DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ నెల 25 నుంచి విశాఖ నుంచి విమాన కార్గో కి శ్రీకారం 

ఉత్తరాంధ్ర వాణిజ్య ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి    

ప్రజాప్రతినిధులు, వ్యాపారుల కృషి à°•à°¿ శుభ పరిణామం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . .

.

విశాఖపట్నం, ఫిబ్రవరి 23, 2020 (డిఎన్‌ఎస్‌) : ఈనెల 25 నుంచి తొలిసారిగా విశాఖ నుంచి à°µà°¿à°®à°¾à°¨à°¾à°² ద్వారా ఎగుమతికి శ్రీకారం చుట్టబడుతోంది. à°ˆ మేరకు ఉత్తరాంధ్ర ప్రజా

ప్రతినిధులు చేసిన కృషి à°•à°¿ ఫలితం లభించినట్టయ్యింది. కార్గో విమానాలు చెన్నై, కోల్‌కొతా, సూరత్‌ తదితర ప్రాంతాలకు నడపడానికి స్పైస్‌ జెట్‌ సంసిద్ధత వ్యక్తం

చేసింది. మరోవైపు à°† సంస్థ కార్గో విమానాలు కొనసాగించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. 

ఈనెల 15 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ సేవలకు రక్షణ శాఖ అభ్యంతరాలు

పెట్టడంతో కార్గో విమాన సర్వీసుల ప్రతిపాదనకు ఆటంకం ఎదురైంది.

విశాఖ నుంచి కార్గో విమాన సర్వీసులు ప్రారంభం కావాలని కొంతమంది వ్యాపారులు ఎప్పటినుంచో

కోరుతున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌  à°µà°¿à°®à°¾à°¨ ప్రయాణికుల సంఘం వివిధ విమాన సంస్థల ప్రతినిధులతో చర్చించి ఒప్పించింది. అందులో భాగంగా ఈనెల 15 నుంచి స్పైస్‌ జెట్‌

ఆధ్వర్యంలో కార్గో విమానాల సర్వీసుల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అయితే విశాఖలోని రక్షణ శాఖ అధికారుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో కార్గో విమాన

సర్వీసుకు బ్రేక్‌ పడింది. దాంతో కార్గో సర్వీసుల నిర్వహణపై స్పైస్‌ జెట్‌ సంస్థ రక్షణశాఖ అధికారులకు లేఖ లేఖ రాసింది. 
  
ప్రస్తుతం కార్గో విమానాలు లేక

వ్యాపారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.  à°°à±‹à°¡à±à°¡à±, రైల్వే రవాణా ద్వారా సరకులు నడుపుతున్నారు, మరింత వేగవంతంగా సరకు రవాణా చేసేందుకు ఎయిర్ కార్గో అందుబాటులో

ఉండాలని కొన్నేళ్ల నుంచి వ్యాపార వర్గాలు కోరుతున్న విషయం తెలిసిందే. అయితే ఇంతకాలం తర్వాత విమాన కార్గో కు అనుమతి లభించింది.  

విమాన ప్రయాణికుల సంఘం

ప్రతినిధులు కె.కుమార్‌ రాజా, à°¡à°¿.ఎస్‌.వర్మ, à°’.నరేష్‌కుమార్‌ లు చేపట్టిన కృషికి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సహకారం తోడవ్వడంతో ఎయిర్ కార్గో కు లైన్ క్లియర్ అయినట్టు

తెలుస్తోంది. 

ఇవీ వేళలు : . .. 

కార్గో విమానాలు విశాఖ నుంచి చెన్నై, కోల్‌కతా, సూరత్‌ తదితర ప్రాంతాలకు ఈనెల 25 నుంచి నడుపుతున్నారు. రోజు తప్పించి రోజు à°ˆ

విమానాలు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 11.50 గంటలకు విశాఖ వచ్చే విమానం, విశాఖ నుంచి మధ్యాహ్నం 1.10 గంటలకు బయలు దేరుతుంది. చెన్నై–వైజాగ్‌– కోల్‌కతా à°’à°• రూటు,

చెన్నై– విశాఖ–సూరత్‌కు విమానాలు నడుపుతున్నట్టు సంఘం ప్రతినిధి నరేష్‌కుమార్‌ తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam