DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధినేత మాటలకు తలూపడమేనా . . సొంత ఆలోచనలు లేవా ? 

(à°…) రాజకీయ చదరంగంలో తూతూ బాకాలు 

విశాఖపట్నం, జులై 1 ,2018 (DNS Online ):  à°¯à°§à°¾ నేత . . ,  à°¤à°¦à°¾ కార్యకర్త అనేది ప్రస్తుత రాజకీయ పార్టీలకు అతికినట్టు వర్తిస్తుంది. రాజకీయం అంటే

ప్రజాక్షేత్రం లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపించడం. అయితే ఇది గతంలో మాట. ఇప్పుడు ఆయా పార్టీల అధినేత మాటకు తూతూ బాకా ఊడడమే ఇప్పుడు పార్టీ మొత్తం చేసే పని. ఏ

పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం. ఢిల్లీ లోని  à°…ధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ, గల్లీ లోని అణాకానీ పార్టీలు సైతం పాటించేది ఇదే సూత్రం. లేకుంటే పార్టీ

ని వీడి వెళ్లడమే. దీనికి నిదర్శనమే భారతీయ జనతాపార్టీ ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా

ప్రకటిస్తే ఆంధ్ర లో బీజేపీ హోదా ఇచ్చేస్తాం అన్నారు, తీరా ఎన్నికల్లో గెలిచినా తర్వాత హోదా ఇచ్చేది లేదు అని అమిత్ షా చెప్పగానే, లోకల్ కేడర్ కూడా దానికి తానా

తందానా అంటూ హోదా ఇవ్వం అని చెప్పేసింది.  à°…దే విధంగా తెలుగుదేశం కేంద్రం లో దోస్తీ ఉన్నప్పుడు హోదా కు సై అంది, అప్పుడు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు హోదా ఇదిగో

ఇచ్చేస్తాం అనగానే టిడిపి గల్లీ క్యాడర్ కూడా అదిగో హోదా ఇచ్చేస్తాం అంది. తీరా కేంద్రం లో బీజేపీ ప్రత్యేక హోదా లేదు, కేవలం ప్రత్యేక ప్యాకేజి మాత్రమే ఇష్టం

అని బీజేపీ ప్రకటించగానే వెంటనే అర్ధరాత్రి చంద్రబాబు దానికి ఒకే అని హోదా కంటే ప్యాకేజీయే ముద్దు అని ప్రకటించేశారు. దీంతో గల్లీ లోని తెలుగుదేశం క్యాడర్

కూడా హోదా వద్దు ప్యాకేజీయే ముద్దు అని రాష్ట్రమంతా రచ్చ చేసేసారు. తీరా బీజేపీ తో టిడిపి విడాకులు తీసుకున్న తర్వాత చంద్రబాబు స్వరం మర్చి యు టర్న్ తీసుకుని

ప్యాకేజి వద్దు, హోదా కావాలి అని ప్రకటన చెయ్యగానే గల్లీ టిడిపి కేడర్ కూడా మళ్ళీ హోదాయే కావాలి అంటూ ప్రచారం మొదలెట్టేసింది. 
అదే విధంగా భూమి పుట్టక ముందు

పుట్టిన పార్టీగా వాళ్ళే ప్రచారం చేసుకునే కాంగ్రెస్ పార్టీలో సైతం ఇదే తరహా వైఖరి సాగుతోంది. విభజన సమయం లో చేసిన ప్రకటనల్లో ఏమాత్రం న్యాయం లేకపోయినా, గల్లీ

స్థాయి కాంగ్రెస్ క్యాడర్ అధినేత మాటకి సై అంది. అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విడగొట్టినా సమర్ధించింది. బిల్లు లో ఏ అంశాలూ పెట్టకపోయినా కాంగ్రెస్ కేడర్ తానా

తందానా అంది. ఇప్పుడు అధినేతకు దేశ వ్యాప్తంగా చుక్కలు కనిపించడం తో మళ్ళీ ఆంధ్ర కి ప్రత్యేక హోదా ఇస్తాం అనగానే ఇక్కడ క్యాడర్ కూడా తానా తందానా అని తలూపుతోంది.

అంటే వీళ్ళకి సొంత ఆలోచనలు లేవా, లేక వాళ్ళు మెదడు వినియోగించరా?

అంటే  à°…ధినేత ఆలోచన ఎలా ఉంటే అలా పలుకుతారు, దానికి à°† పార్టీ క్యాడర్ కూడా తానా తందానా

అంటున్నారు. అంటే పార్టీ క్యాడర్ కు గానీ ద్వితీయ శ్రేణి పార్టీ వర్గాలకు గానీ సొంత ఆలోచనలు ఉండవా, లేక రాజకీయ పార్టీల్లో చేరితే వీళ్లకు మెదడు పనిచెయ్యడం

మానేస్తుందా?  à°°à°¾à°œà°•à±€à°¯à°¾à°²à± స్థానిక సమస్యలపై ఏమాత్రం దృష్టి సారించడం లేదు, కేవలం అధినేత మాటలకు తానా తందానా అని అనడం తప్ప మరొకటి చెయ్యని క్యాడర్ ను ప్రజలు నమ్మే

అవకాశం ఉందొ లేదో వాళ్ళకే తెలియాలి. 
ఇక మిగిలిన పార్టీలూ కాస్త అటూ ఇటూ గా అలాగే ఉన్నాయి. అధినేత మాటకు తానా తందానా అనడం తప్ప మరో మాట ఉండడం లేదు. అది ప్రజలకు

అన్యాయం చేసేవైనా సరే à°–à°‚à°¡à°¿à°‚à°šà°¡à°‚ లేదు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam