DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కర్ణాటక సేవసింధులో అనుమతి ఉంటేనే బెంగళూరు టికెట్ బుకింగ్

*కాకినాడ నుంచి బెంగుళూరు బస్సులకు మంచి స్పందన.*

*అత్యంత భద్రతా, రక్షణ తో 50 % ఆక్యుపెన్సీ తోనే సేవలు*  

*జిల్లాలో ప్రధాన కేంద్రాలకు నిరంతర బస్సు సేవలు. . .*

*DNS తో  తూగో జిల్లా ఆర్టీసీ ఆర్ఎం  ఆర్ వి ఎస్ నాగేశ్వర రావు.*  

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*. . .

*అమరావతి,

 జూన్  19, 2020 (డిఎన్ఎస్):* లాక్ డౌన్ తొలగించిన తదుపరి ఆంధ్ర ప్రదేశ్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి వెళ్లేందుకు పూర్తి అనుమతులు లభించిన తరుణంలో కాకినాడ నుంచి బెంగుళూరు కు బస్సు మార్గం సుగమం అయ్యింది. అత్యంత సురక్ష, భద్రతా ప్రమాణాలతో కాకినాడ నుంచి బెంగుళూరు కు ప్రతి రోజు ఒక బస్సు నడుపుతున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రజా రవాణా

సంస్థ (ఏపీఎస్ ఆర్ టీసీ) తూర్పు గోదావరి ప్రాంతీయ అధికారి ఆర్ వి ఎస్ నాగేశ్వర రావు తెలియచేస్తున్నారు.ఈ నేపథ్యంలో జిల్లా పరిధిలో ప్రజా రవాణా సంస్థ అందిస్తున్న బస్సు సర్వీసుల వివరాలను రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయంలో అయన  DNS కు వివరించారు. 

లాక్ డౌన్ నేపధ్యం లో ఇక్కడ చిక్కుకు పోయిన ఉద్యోగులు,

విద్యార్థులు, ప్రయాణీకులు తమ గమ్య స్థానాలకు వెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయన్నారు.  ప్రధానంగా బెంగుళూరు కు వెళ్ళవలసిన ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రతి రోజు ఒక బసు సర్వీస్ ను నడుపుతోందన్నారు. ఈ బస్సులో టికెట్ కొనుగోలు చేయదలచిన ప్రయాణీకులు తప్పని సరిగా

పాటించవలసిన నిబంధనలు ఇవే:. .

1 . టికెట్ కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే అమ్మబడుతుంది. 
2 . బెంగుళూరు ( కర్ణాటక ) వెళ్లే ప్రయాణికునికి తప్పనిసరిగా కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఉండాలి. 
3 . కర్ణాటక ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్  సేవా సింధు వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకున్న వారికీ మాత్రమే కర్ణాటక అనుమతి ఇస్తుంది.
/> 4 . కర్ణాటక అనుమతి ఉన్నవారికి మాత్రమే ఏపీఎస్ ఆర్ టీ సి వెబ్ సైట్ నుంచి టికెట్ కేటాయించబడుతుంది. 
5 . కేవలం నాన్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సులు మాత్రమే నడుపబడుతాయి.  
6 . బస్సు కాకినాడ నుంచే బయలుదేరుతుంది, రాజమండ్రి ప్రయాణికులు కూడా కాకినాడలోని బస్సు ఎక్కవలసి యుంటుంది. 
7 . బస్సులో కేవలం డ్రైవర్ మాత్రమే ఉంటారు.

అరలీటరు శానిటైజర్ ప్రతి బస్సుకు కేటాయించాము. బస్సులో సగం సీట్లు మాత్రమే భర్తీ చేయబడతాయి. 
8 .డిపో నుంచి డిపో కు మాత్రమే బస్సులు నడపబడతాయి. కేవలం అతి పరిమితి స్టాప్ లు మాత్రమే ఉన్నాయి. 
9 . ప్రతి ప్రయాణీకులు ప్రభుత్వం ఇచ్చిన రెండు దరఖాస్తులను కచ్చితంగా నింపాల్సియుంటుంది. 
10 . ఆర్ధిక భారం ఉన్నప్పటికీ టికెట్

ధరలను పెంచలేదు. 
11 . ప్రతి ప్రయాణీకుడు తప్పని సరిగా ముఖానికి మాస్క్ ధరించాలన్నారు. 

జిల్లాలో అలుపెరగని ఆర్టీసీ సేవలు: . . . 

ఇక జిల్లాలోని ప్రధాన పట్టణాలకు వివిధ డిపో ల నుంచి బస్సు సర్వీసులను నడుపుతు ప్రజా రవాణా సంస్థ అలుపెరుగని సేవలు అందిస్తున్నట్టు నాగేశ్వర రావు తెలియచేసారు. జిల్లా ప్రధాన

కేంద్రాలైన కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం తదితర ప్రాంతాల నుంచి రావులపాలెం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, తదితర ప్రాంతాలకు క్రమం తప్పకుండా సర్వీసులను నడుపుతున్నామని వివరించారు. 

పూర్తి భద్రతలో ఆర్ టీ సి సిబ్బంది. . : . .

తమ ఆర్టీసీ సిబ్బంది అందరినీ పూర్తి సురక్షిత భద్రతా

వలయంలోనే ఉంచామని, బస్ కాంప్లెక్స్ లు, డిపో లు, మెకానికల్ గేరేజ్ లు, సర్వీసింగ్ యూనిట్ లు ఇలా అన్ని ఆర్టీసీ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగి నీ ధర్మల్ స్కాన్ తో పరీక్షించి, శానిటైజర్ లు ఇచ్చి, ప్రతి గంట కో సారి చేతులు పరిశుభ్రం చేసుకునే విధంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. సిబ్బందిలోనే అంతర్గతంగా ఆవాహన

పెంచి, విధుల్లో పూర్తి స్థాయి భద్రతా కల్పించామన్నారు. 

నాలుగు రోజుల క్రితం విధులు నిర్వహించి ఇతర ప్రాంతానికి వెళ్లి వచ్చిన ఒక ఉద్యోగికి ఒకరికి వైరస్ సోకి పోజిటివ్ అని తేలడంతో వైద్య అధికారులు పూర్తి అప్రమత్తం అయ్యారన్నారు. ఆ గారేజ్ లో మొత్తం అతని సహచర సిబ్బంది అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించినట్టు

తెలిపారు. (నాలుగు రోజుల నుంచి అతను సెలవులో ఉన్నట్టు తెలిపారు.) 
పూర్తి సురక్ష భద్రతా వలయం సిబ్బందికి కల్పించామన్నారు.  

తెలంగాణ నుంచి అనుమతి రాలేదు.:  . . .

తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా నడిచే బస్సు సర్వీసులు హైదరాబాద్, గంగావతి లకేనని, అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నుంచి

అనుమతులు రానందున హైదరాబాద్ కు బస్సు సేవలను నడపడం లేదన్నారు. ఇరు ప్రభుత్వాల మధ్య చర్చలు సఫలం అయితే త్వరలోనే జిల్లా నుంచి హైదరాబాద్ కు బస్సు సేవలను నడుపుతామన్నారు. 

పూర్తి సిబ్బంది తో విధుల్లో ఉన్నాం:. .. 

తూర్పు గోదావరి ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ఉన్న ఆర్ టీసీ సిబ్బంది పూర్తిగా వీధుల్లోనే

ఉన్నారని ఆర్ ఎం తెలిపారు. అయితే బస్సుల్లో కేవలం డ్రైవర్లు మాత్రమే విధులు ఉంటారని, కండక్టర్లు బస్సు ఎక్కారని, బస్సు కాంప్లెక్స్ లోనే బస్సుల బయటే నిలబడి ప్రయాణీకుల టికెట్ లను చెక్ చెయ్యడం, విక్రయించడం జరుగుతుందన్నారు. అక్కడే ప్రతి ఒక్క ప్రయాణీకునికి ధర్మల్ స్కాన్,  శానిటైజర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మిగిలిన

సిబ్బందిని అవసరమైన ప్రదేశాల్లోనూ, ప్రయాణీకులకు అవహగానా కల్పించడంలోనూ వినియోగిస్తున్నామన్నారు. 

కరోనా ప్రభావం పూర్తి తగ్గి, ప్రశాంత వాతావరణం కల్గిన వెంటనే యధావిధిగా ఆర్టీసీ సేవలు నడపాలని సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. 

జిల్లా లోని పూర్తి పర్యవేక్షణ :. . .

తమ ప్రాంతీయ కార్యాలయం

పరిధిలోని అన్ని డిపో లు, కాంప్లెక్స్ ల్లో కోవిడ్ 19 రక్షణ ఏర్పాట్లను ఎప్పడికప్పుడు పర్యవేశించేందుకు, సిబ్బందిని వినియోగిస్తున్నట్టు ప్రాంతీయ అధికారి నాగేశ్వర రావు తెలియచేస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam