట్టారని, నిన్నటి రోజున పశ్చిమ గోదావరి జిల్లా

ఉండ్రాజవరం లో అమ్మవారి ఆలయం ప్రధాన ద్వారాన్ని కూల్చేశారన్నారు. హిందూ దేవాలయాల కూల్చివేతను అడ్డుకున్నందుకు చాలా మందిపై క్రిమినల్ కేసులు కూడా

పెట్టారన్నారు.  à°¨à±‡à°¡à± విశాఖ లో సాధువులు, చిన్న పిల్లలు ఆశ్రయం పొందుతున్న రామానంద ఆశ్రమాన్ని కబ్జా చేసేందుకు రాజకీయ రాబందులు తమ అధికార బలాన్ని పూర్తిగా

వినియోగిస్తున్నారన్నారు. వీళ్ళ అరాచకాలు తట్టుకోలేక భయపడి ఆశ్రమ నిర్వాహకులు స్వామి భయంతో తలదాచుకునేందుకు బయటకు వెళ్ళిపోతాయారన్నారు. అయితే ఈ ఆశ్రమాన్ని

క్రైస్తవ కబంద హస్తాల్లోకి వెళ్లనివ్వమని హెచ్చరించారు. 

రూ.  300  à°•à±‹à°Ÿà±à°²à± స్వాహా కోసమే. కబ్జా ప్రయత్నాలు :. . . 

రాజధాని కాబోతున్న విశాఖ నగరం లోని

నడిబొడ్డున జాతీయ రహదారికి అనుకుని ఉన్న ఈ స్థలం లో రామానంద ఆశ్రమం లో ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. ప్రక్కనే ఉన్న శివాలయం

దేవాదాయ శాఖా పరిధిలోకి గతంలోనే లాగేసుకున్నారు. ఇక ఎక్కువగా ఖాళీ స్థలం ఉంది, ఇక్కడ గోశాలను ఆశ్రమ నిర్వాహకులు నడుపుతున్నారు. ఇంత విలువైన ఖాళీగా ఉండడంతో

రాజకీయ రాబందుల కళ్ళు దీనిపై పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన వారు కబ్జాకు కృషి చెయ్యగా, అధికారం మారాక ఈ పార్టీ వాళ్ళు దీనిపై దృష్టిపెట్టారని

సాధుపరిషత్ మండిపడుతోంది.  

à°ˆ ఆశ్రమానికి  1992 లో నాటి విశాఖ మేయర్ à°¡à°¿ వి సుబ్బారావు దంపతులు ప్రారంభించారని, నాటి మునిసిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ లు కూడా

విశిష్ట అతిధులుగా పాల్గొని, ఆశ్రమ నిర్వాహకులను అభినందించారన్నారు. అయితే నేటి పాలకులకు à°ˆ ఆశ్రమమే పెద్ద అడ్డంకి à°—à°¾ మారిందన్నారు.   

క్రైస్తవ పాలన

నశించాలని కోరుతూ యాగాలు చేస్తాం : . . .

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం క్రైస్తవ పాలనా సాగుతోందని, సనాతన హిందూ ధర్మం సమాజ హితాన్ని కోరుతుంటే ఈ క్రైస్తవ పాలకులు

హిందువులు నాశనం కావాలని భౌతిక దాడులు చేస్తున్నారన్నారు. ఈ విధమైన కిరాతక క్రైస్తవ పాలనా నశించాలని, ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటూ నేటి నుంచి అన్ని

సాదుమతాల్లోనూ ప్రార్ధనలు, యాగాలు చేస్తామని హెచ్చరించారు. గతంలో హిందూ ధర్మాన్ని కాపాడతానని ఇచ్చిన హామీని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

మరిచిపోయారన్నారు. 

హిందూ రక్షణ చేతకాకుంటే పీఠాన్ని వీడండి :. . .

హిందూ సమాజానికి తానె పేటెంట్ గా ప్రచారం చేసుకుంటున్న విశాఖ శారదా పీఠాధిపతి ఆంధ్ర

ప్రదేశ్ లో జరుగుతున్నా హిందూ ఆలయాల కూల్చివేత కనపడడం లేదా అని స్వామి శ్రీనివాసానంద ప్రశ్నించారు. రామానంద ఆశ్రమ నిర్వాహకులు శారదా పీఠానికి వెళ్లి

స్వరూపానందాను కలిసే ప్రయత్నం చేస్తే కనీసం వీళ్ళ గోడు కూడా వినేందుకు ఆసక్తి చూపక పోవడం చూస్తే ఈయన హిందువేనా అనే అనుమానం కలుగుతోందన్నారు. సాధువులు కాషాయం

ధరించేది హిందూ సమాజ రక్షణ, సేవ కోసమేనని, అలాంటి కర్తవ్యాన్ని పాటించలేకపోతే పీఠాన్ని వేరొకరికి అప్పగించి ఆశ్రమాన్ని వీడాలని డిమాండ్ చేసారు. ఎన్నికల ముందు ఈ

స్వామి హిందూ సమాజాన్ని పూర్తిగా మోసగించారన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రాయశ్చిత్తం చేసి, గంగ స్నానం తో వైఎస్ జగన్ హిందూ ధర్మాన్ని స్వీకరించారంటూ

కొన్ని భూటకపు వీడియో లు షూటింగ్ చేసి, ప్రజలను మోసగించారన్నారు. అయితే ఇది నిజమని నమ్మిన అమాయకపు ఆంధ్ర ప్రజలు వైఎస్ జగన్ ను అత్యధిక మెజారిటీ తో 151 అసెంబ్లీ

స్థానాలను అందించారన్నారు. కేవలం క్రైస్తవ ఓట్లతోనే వైఎస్ జగన్ ఇన్ని సీట్లు గెలిచారా, హిందువులు జగన్ కు ఓట్లు వెయ్యలేదా అని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో

హిందువులు గగ్గోలు పెడుతూ రోడ్డెక్కితే వైఎస్ జగన్ కనీసం నోరు ఎట్టకపోవడం చూస్తే అతని ప్రోత్సాహంతో నే ఈ రాష్ట్రంలో క్రైస్తవ మాఫియా రెచ్చిపోయి హిందూ

దేవాలయాలు కూలుస్తోంది అని అనుకోవాల్సియుంటుందన్నారు.     

అంతకు ముందు సాధుపరిషత్ సభ్యులు, ఆశ్రమంలోని చిన్నారులతో మాట్లాడి వారికి యావత్ హిందూ సమాజం

à°…à°‚à°¡à°—à°¾ నిలబడుతుందని భరోసా ఇచ్చారు. కొంతసేపు వారితో శ్రీరామ భజన చేయించారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam