DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాటి రామాయణం ఈనాటి తరం కోసం ఈ నెల 28 నుంచి ప్రసారం 

*à°¡à°¿à°¡à°¿ నేషనల్ లో ప్రజల వినోదానికి పున: ప్రసారం: కేంద్ర మంత్రి జవదేకర్* 

*ఉదయం 9 గంటలకు మొదటి భాగం, రాత్రి 9 గంటలకు తరువాయి*  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 27 , 2020 (డి ఎన్ ఎస్) : 1987 సంవత్సరం లో యావత్ భారత దేశాన్ని అత్యంత ఆకర్షణీయంగా ఆకట్టుకున్న రామానంద సాగర్ నిర్మించిన రామాయణం మరోసారి

భారత దేశ ప్రజల ముందుకు రానుంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి ప్రకాష్ జవదేకర్ à°ˆ మేరకు à°’à°• ప్రకటన విడుదల చేసారు. 

జనవరి 25  1987 నాడు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన à°ˆ

రామాయణం, భారతీయ చలన చిత్ర, బుల్లి తెర చరిత్రలోనే à°’à°• పెద్ద సంచలనంగా మారింది.  à°œà±à°²à±ˆ 31 ,1988 వరకూ మొత్తం  78 వారాలు ప్రసారం అయ్యి నాటి దూరదర్శన్ చరిత్రలోనే అత్యంత ఆదరణ

కల్గిన ధారావాహికంగా ఎన్నో పురస్కారాలు అందుకుంది. 

దేశ వ్యాప్తంగా ఎవరు ఎక్కడ ఉన్నా, , ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు కచ్చితంగా సమీపంలోని టీవీల ముందుకు

చేరిపోయేవారంటే అతిఆశయోక్తి కాదు. à°ˆ సంచలన ధారావాహికల్లో ప్రధాన భూమిక వహించిన అరుణ్ గోవిల్ ( రాముడు), దీపికా చికిలియా (సీత), అరవింద్ త్రివేది   (రావణుడు), ధారాసింగ్

( హనుమాన్) తదితర పాత్రధారులు ఎక్కడ కనిపించినా ప్రత్యేక ఆరాధన భావంతో చూసేవారు. తదుపరి వీరిలో కొందరు రాజకీయ ప్రవేశం చేసిన, వారికి తగినంత ఆదరణ లభించక పోవడం

గమనార్హం. 

పున:  à°ªà±à°°à°¸à°¾à°°à°‚ : . . . .

ఈ కార్యక్రమం ఈ నెల 28 నుంచి దూరదర్శన్ నేషనల్ ఛానెల్ లో ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకూ మొదటి భాగం, రాత్రి 9 గంటల నుంచి 10

గంటల వరకూ తరువాయి భాగం ప్రసారం కానున్నాయి. భారత దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్నందున దేశ ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. వీరికి వినోదం కల్గించేందుకు

అత్యంత ఆదరణ కల్గిన రామానంద సాగ్గర్ రామాయణాన్ని మరోసారి ప్రసారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

à°ˆ సంచలన ధారావాహిక  à°µà±ˆà°­à°µà°‚ ఇప్పడి

తరానికి తెలియచేసేందుకు కేంద్రం నిర్ణయించడం తో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అత్యంత విస్తృతంగా పెరిగిన ప్రస్తుత తరానికి,

సాంకేతిక పరిజ్ఞానం పెద్ద గా అందుబాటులో లేని సమయంలో చిత్రీకరించిన ఈ ధారావాహిక ఒక మంచి ఉపదేశంగా మారనుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam