DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవస్థానం పై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు : భద్రాచలం ఏఈఓ

*భద్రాచలం రామాలయ అధికారుల హెచ్చరిక. . . .* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

భద్రాచలం / విశాఖపట్నం, ఏప్రిల్ 24, 2020 (డిఎన్ఎస్) : కరోనా వ్యాధి రావడానికి

భద్రాచలం రాముని ఆగ్రహమే క్రమం అంటూ కొందరు ఇటీవల సోషల్ మీడియా లో దుష్ప్రచారం చేయడాన్ని ఆలయ అధికారులు తప్పుపట్టారు. ఈ మేరకు మీడియా కు విడుదల చేసిన ప్రకటనలో

ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడో చైనా లో పుట్టిన కరోనా కు తెలంగాణాలోని భద్రాచలం లో ఉన్న శ్రీరాముని

ఆగ్రహం కారణం అవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఇది ఆలయ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నం గా అభివర్ణించారు. ఆలయం లో ఎటువంటి లోటు లేకుండా అన్ని

ఆరాధనలు, ఉత్సవాలు ఏకాంతంలోనే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులకు ప్రవేశం లేని ఆలయంలో జరుగుతున్నా సేవలపై వీరు సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చెయ్యడం

ఏంటని ప్రశ్నించారు. à°ˆ ప్రకటన సహాయ కార్యనిర్వహణాధికారి పేరిట విడుదల చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam