DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ డివిజన్ నుంచి భారీ మొత్తంలో నిత్యావసరాల రవాణా సరఫరా

*ప్రజా శ్రేయస్సులో విశాఖ డివిజన్ ముందంజ, క్వారంటైన్ లు గా కోచ్ లు*

*స్ఫూర్తిగా నిలుస్తున్న విశాఖ డి ఆర్ ఎం చేతన్ కుమార్ శ్రీవాత్సవ*

*(DNS రిపోర్ట్ :

సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 20, 2020 (డిఎన్ఎస్) : దేశవ్యాప్తంగా జనజీవనం నిలిచిపోయిన నిరంతరం పనిచేస్తున్న శాఖల్లో అగ్రగామి భారతీయ రైల్వే.

దేశంలోనే నాల్గవ అత్యధిక ఆదాయాన్ని అందిస్తున్న విశాఖపట్నం రైల్వే డివిజన్ లాక్ డౌన్ సమయంలో సైతం అదే స్ఫూర్తిని కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజలకు

అవసరమైన నిత్యావసరాలను విశాఖ డివిజన్ నుంచి దేశంలోని వివిధ గమ్య స్థానాలకు అవిశ్రాంతంగా చేరుస్తూనే ఉంది. గత నెల 22 న మొదలైన జనతా కర్ఫ్యూ నుంచి, అనంతరం మొదలైన లాక్

డౌన్ నుంచి మొదలైన దేశ వ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో రైళ్ల రవాణా కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే. 

అత్యంత క్లిష్టతరమైన పరిస్థితుల్లో సైతం భాద్యతా యుతంగా

విధులను నిర్వర్తిస్తు అందరికీ  à°¸à±à°«à±‚ర్తిగా నిలుస్తున్నారు విశాఖ పట్నం డివిజనల్ మేనేజర్ ( à°¡à°¿ ఆర్ à°Žà°‚)  à°šà±‡à°¤à°¨à± కుమార్ శ్రీవాత్సవ. సిబ్బందికి ఎప్పడికప్పుడు

ఆదేశాలు ఇస్తూ. . కనీస దూరం పాటిస్తూ,  à°µà°¿à°µà°¿à°§ గమ్యస్థానాల మధ్య లో చిక్కుకు పోయిన వారిని రక్షణ శిబిరాలకు సైతం తరలించారు. 

భారీ సంఖ్యలో నిత్యావసరాల ఎగుమతి . .

అయితే నిత్యావసరాల సరఫరా కోసం రైల్వే శాఖ కొన్ని మార్గాల్లో ఎంపిక చేసిన విభాగాల నుంచి గూడ్స్ రైళ్లు, ఎంపిక చేసిన ఎక్స్ ప్రెస్ రైళ్లు ద్వారా ఢిల్లీ సహా

దేశంలోని వివిధ ప్రాంతాలకు గూడ్స్ రైళ్ల ద్వారా సరఫరా చెయ్యడం జరిగుతోంది. నిరంతరాయంగా సాగుతున్న ఈ ప్రక్రియ ద్వారా ఇంతవరకూ 140 టన్నుల మామిడి కాయలు, పళ్ళను, 80 టన్నుల

బియ్యం, 14 టన్నుల వైద్య పరికరాలు, మందులు, పాల ఉత్పత్తులు, ఇతర నిత్యావసర సామాగ్రి ని ఆదివారం వరకూ ఎగుమతి చెయ్యడం జరిగింది. 

వీటితో పాటు అదనంగా వివిధ పరిశ్రమల

నుంచి భారీ సంఖ్యలో ఉత్పత్తులను యధావిధిగా రవాణా ను కొనసాగించారు. 

కోచ్ లను క్వారంటైన్ లు à°—à°¾ సిద్ధం చేసారు :. . . 

ప్రస్తుత కరోనా మహమ్మారి రాక్షసుణ్ణి

పూర్తిగా నశింపచేసేందుకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న వైద్య సదుపాయాల్లో భారతీయ రైల్వే సైతం తన వంతు సహకారాన్ని అందిస్తోంది. దీనిలో భాగంగా విశాఖపట్నం రైల్వే

స్టేషన్ లోని ఫ్లాట్ ఫార్మ్ ల పై కొన్ని కోచ్ లను వీటికి అనుగుణంగా సిద్దం చేసారు. క్వారంటైన్ కూపే లుగాను, ఐసోలేషన్ కూపే లుగాను వీటిని సిద్ధం చేసారు. వైద్య

సదుపాయానికి అనువుగా ఉండే విధంగా క్రింది బెర్త్ ల ను సిద్ధం చేసారు. ప్రక్కనే వైద్య పరికరాలు ఉంచే విధంగా తగిన స్థలాన్ని కూడా ఏర్పాటు చేసారు. మొత్తం భారత

దేశంలో సుమారు 5000 కు పైగా కోచ్ లను ఇసోలాటిన్ వార్డ్ లుగా సిద్దం చేసారు. వాటిల్లో విశాఖపట్నం డివిజన్ లో 60 కోచ్ లలో 500 బెర్త్ లను ఐసోలేషన్ à°—à°¾ మార్చారు.   

ఈ కోచ్

లోని  à°®à°§à±à°¯ బెర్త్ లను పూర్తిగా తొలగించారు. 

ప్రతి కోచ్ లోను 9 మందికి సదుపాయాలతో అవకాశం కల్పించవచ్చు. వీటిలోని వైద్యులు, వైద్య సహాయకులు కూడా ఉంటారు.

 

నాలుగు మరుగు దొడ్లలో à°’à°• దానిని బాత్ రూమ్ à°—à°¾ మార్చారు. 

కోచ్ లో ఉన్న ప్రతి వాష్ బేసిన్ వద్ద లిక్విడ్ సబ్బులను అందుబాటులో ఉంచారు. 

ప్రతి కూపే

వద్ద సైలైన్ లు, ఇతర సామాగ్రి కోసం  à°¨à°¾à°²à±à°—ు హుక్ లు, కోట్ హుక్ లు ఏర్పాటు చేసారు. 

కాలితో నొక్కే చెత్తబుట్టలను, వివిధ రంగుల్లో పెట్టారు. వీటికి అదనంగా

గార్బేజ్ సంచులను కూడా ఏర్పాటు చేసారు. 

ఒక బకెట్ తో నీళ్లు పట్టుకునే విధంగా బాత్ రూమ్ లను సిద్దం చేసారు.

ప్రతి బాత్ రూమ్ లోనూ ఒక బకెట్, మగ్, ఒక స్టూల్

అందుబాటులో ఉంటాయి. 

అధునాతన సామాగ్రిని బాత్ రూమ్ ల్లోనూ, వెస్ట్రన్ మరుగు దొడ్లలోనూ ఉంచుతున్నారు. 

ప్రతి కోచ్ లోనూ మొదటి కూపే వైద్యులు, వైద్య

సహాయకులకు కేటాయించడం జరుగుతుంది.  

ఆక్సిజెన్ సిలెండర్ స్టాండ్లు ప్రతి కోచ్ లోనూ అందుబాటులో ఉంచారు. 

పెద్ద డస్ట్ బిన్ ప్రతి కోచ్ లో నూ

ఉంచారు. 

ప్రతి కోచ్ నూ దోమతెరల తో మూసి వేస్తూ అమర్చారు. 

ప్రతి కోచ్ నూ ఎప్పడికప్పుడు క్లినికల్ క్లీనింగ్ చేసే విధంగా సిబ్బందిని అందుబాటులో

ఉంచుతున్నారు. 

ఈ కోచ్ ల్లో ఎవరైనా బాధితులు వచ్చిన సమయంలో రక్షణ సామాగ్రి మాస్క్ లు, పీపీఈ లు, శానిటైజర్లు సరఫరా చెయ్యబడుతుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - Jun 2, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam