DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*కరోనా పై ఆకాశవాణి లో ఒక్కరే  200 ప్రత్యేక బులెటిన్లు పూర్తి* 

*అలసటే తెలియని ఏఐఆర్ వార్తా విభాగం అధికారి*

*ఆకాశవాణి లో . . అభినవ సవ్య సాచి డా. జికె* 

*ప్రసార మాధ్యమాల పాత్రపై  DNS వార్షికోత్సవ ప్రత్యేక కధనం*  

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  14, 2020 (డిఎన్ఎస్):* గత మార్చి 26 నుంచి కరోనా పై  ఆకాశవాణి లో ప్రసారం అవుతున్న

ప్రత్యేక బులెటిన్లు లో సుమారు 200  కి పైగా ఒక్కరే నిర్విరామంగా ప్రసారం చేసిన వ్యక్తి ఒక్కరే అంటే ఆశ్చర్యం కలుగక మానదు. 

 ఆయనొక సవ్యసాచి, అర్జుడు వేగంతో కచ్చితమైన లక్ష్యాన్ని చేధించే విధంగా శస్త్రాలు వదలగలిగే నేర్పుండటంతో సవ్యసాచి అనేపేరు సార్ధకం అయింది.అయితే అది ఆనాటి భారతంలో!

ఇక నేటి భారతం

లోకి వస్తే ఈయన అభినవ సవ్య సాచి. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ నుండి కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖలో చేరి వివిధ హొదాల్లో పనిచేసి పనిచేసిన చోటల్లా రాణించి పలువురి మన్ననలు పొందిన ఆయనే డా.జి.కొండలరావు. జి కె గా  సుప్రసిద్ధులైన   ఆయన విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ప్రాంతీయ వార్తా విభాగాధి పతిగా   2017 సంవత్సరం

అక్టోబర్ లో షుమారు మూడేళ్ళ క్రితం పదవీ భాధ్యతలు చేపట్టిన నాటినుండి స్టేట్ హెడ్ క్వార్టర్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న ప్రాంతీయ వార్తల్లో నిష్పాక్షిత, నాణ్యత, నిబద్ధత, ఉన్నత ప్రమాణాలతో  వార్తలతో పాటు శాస్త్ర, సాంకేతిక, తుఫాన్లు, కల్చర్, అగ్రి కల్చర్ తదితర అంశాలపై కూడా తాజా వార్తలు ప్రసారం చేసి వివిధ వర్గాల

మన్ననలను పొందటంతో పాటు వార్తల్లో కూడా కొత్త వరవడి తెచ్చి వార్తా శ్రోతలను ఆకట్టుకోవడం లో ఎనలేని కృషి ఒక వైపు, మరోవైపు న్యూస్ యూనిట్ మొత్తంలో ఉన్న ఒకే ఒక్క పూర్తీ స్థాయి అధికారి అయిన ఆయనే వార్త విభాగంలోని ఇతర తాత్కాలిక ఉద్యోగుల అజమాయిషీ, ఆదేశాలు, కావలసిన రీతిలో వార్తలు రప్పించుకోవటం. వీటికి అదనంగా ఈ విభాగం

అధీనంలోనే ప్రసారమయ్యే వార్తా వ్యాఖ్య, వార్తావాహిని, జిల్లా సమాచార లేఖలను వ్యాఖ్యార్ధం చెడకుండా ఎడిటింగ్ చెయ్యటం తో పాటు వివిధ అంశాలపై పలు శాఖల నిపుణులతో చర్చాగోష్ఠులు, ఇంటర్వ్యూలు నిర్వహించటంతో పాటు పాలనావ్యవహారాలు చూడటం, రాష్ట్ర రాజధాని అయినందున తరచూ జరిగే ప్రభుత్వ ముఖ్య సమావేశాలకు, మీడియా సమావేశములకు

హాజరవటం లాంటి నాలుగు ముఖ్య భూమికలు నిర్వహిస్తున్న ఒకేఒక్క అధికారి ఆయన. ఆయనను సవ్యసాచి అనటం కూడా తక్కువేనేమో! తెల్లవారిఝాము మొదలైన ఆయన విధి నిర్వహణ రాత్రి 8 లేదా 9 గంటలకు గాని ముగుస్తుందని తెలిసిన వారు పేర్కొన్నారు. ఆయనొక పని రాక్షసుడు అని ముద్దుగా పిలుస్తారు పలువురు ఆయన పరోక్షంలో.

విజయవాడ ఆకాశవాణి

కేంద్రం వార్తా విభాగం అధిపతిగా ఛార్జ్ తీసుకున్న వెంటనే షాన్ తుఫాన్ సృష్టించిన విలయం వార్తలు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు, 2019 లో జరిగిన   సార్వత్రిక ఎన్నికల వార్తలు, ఈ సంవత్సరం మార్చ్ నుండి కోవిడ్ 19 మహమ్మారి చేస్తున్న విలయం లాంటి విపరీతాలు ఆయనకు గుక్క తిప్పుకోకుండా చేస్తున్నప్పటికీ, పూర్తీ స్థాయి సిబ్బంది

లేరు మనకెందుకు అనుకోకుండా ఒంటరిగానే ఎప్పటికప్పుడు ప్రత్యేక వార్తా ప్రసారాలు, ప్రత్యేక చర్చా గోష్ఠులు, ఇన్టర్వ్యూలు నిర్వహిస్తూ ఉన్న తాత్కాలిక సిబ్బంది తోనే, వారికి పదును పెట్టి, అలుపు ఎరుగని పోరాటం చేస్తున్న ఒకే ఒక్క అధికారి డా. జి. కొండలరావు. (జి.కె)

తాజాగా విలయతాండవం చేస్తున్న నోవేల్ కరోనా కోవిడ్ 19

చేస్తున్న విలయతాండవం పై ఎప్పటికప్పుడు తాజావార్తలు, జాగ్రత్తలు, తదితర అంశాలను శ్రోతలకు అందించాలనే ఆదేశం మేరకు మార్చ్ 26 నుండి ప్రత్యేక వార్తా బులెటిన్లు ప్రవేశపెట్టి నిన్నటికి అంటే శనివారం నాటికి 200 బులెటిన్ లు విజయవంతంగా ఓకే ఒక్కరై తన వద్దనున్న క్యాజువల్స్ తోనే పూర్తీ చేయటం, అలాగే విజయవాడ ఎఫ్ ఎం కృష్ణవేణి,

విశాఖపట్నం ఎఫ్ ఎం సముద్రిక రెయిన్బో ల నుండి ప్రసారమయ్యే హెడ్ లైన్స్ వార్తలను 2నిమిషాలనుండి 3 నిమిషాలకు పెంచి ఈ రెండు స్టేషన్ ల ద్వారా ఎఫ్ ఎం హెడ్ లైన్స్ లను గంట గంటకు  శ్రోతలను అందిస్తున్న విషయంలో డా.కొండలరావు సేవలను పలువురు శ్రోతలు ప్రభుత్వ, స్వచ్చంద, రాజకీయ తదితర వర్గాలు ప్రశంసిస్తున్నాయి.ఇంతటి అంకిత భావం

చిత్త శుద్ధి ,శ్రోతలను ఏప్పటికప్పుడు నూతన వరవడితో కూడిన వార్తలు అందిస్తూ మరింతమంది శ్రోతల సంఖ్య పెంచటంలో ఆయన విజయం సాధించి ఆకాశవాణి కి మరింత పేరు ప్రఖ్యాతలు తెచ్చి ప్రజలను మరింత ఆకర్షిస్తారనుట లో సందేహం లేదు.

 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam