DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గత పాలకులు చేసిన తప్పిదం పై నిందలు మాకెలా వేస్తారు?

*దేవాలయ భూముల అమ్మకాలపై సీఎం వైఎస్ జగన్ సీరియస్*

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 26, 2020 (డి ఎన్ ఎస్ ): రాష్ట్రంలోని హిందూ దేవాలయాల భూములు, ఇతర

ఆస్తుల అమ్మకాలపై నిర్ణయాలు తీసుకుంటూ à°—à°¤ పాలకులు చేసిన తప్పిదం పై  à°¨à°¿à°‚దనలను ప్రస్తుత ప్రభుత్వం పై ఎలా వేస్తారు అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

మోహన్ రెడ్డి మండిపడ్డారు.   

తిరుమల తిరుపతి దేవస్థానములు ( టీటీడీ ) భూముల అమ్మకాల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 2016,

జనవరి 30à°¨ టీటీడీ బోర్డు చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

కాగా గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలను చూపెడుతూ ఇప్పుడు తప్పుడు ప్రచారం

చేస్తుంటే ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారంటూ జగన్ సీరియస్ అయ్యారు. 
టీటీడీ సహా దేవాదాయశాఖ భూముల జోలికి పోవద్దని సీఎం స్పష్టం చేసారు. దేవాదాయశాఖ భూముల

పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గుర్తుంచుకోవాలని జగన్ అన్నారు. లేని అంశాలను అదే పనిగా ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేయాలనీ చూస్తున్న

పార్టీల పట్ల , వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam