DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం కంటైన్మెంటు జోన్ లో కలెక్టర్, ఎస్పి పర్యటన 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి, రిపోర్టర్, శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మే 04, 2020 (డిఎన్ఎస్): శ్రీకాకుళం పట్టణంలో కంటైన్మెంటు జోన్ పి.ఎన్.కాలనీలో జిల్లా కలెక్టర్ జె

నివాస్, పోలీసు సూపరింటిండెంట్ ఆర్.ఎన్.అమ్మి రెడ్డి సోమ వారం పర్యటించారు. కంటైన్మెంటు జోన్ లో పరిస్ధితులను పరిశీలించారు. వ్యక్తుల రాకపోకలు అడిగి

తెలుసుకున్నారు. పి.ఎన్.కాలనీ మొత్తం పది లైన్లను కంటైన్మెంటు జోను చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని నగర పాలక సంస్ధ కమీషనర్ ను ఆదేశించారు.

అవసరమైన అన్ని ప్రదేశాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంటైన్మెంటు జోన్ నుండి ఏ ఒక్క వ్యక్తి బయటకు రాకూడదని, అదేవిధంగా కంటైన్మెంటు జోన్ లోకి

ఏ వ్యక్తి ప్రవేశించరాదని అన్నారు. తాగు నీరు, నిత్యావసరాలు విధిగా అందాలని పేర్కొన్నారు. 

దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాల్సిందే :  à°¦à±à°•à°¾à°£à°¾à°² వద్ద విధిగా

భౌతిక దూరం పాటించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. దుకాణాల వద్ద రద్దీగా ఉంటే అటువంటి దుకాణాలను మూసివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వ్యక్తులు దూరంగా

ఉండేందుకు మార్కింగు చేయాలని సూచించారు. మార్కెట్ లో పలు దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తుందని అటువంటి దుకాణాలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మద్యం దుకాణాలు

సాయంత్రం 7 à°—à°‚à°Ÿà°² వరకు ఉంటాయని ఎక్కడా రద్దీ ఉండరాదని ఆయన పేర్కొన్నారు. 
    à°ˆ కార్యక్రమంలో నగర పాలక సంస్ధ కమీషనర్ పి.నల్లనయ్య, ఇన్ ఛార్జ్ ఆర్డిఓ ఆర్.గణపతి,

ప్రత్యేక అధికారి టివివి ప్రసాద్, డిప్యూటి ఇఇ దక్షిణా మూర్తి, పోలీసు, నగర పాలక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam